Homeజాతీయ వార్తలుTRS Plenary Resolutions: టీఆర్ఎస్ ప్లీనరీ: కేసీఆర్ ప్లాన్ ఏంటి? ఏం చేయబోతున్నాడు?

TRS Plenary Resolutions: టీఆర్ఎస్ ప్లీనరీ: కేసీఆర్ ప్లాన్ ఏంటి? ఏం చేయబోతున్నాడు?

TRS Plenary Resolutions:  టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ కుండబద్దలు కొట్టాడు. తన భవిష్యత్ రాజకీయాలపై స్పష్టతనిచ్చాడు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడమే తన ఫోకస్ అని పరోక్షంగా హింట్ ఇచ్చాడు. అంతేకాదు.. ‘భారతీయ రాష్ట్ర సమితి’ అని తెలంగాణ రాష్ట్ర సమితి కావాలన్న డిమాండ్ ను నొక్కి వక్కాణించాడు. దీన్నీ బట్టి వచ్చే ఎన్నికల్లో ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే… ఢిల్లీ పీఠంపై బీజేపీ ఓడిపోతే ఖచ్చితంగా కేసీఆర్ జాతీయ నాయకుడిగా ఎదుగుతాడు. అందులో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భవిష్యత్ ప్లాన్ ఏంటి? ఆయన ఏం చేయబోతున్నాడన్న దానిపై క్లారిటీ ఇచ్చాడు. దానిపై స్పెషల్ ఫోకస్..

హుజూరాబాద్‌ ఎన్నికల తర్వాత కమలం పార్టీ కేసీఆర్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ఫలితాలతో తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారని పార్టీలో ఓ టాక్‌. ఎనిమిదేళ్ల పాలనలో ఈ ఏడాదిగా నిర్వహించిన పొలిటికల్‌ ప్రెస్‌మీట్లు ఎన్నడూ పెట్టలేదు. గతంలో ప్రగతభవన్, ఫామ్‌హౌస్‌ వీడి బయటకు వచ్చి ప్రజలు, నిరుద్యోగుల గురించి కేసీఆర్ ఆలోచించిన సందర్బాలు చాలా తక్కువ. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాలు ముఖ్యమంత్రిని ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చాయనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఏడేళ్లు కేంద్రంలోని బీజేపీతో సాన్నిహిత్యం కొనసాగించిన కేసీఆర్‌.. హుజూరాబాద్‌ ఫలితం తర్వాత మేల్కొన్నారు. బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు. రైతుల సమస్యను అడ్డం పెట్టుకుని గత వానాకాలం నుంచి పెద్ద యుద్ధమే చేస్తున్నారు. అయితే వరి యుద్ధంలో భారీ విజయం సాధిస్తానని అనుకున్న కేసీఆర్‌కు నిరాశే మిగిలింది. చి‘వరి’కి రైతులే గెలిచారు. ఈ నేపథ్యంలో 2024 జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని చిత్తు చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ పంచన చేరారు. శని, ఆదివారాల్లో ఆయనతో భేటీ నిర్వహించిన కేసీఆర్‌ సుదీర్ఘ మంతనాల తర్వాత టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో చేయాల్సిన 13 తీర్మానాలకు రూపకల్పన చేశారు.

TRS Plenary Resolutions
KCR

-ప్లీనరీ వేదికగా కేంద్రంపై గురి..
కేంద్రంపై పోరును ఉధృతం చేస్తూ టీఆర్‌ఎస్‌ ప్లీనరీ వేదికగా ఆ 13 తీర్మాన బాణాలను కేంద్ర ప్రభుత్వంపైకి గురిపెట్టారు. రాష్ట్ర ప్రయోజనాలు.. రాష్ట్రంలో పార్టీ బలేపేతం గురించి కాకుండా బీజేపీ–ప్రధాని మోదీ టార్గెట్‌గానే అన్ని తీర్మాణాలు ఉండడం గమనార్హం. తొలుత 11 తీర్మానాలే అనుకున్నా, చివరి నిమిషంలో మరో రెండిటిని జత చేశారు. ప్లీనరీలో టీఆర్‌ఎస్‌ పెడుతోన్న 13 తీర్మానాలూ కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకమైనవే కావడం గమనార్హం.

Also Read: KCR :  ఫ్లాష్… ఫ్లాష్.. కొత్త పార్టీపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

-ఇవీ తీర్మాన బాణాలు..

– యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన తీర్మానాన్ని వ్యసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రతిపాదిస్తారు.

– దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ కీలక భూమిక పోషించాలని ప్రతిపాదిస్తూ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెడుతారు.
– ఆకాశాన్ని అంటేలా ధరలు పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజల మీద మోయలేని భారం వేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధరలను నియంత్రించాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెడుతారు.

– చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసి అమలు చేయాలని డిమాండ్‌ చూస్తూ మంత్రి సత్యవతి రాథోడ్‌ తీర్మానం ప్రవేశపెడుతారు.

– భారతేదశ సామరస్య సంస్కృతిని కాపాడుకోవాలని, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ కుమార్‌ తీర్మానం ప్రవేశపెడుతారు.

– బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీ జనగణన జరపాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మెల్సీ మధుసూదనాచారి తీర్మానం ప్రవేశపెడుతారు.

– రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలని, ఎస్సీ వర్గీకరణ తక్షణమే చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ మంత్రి మహమూద్‌అలీ తీర్మానం ప్రవేశపెడుతారు.

TRS Plenary Resolutions
TRS Plenary Resolutions

– రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్‌ల రూపేణా వసూలు చేయడం మానుకోవాలని, డివిజబుల్‌ పూల్‌లోనే పన్నులు వసూలు చేయాలని మంత్రి హరీశ్‌రావు తీర్మానం ప్రవేశపెడుతారు.

– నదీ జలాల వివాద చట్టం సెక్షన్ –3 ప్రకారం కృష్ణాజలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా నిర్ణయించాలని, ఈ మేరకు బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌కు కేంద్రం రిఫర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.

– భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపినిస్తూ ఎంపీ నామా నాగేశ్వర్‌ రావు తీర్మానం ప్రవేశపెడుతారు.

– రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలను, వైద్య కళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంత్రి తీర్మానం ప్రవేశపెడుతారు.

– దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా కేంద్రం అమలుచేయాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తీర్మానం ప్రతిపాదిస్తారు.

– చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ, చేనేత రంగాన్ని దెబ్బతీస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఎమ్మెల్సీ ఎల్‌.రమణ తీర్మానం ప్రవేశపెడుతారు.

-లక్ష్యం చేరుతాయా?
టీఆర్‌ఎస్‌ ప్లీనరీ బాణాలు లక్ష్యాన్ని చేరుతాయా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. యాసంగి ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అభినందన తీర్మానంలో అర్థం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రం మధ్యవర్తిత్వమే వíß స్తుందని, కొనుగోలు చేసే ప్రతీ ధాన్యపు గింజకు కేంద్రమే నిధులు ఇస్తుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించడంలో అర్థం లేదని అభిప్రాయపడుతున్నారు.

– దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ కీలక భూమిక పోషించాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ రాజకీయ తీర్మానం అమలు ఏ మేరకు ఉంటుంది అనేది సందేహాత్మకం. దేశంలో బీజేపీ యేతర పార్టీలన్నీ కాంగ్రెస్‌ లేని కూటమి సాధ్యం కాదంటున్నాయి. టీఆర్‌ఎస్‌ మాత్రం కాంగ్రెస్, బీజేపీ యేతర కూటమి అంటోంది. ఇది సాధ్యమయ్యే అవకాశం కనుచూపు మేరలో కానరావడం లేదు.

–రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలను, వైద్య కళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేయడం మంచి నిర్ణయం. అయితే ఈమేరకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపాదనలు పంపకుండా ఇవ్వడం లేదని ఆరోపించడంలో అర్థం లేదని భావిస్తున్నారు.

– చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ బిల్లు ఇప్పటికే రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది. దీనిపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కావాలనే ఈ అంశం ప్లీనరీలో చేర్చినట్లు తెలుస్తోంది. ఇక ధరల విషయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తుంది. కానీ ప్లీనరీలో తప్పంతా కేంద్రానిదే అని తీర్మానం చేయడాన్ని ప్రజలు ఏమేరకు నమ్ముతారనేది అనుమానమే.

– రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్‌ల రూపేణా వసూలు చేయడం మానుకోవాలని, డివిజబుల్‌ పూల్‌లోనే పన్నులు వసూలు చేయాలని మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన తీర్మానంపై జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఎందుకు ప్రతిపాదించలేదన్న ప్రశ్న తలెత్తుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రులు హాజరయ్యే సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేయడం ద్వారా సత్ఫలితాలు వసాధించవర్చు. ఈమేరకు హరీశ్‌రావు తీర్మానంప అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఒప్పించగలరా అనేది అనుమానమే.

– నదీ జలాల వివాద చట్టం సెక్షన్ –3 ప్రకారం కృష్ణాజలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా నిర్ణయించాలని, ఈ మేరకు బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌కు కేంద్రం రిఫర్‌ చేయాలని టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో తీర్మానం చేయడం హాస్యాస్పదంగా ఉంది. పొరుగున్న ఉన్న ఆంధ్రప్రదేశ్‌ కృష్ణాజలాలను అక్రమంగా తరలించుకుపోతుంటే మెగా కృష్ణారెడ్డికి టెండర్లు అప్పగించేందుకు నోరు మెదపని టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఇప్పుడు నదీజలాల పంపిణీ అంశాన్ని తెరపైకి తేవడం అర్థంలేనిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

– భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువల గురించి టీఆర్‌ఎస్‌ తీర్మానం చేయడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రాజ్యాంగాన్నే మార్చాలన్నా కేసీఆర్‌.. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని ప్లీనరీలో తీర్మానం ప్రవేశపెట్టడం చూస్తే.. రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆయన వ్యాఖ్యలపై వ్యక్తమైన వ్యతిరేకత సెగ కేసీఆర్‌కు, గులాబీ పార్టీకి బాగా తగిలిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

– కేవలం హుజూరాబాద్‌ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని రాష్ట్రంలోనే అతికష్టంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా కేంద్రం అమలుచేయాలని డిమాండ్‌ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్‌ చెప్పినట్లుగా రూ.20 వేల కోట్లు ఖర్చయ్యే రాష్ట్రంలోనే పథకం అమలుకు అపసోపాలు పడుతూ.. దేశ జనాబాలో దాదాపు 20 శాతం జనాభా ఉన్న దళితులకు దళితబంధు ఇవ్వాలనడం కేవలం దళితుల ఓట్ల కోసమే అన్న భావన కలుగుతోంది.

మొతంగా తీర్మానాలు చూస్తే ధరలు, పన్నులు, మహిళా రిజర్వేషన్‌ చట్టం మినహాయిస్తే మిగతా తొమ్మిది కేవలం రాజకీయ తీర్మానాలే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read:TRS Plenary: టీఆర్ఎస్ @ 21: కేసీఆర్ అడుగులు తెలంగాణ టు ఢిల్లీ

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular