Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Crying: నక్సలైట్ల బాంబు పేలుళ్లకు చలించని చంద్రబాబు.. ఇప్పుడిలా ఎందుకయ్యారు?

Chandrababu Crying: నక్సలైట్ల బాంబు పేలుళ్లకు చలించని చంద్రబాబు.. ఇప్పుడిలా ఎందుకయ్యారు?

Chandrababu Crying: టీడీపీ అధినేత చంద్రబాబు కన్నీళ్లే ఇప్పుడు హాట్ టాపిక్. ఆయన ఏడుపుపైన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చ. ఎంతో ధైర్యవంతుడు.. అనాధిగా రాజకీయాలను శాసించిన నేత.. ఇలా బేలగా ఏడ్వడం చూసి అందరూ అయ్యో పాపం అంటున్నారు. ఎన్టీఆర్ నుంచి వైఎస్ఆర్, జగన్ వరకూ అందరినీ ఓ ఆట ఆడించి ముప్పు తిప్పలు పెట్టి రాజకీయంగా మూడు చెరువుల నీళ్లు తాగించిన చంద్రబాబు యేనా ఇంత బేలగా ఏడ్చిందని అందరూ అనుకున్నారు.

Also Read: చంద్రబాబు.. నాడు ఏడిపించాడు.. నేడు ఏడ్చాడు

chandrababu crying alipiri
chandrababu crying alipiri

అది 2004కు ముందు సంగతి. మావోయిస్టులు తిరుపతిలోని అలిపిరి వద్ద నాటి ఏపీ సీఎం చంద్రబాబుపై బాంబు బ్లాస్ట్ చేశారు. క్లైమర్ మైన్స్ పెట్టి చంద్రబాబు వాహనాన్ని పేల్చేశారు. అయినా కూడా చంద్రబాబు ధైర్యం చేజారలేదు. రక్తమోడుతున్నా కారులోంచి లేచి ‘ఏం కాలేదు బ్రదర్’ అంటూ ధైర్యంతో వెళ్లిన పెద్దమనిషి. మనుసులో రాజకీయంగా ఎంత బాధ ఉన్నా కూడా గంభీరంగా ఉండేవాడు. ఎన్ని సంక్షోభాలు ఎదురైనా చంద్రబాబు కంట కన్నీరు పెట్టలేదు. అలా బాధపడడం టీడీపీ సీనియర్లు ఎవరూ చూడలేదు.

కానీ శుక్రవారం శాసనసభలో జరిగిన అవమానంతో చంద్రబాబు చలించిపోయాడు. తన భార్యను నానా మాటలు అన్న వైసీపీ ఎమ్మెల్యేల తీరుకు ఆవేదన చెందారు. నిండు మీడియా సమావేశంలో భోరున విలపించారు.

ఎన్టీఆర్, చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురమల్లి జనార్ధన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి ఉద్దండ పిండాలతో ఢీ అంటే ఢీ అని ధీటుగా నిలబడ్డాడు చంద్రబాబు.. మీడియా, వ్యవస్థల మేనేజ్ మెంట్ లో ఆరితేరారు. వాటితో వారి తాట తీసేవారు. కానీ తాజాగా వైసీపీ ఎమ్మెల్యేలు తన భార్య వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అవమానంగా మాట్లాడి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తట్టుకోలేకపోయారు. తీవ్రంగా కృంగిపోయి బోరున విలపించారు.

విద్యార్థి నాయకుడిగా మొదలైన చంద్రబాబు రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ లో చిన్న వయసులోనే మంత్రి అయ్యే వరకూ సాగింది. ఒకానొక సమయంలో వాజ్ పేయి హయాంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ప్రధానులను, రాష్ట్రపతిని నామినేట్ చేసే వరకూ చంద్రబాబు ఎదిగారు. 1983లో తొలిసారి చంద్రగిరి నుంచి చంద్రబాబు ఎమ్మెల్యేగా ఓడారు. 2004,2009లో రెండు సార్లు అధికారం పోయినా చంద్రబాబు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. నిరాశ చెందలేదు. తిరుపతిలో మావోయిస్టులు బాంబు పేల్చినా చంద్రబాబు కంట ఒక్క చుక్క కన్నీరు రాలేదు. 2019లో జగన్ చేతిలో చిత్తుగా ఓడినా సరే కుంగిపోలేదు. కానీ వైసీపీ ఎమ్మెల్యేల దారుణ వ్యాఖ్యలకు.. ఆయన భార్యను అంటే మాత్రం తట్టుకోలేకపోయారు. తన సహచరిని అనేసరికి కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఎప్పుడూ ఎన్ని అన్నా కూడా ధైర్యంతో ఉన్న బాబు తన భార్యను అనేసరికి మాత్రం తట్టుకోలేకపోయారు.

చంద్రబాబు కన్నీళ్లను చూసి టీడీపీ సీనియర్లు, నేతలు అంతా ఇప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి బాసటగా నిలిచారు. వైసీపీ చర్యలకు వ్యతిరేకంగా పోరుబాటకు శ్రీకారం చుట్టారు.

చంద్రబాబు పాత కాలం రాజకీయాలకు కాలంచెల్లింది. నేటి నవతరం రాజకీయాలకు ఆయన అలవాటు పడలేకపోతున్నారు. యువకుడైన వైఎస్ జగన్ అటాకింగ్ రాజకీయాలను తట్టుకోలేకపోతున్నారు. దూకుడుగా ముందుకెళుతూ టీడీపీతో ఢీ అంటే ఢీ అంటున్న ఈ వర్తమాన రాజకీయాలను చంద్రబాబు ఓన్ చేసుకోలేకపోతున్నారు. ఆయనకు వృద్ధాప్యం దరిచేరడం.. యువకుడైన జగన్ తో పోటీ పడలేకపోవడం.. ఇక తన తర్వాత కుమారుడు లోకేష్ అంత బలంగా లేకపోవడం కూడా చంద్రబాబులో మానసిక స్థైర్యం తగ్గడానికి కారణమైంది. తన తర్వాత పార్టీ భవిష్యత్ పై చంద్రబాబులో ఆందోళన కూడా ఈ ఆవేదనకు ఓ కారణంగా చెప్పొచ్చు. జగన్ ను ఢీ అంటే ఢీ అనలేకపోవడం.. వారితో పోటీపడలేకపోవడం.. నయా రాజకీయాలను చేయలేకపోవడం.. ఇలా చంద్రబాబు ఆవేదన కన్నీళ్లకు కారణమైంది. ఇప్పటికైనా చంద్రబాబు మారి ఇప్పటి రాజకీయాలను అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Also Read: వైరల్ వీడియో: వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు.. సంచలన శపథం

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular