Waltair Veerayya Pre Release Event Chiranjeevi Speech : సాధారణంగా తమ మూవీ విడుదలవుతుందంటే అందులో అద్భుతాలు ఉన్నాయని.. సినిమాలు చూడాలని చెబుతుంటారు. కానీ తన సినిమాలోని ట్విస్ట్ లు, యాక్షన్ లు, అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్ లాంటి అన్ని విషయాలను చిరంజీవి లీక్ చేశారు. పక్కనే దర్శకుడు బాబీ చెప్పకండి సార్ అంటూ చిరంజీవిని కంట్రోల్ చేస్తూనే ఉన్నా.. చిరంజీవి మాత్రం అద్భుతంగా వచ్చిన తన చిత్రం గురించి లీకులు ఇవ్వకుండా ఉండలేకపోయారు.

చిరంజీవి, రవితేజ హీరోలుగా బాబీ దర్శకత్వంలో రూపొందిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సంక్రాంతి కానుకగా ఈనెల 13న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ప్రిరిలీజ్ వేడుకను ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ వేడుకలో మాట్లాడిన చిరంజీవి సినిమా అవుట్ పూట్ చూశానని.. అద్భుతంగా వచ్చిందంటూ సినిమాలోని కీలక ట్విస్ట్ లు, పాత్రల తీరుతెన్నులన్నీ లీక్ చేయడం సంచలనమైంది.
కేవలం సింగిల్ సిట్టింగ్ లో ఓకే అయిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ అని.. సినిమా కథ వినగానే బ్లాక్ బస్టర్ అని అర్థమైందని.. ఇలా తాను గెస్ట్ చేసిన సినిమాలన్నీ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాయని.. ఈ మూవీ కూడా అలానే అనిపించిందని చిరంజీవి అన్నారు. దర్శకుడు బాబీలో ఓ కథకుడు, రచయిత, స్క్రీన్ ప్లే రైటర్, దర్శకుడు ఉన్నాడని.. ఈ సినిమా అద్భుతంగా తీశాడని.. కమర్షియల్ సినిమానే కానీ.. అంతకుమించిన ఎమోషన్స్ ఉంటాయని.. నిజంగా ఇదొక ‘ఎమోషనల్ రోలర్ కోస్టర్’ అంటూ చిరంజీవి తన ‘వాల్తేరు వీరయ్య’ మూవీని ఆకాశానికెత్తేశాడు.

ఇక సెకండాఫ్ లో సినిమాకు ఊపు తెచ్చే కమిషనర్ పాత్రలో రవితేజ కనిపిస్తాడని.. రవితేజ పాత్ర ఓ రేంజ్ లో ఉంటుందని చిరంజీవి లీక్ చేశాడు. ఇక రాజేంద్రప్రసాద్ తోనే ఈ కథ ప్రారంభమవుతుందని.. ఆయన ఈ సినిమాలో నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ గా చేశాడని.. ఆయనతో ముగుస్తుందన్న విషయాన్ని చిరంజీవి బయటపెట్టడం విశేషం.
ఇదే కాదు.. విలన్ గా ప్రకాష్ రాజ్ ను పాత్రను, వెన్నెల కిషోర్, బాబీ సింహా సహా అందరి పాత్ర చిత్రణలను చిరంజీవి బయటపెట్టాడు.ప్రతీసారి దర్శకుడు బాబీ వారించడం.. చిరంజీవి చెప్పడంతో సినిమాపై చిరంజీవి బోలెడు ఆశలు పెట్టుకున్నాడని.. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అన్న ఆశలు ఏర్పడ్డాయి. సినిమాను నిన్ననే చూసిన చిరంజీవి అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చాడు. నో డౌట్ ఇది బ్లాక్ బస్టర్ మూవీ అంటూ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’పై తన మనోగతాన్ని ప్రిరిలీజ్ లో బయటపెట్టాడు. ఈ సంక్రాంతికి దున్నేస్తుందంటూ భరోసానింపారు.