Unstoppable with NBK S2 – Prabhas & Gopichand Episode : ప్రభాస్ ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు.. అసలు ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అన్నది ఇప్పుడు దేశంలోనే ఎవర్ గ్రీన్ ప్రశ్న. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న దానికంటే కూడా ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అన్నది అందరూ తెలుసుకోవాల్సిన ఆన్సర్. అలాంటి ప్రభాస్ పెళ్లిపై బాలయ్య ఆరాతీశారు. అందులో కొన్ని సంచలన నిజాలు బయటకొచ్చాయి.

‘ఆహా’ ఓటీటీ వేదికగా ఎంతో మంది ప్రముఖ సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేస్తున్న బాలకృష్ణ తాజాగా ఈ అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ టాక్ షోలో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను ఇంటర్వ్యూ చేశాడు. ఎప్పుడూ కాస్త సిగ్గుపడుతూ ఆలోచించే సమాధానాలు చెప్పే ప్రభాస్ ఇందులో చిన్న పిల్లాడిలా అల్లరి చేయడం విశేషం. బాలయ్య కోరిక మేరకు మొదట ‘డార్లింగ్ సార్’ అంటూ బాలయ్యను ప్రభాస్ పిలిచాడు.దీంతో గట్టిగా హత్తుకొని ప్రభాస్ ను వెన్నుతట్టాడు బాలయ్య. బాలకృష్ణ ప్రశ్నలకు ప్రభాస్ చేసిన హంగామా అల్లరి ఈ ఇంటర్వ్యూపై అంచనాలు పెంచేసింది.
ఇక పెళ్లి ఎప్పుడు అంటూ బాలయ్య కాస్త గట్టిగానే ఆరాతీశాడు. శర్వానంద్ ను అడిగితే ప్రభాస్ పెళ్లి తర్వాత అన్నాడని.. మరి ప్రభాస్ ఎప్పుడు చేసుకుంటావని బాలయ్య అడిగేశాడు. దీనికి ‘సల్మాన్ ఖాన్ పెళ్లి తర్వాత’ అంటూ ప్రభాస్ నవ్వుతూ సమాధానమిచ్చాడు.
ఇక తన జీవితంలోని ఒక అమ్మాయి ‘రాణి’ గురించి తన తోటి హీరో గోపీచంద్ లీకులు ఇవ్వడం.. ఓ ఫొటోను తెరపై చూపించడం.. దానికి ఆమె గురించి చెబితే ‘చంపేస్తాను గోపీ’ అంటూ ప్రభాస్ అరవడం కనిపించింది.
ఇక ‘ఒరేయ్ చరణ్.. నువ్వు నాకు స్నేహితుడివా లేకపోతే శత్రువా’ అంటూ రామ్ చరణ్ పై ఏదో ఒకటి లీక్ చేసినందుకు ప్రభాస్ అరవడం కూడా కనిపించింది. మొత్తంగా ప్రభాస్ ఈ ఎపిసోడ్ లో బాలయ్య ప్రశ్నలకు కొన్ని నిజాలు చెప్పాడని.. పెళ్లి గురించి ఓపెన్ అయ్యాడని.. అలాగే తన జీవితంలోని ‘అనుష్క’ గురించి.. రాణి అనే అమ్మాయి గురించి ఏదో చెప్పాడని ఆ వీడియో చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం ఆహా విడుదల చేసిన వీడియో వైరల్ అవుతోంది.
https://www.youtube.com/watch?v=wmCOHX1D1gA