Kishan Reddy : కిషన్ రెడ్డి – ఈటెల రాజేందర్ ల సమిష్టి నాయకత్వం బీజేపీ కి కలిసొస్తుందా?

ప్రతి సబ్జెక్ట్ మీద బండికి పట్టులేదు. అన్నింటికంటే బండి సంజయ్ ను తీసివేయడానికి ప్రధాన కారణం.. ‘నాయకత్వ లోపం’.. నాయకులందరినీ కలుపుకొని పోవడంలో బండి సంజయ్ విఫలం అయ్యారు.

Written By: NARESH, Updated On : July 5, 2023 9:57 pm
Follow us on

Kishan Reddy : తెలంగాణ బీజేపీకి కొత్తగా కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా నియామకం అయ్యారు. బండి సంజయ్ దూకుడుగా ఉండడం వల్లనే బీజేపీకి కలిసివచ్చింది. కేసీఆర్ ను ఎదుర్కోవడంలో బండి సంజయ్ బలంగా నిలబడ్డాడు. అయితే బండి సంజయ్ మాటలు తిట్టడం మైనస్ గా మారింది. ప్రతి సబ్జెక్ట్ మీద బండికి పట్టులేదు. అన్నింటికంటే బండి సంజయ్ ను తీసివేయడానికి ప్రధాన కారణం.. ‘నాయకత్వ లోపం’.. నాయకులందరినీ కలుపుకొని పోవడంలో బండి సంజయ్ విఫలం అయ్యారు.

అంతేకాదు నిన్నటి వరకు సాహో సంజయ్ అంటూ భుజం తట్టిన భారతీయ జనతా పార్టీ పెద్దలు ఇప్పుడు అవమానకర రీతిలో తొలగించడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కరోనా సమయంలో బాధ్యతలు చేపట్టి భారత రాష్ట్ర సమితి తో ఢీ అంటే ఢీ అన్నట్టు పార్టీని విస్తరించిన బండి సంజయ్ ని మార్చడం ద్వారా తెలంగాణలో పూడ్చలేని అపఖ్యాతిని మూటగట్టుకుందని వాపోతున్నారు. సభలు జరిగినప్పుడు సాహో సంజయ్ అని పొగిడిన ప్రధానమంత్రి, హోం శాఖ మంత్రి, జాతీయ అధ్యక్షుడు.. తీరా ఎన్నికల సమయంలో ఇలా చేయడాన్ని పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. అధిష్టానం నిర్ణయాన్ని సోషల్ మీడియాలో లక్షల మంది తప్పు పడుతున్నారు. కష్టపడే నాయకుడికి దక్కిన ప్రతిఫలం ఇదేనా అంటూ నిలదీస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.

కిషన్ రెడ్డి – ఈటెల రాజేందర్ ల సమిష్టి నాయకత్వం బీజేపీ కి కలిసొస్తుందా? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..