KCR – KTR : కేసీఆర్ 115 అభ్యర్థుల ప్రకటనలో కేటీఆర్ ఎందుకు లేడు?

కేటీఆర్ లేకుండానే అభ్యర్థుల లిస్ట్ ను కేసీఆర్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. దానికి కారణాలు ఏమైనా కేటీఆర్ గైర్హాజరు మాత్రం ఏదో తేడా కొట్టిందన్న ప్రచారానికి ఆస్కారం కల్పించింది.

Written By: NARESH, Updated On : August 21, 2023 4:28 pm
Follow us on

KCR – KTR : గులాబీ దళపతి కేసీఆర్ సారథ్యంలోనే 2024 ఎన్నికలను బీఆర్ఎస్ ఎదుర్కోబోతోంది. ఈ మేరకు ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ముందుగానే కేసీఆర్ ప్రకటించి సంచలనం సృష్టించారు. సీట్ల కేటాయింపులో ఈసారి సీనియర్లు అందరికీ మంగళం పాడి యువతకు టికెట్లు ఇస్తారని అందరూ అనుకున్నారు. ఈసారి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోయి కేటీఆర్ ను సీఎం చేస్తారని అనుకున్నారు.

కానీ కేంద్రంలో మోడీ బలంగా ఉండడం.. కేసీఆర్ జాతీయ కలలు నెరవేరే సూచనలు కనిపించకపోవడంతో కేసీఆర్ మరోసారి రాష్ట్ర సీఎంగానే ఉండాలని ఫిక్స్ అయ్యారు. ఇక పార్టీలో గడబిడలు, అసమ్మతులు, అసంతృప్తులకు తావు ఇవ్వకుండా అందరూ సిట్టింగులకే సీట్లు ఇచ్చారు. ఓ ఏడు ఎనిమిది మంది వివాదాస్పదులను మాత్రమే మార్చేశారు.

ఇక కేటీఆర్ అనుచరుడు అయిన జాన్సన్ కు ఖానాపూర్ ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. ఈ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ ను మార్చేశారు. ఇక మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, హైదరాబాద్ మాజీ మేయర్
బొంతు రామ్మోహన్ ల కోసం కేటీఆర్ పట్టుబట్టినట్టు తెలిసింది. ఇందులో బొంతు రామ్మోహన్ కు మినహా ఇద్దరికీ సీట్లు కేటాయించారు.

ఇక కేటీఆర్ బ్యాచ్ లోని యువ నేతలకు పెద్దగా టికెట్లు రాలేదు. కోరుట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడుకుకు ఇచ్చారు. మిగతా అంతా సీనియర్లే. ఇక కంటోన్మెంట్ ప్లేసులో సాయన్న కూతురు లాస్యకే టికెట్ ఇచ్చారు. ఇక్కడ కేటీఆర్ చెప్పినా కేసీఆర్ లెక్క చేయలేదని.. తలసాని సూచనల మేరకే లాస్యకు ఇచ్చినట్టు తెలిసింది.

ఏకపక్షంగా పాతవారికే సీట్లు ఇవ్వడాన్ని కేటీఆర్ ఒప్పుకోలేదని తెలిసింది. ఓ 20 నుంచి 30 మంది వ్యతిరేకత ఉన్నవారిని మార్చాలని కేటీఆర్ పట్టుబట్టినట్టు ప్రచారం సాగుతోంది. అయితే కేసీఆర్ ఒప్పుకోకుండా మొత్తం 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించడంతోనే అలిగి కేసీఆర్ ప్రెస్ మీట్ కు రాలేదని ప్రచారం సాగుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ లేకుండానే అభ్యర్థుల లిస్ట్ ను కేసీఆర్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. దానికి కారణాలు ఏమైనా కేటీఆర్ గైర్హాజరు మాత్రం ఏదో తేడా కొట్టిందన్న ప్రచారానికి ఆస్కారం కల్పించింది.