100-year journey of the RSS : ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 ఏళ్లు అయ్యింది. ఈ సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది. నాగాపూర్ లో డాక్టర్ హెగ్డేవాల్ అనే నేత చిన్న వ్యక్తులతో స్థాపించిన ఈ సంఘం.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జీవోగా మారింది. దేశంలో అత్యంత ప్రభావిత సంస్థగా మారింది. దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీకి మాతృసంస్థ, దీనికి కార్మిక, ధర్మిక సంస్థలున్నాయి.
ఒకనాడు మహారాష్ట్రకే పరిమితమైన ఆర్ఎస్ఎస్ అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలకు పాకింది. దీని గురించి విశ్లేషణ చేసేముందు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.
ఆర్ఎస్ఎస్ ప్రధాన ముద్ర ఏంటంటే.. మహాత్మాగాంధీ హత్యలో ఆర్ఎస్ఎస్ ముద్ర ఉందని ఆరోపణలున్నాయి. నాథురాంగాడ్సే మూలాలు ఆర్ఎస్ఎస్ లో ఉన్నాయి.
చరిత్ర చూస్తే.. గాంధీ హత్యతోనే ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించారు. తర్వాత దీనిపై దర్యాప్తు చేసిన తర్వాత ఆర్ఎస్ఎస్ సంస్థకు సంబంధం లేదని కోర్టులు, దర్యాప్తులు తేల్చాయి.
ఒకనాడు అంటరాని RSS ఇప్పుడు అందరి సంస్థగా ఎలా మారింది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.