Lion: ఈ పది జంతువులు సింహాలకు.. సింహ స్వప్నం లాంటివి

ఖడ్గమృగాలకు ప్రధాన ఆకర్షణ వాటి కొమ్ము లేదా ముక్కు మీద పదునైన, దృఢమైన అవయవం. పూర్తి శాకాహారులైన ఈ జంతువులు .. ఇతర జంతువుల జోలికి పోవు. కొన్ని కొన్ని సార్లు సింహాలు ఖడ్గమృగాలను కూడా చంపేందుకు వెనుకాడవు.

Written By: K.R, Updated On : September 4, 2023 10:39 am

Lion

Follow us on

Lion: అడవికి రారాజు.. మృగరాజు.. మెరుపు వేగం.. సూదంటూ రాయి లాంటి చూపు.. ఉక్కుపంజా.. ఇనుము లాంటి దృఢత్వం.. రాయి ఇలాంటి స్థిరత్వం.. దిక్కులు పిక్కిల్లే విధంగా గాండ్రింపు.. సింహం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు.. పై ఉపోద్ఘాతాలే మన మదిలో మెదులుతాయి. సింహం గంభీరమైనది, భీకరమైనది కాబట్టి.. దాని జోలికి ఏ జంతువూ వెళ్లదు.. దానికి ఎదురుపడితే బతకదు. “సింహం కడుపు నిండినప్పుడు అడవి కూడా ప్రకాశవంతంగా కనిపిస్తుంది.. అదే సింహం పస్తున్నప్పుడు అడవి కూడా చీకట్లో మగ్గిపోతుంది”. విక్రమ్ సినిమాలో ఈ డైలాగు సింహం వృత్తాంతాన్ని చెబుతుంది. అయితే అలాంటి సింహానికి కూడా సింహ స్వప్నం కలిగించే జంతువులు కొన్ని ఉన్నాయి.

హైనాలు

సింహాలు, పులులు తినగా మిగిలిన మాంసాన్ని హైనాలు తింటాయి. కపటత్వానికి మారుపేరుగా ఉండే ఈ జంతువులు ఒక్కోసారి సింహాలను కూడా వేటాడుతాయి. ముఖ్యంగా సింహాలకు సంబంధించిన చిన్న చిన్న పిల్లలపై ఇవి సామూహికంగా దాడి చేసి చంపి తినేస్తాయి. సింహాలు గుంపుగా ఉన్నప్పుడు మాత్రం హైనాలు అటువైపుగా వెళ్లడానికి కూడా సాహసించవు. ఏదైనా సింహం ఒంటరిగా కనిపిస్తే మాత్రం మూకుమ్మడిగా తరిమేస్తాయి.

మొసళ్ళు

మొసళ్ళు నీటిలో ఉన్నప్పుడు బలంగా ఉంటాయి. ఒకే సమూహంగా అవి ఉన్నప్పుడు.. ఆ సమయంలో నీటిని తాగేందుకు సింహం అక్కడికి వస్తే వెంటనే మొసళ్ళు నోట కరుచుకుంటాయి. కొన్ని కొన్ని సార్లు సింహాన్ని నీటిలోకి లాగేసి చంపేస్తాయి. ఇలాంటి సంఘటనలు ఎక్కువగా అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో చోటుచేసుకుంటాయి.

చిరుత పులులు

చిరుత పులులు చూసేందుకు సింహం కంటే తక్కువ పరిమాణంలో కనిపించినప్పటికీ.. వేటాడే విషయంలో సింహాల కంటే ఒక అడుగు ముందుగానే ఉంటాయి. సాధారణంగా సింహాల కంటే చిరుతపులులు వేగంగా పరిగెడతాయి. భారీ సింహాలను ఇవి ఏమీ చేయకపోయినప్పటికీ.. సింహాల పిల్లలను మాత్రం చిరుతపులులు చంపి తినేస్తాయి.

కెఫ్ బఫెలో

ఈ అడవి రకం దున్నలు ఎక్కువగా ఆఫ్రికా ఖండంలో కనిపిస్తాయి. ఇవి ఒక్కొక్కటి సింహం కంటే రెండింతల పరిమాణంలో కనిపిస్తాయి. బలమైన కొమ్ములు వీటి ప్రధాన ఆకర్షణ. ఇవి సమూహంగా ఉన్నప్పుడు.. వాటి జోలికి సింహం వస్తే తొక్కి చంపేస్తాయి. తమ పదునైన కొమ్ములతో సింహాన్ని చీల్చేస్తాయి.

ఏనుగులు

సాధారణంగా ఏనుగుల జోలికి సింహాలు రావు. కానీ ఒక్కొక్కసారి గున్న ఏనుగులను చంపేందుకు సింహాలు ప్రయత్నిస్తాయి. అలాంటి సమయంలో వయోజన ఏనుగులు సింహాలను ప్రతిఘటిస్తాయి. అరుదైన సందర్భాల్లో మాత్రం సింహాలను ఏనుగులు తమ తొండంతో కొట్టి చంపేస్తాయి.

ఖడ్గమృగాలు

ఖడ్గమృగాలకు ప్రధాన ఆకర్షణ వాటి కొమ్ము లేదా ముక్కు మీద పదునైన, దృఢమైన అవయవం. పూర్తి శాకాహారులైన ఈ జంతువులు .. ఇతర జంతువుల జోలికి పోవు. కొన్ని కొన్ని సార్లు సింహాలు ఖడ్గమృగాలను కూడా చంపేందుకు వెనుకాడవు. అలాంటి సమయంలో స్వీయ ఆత్మ సంరక్షణకు ఖడ్గ మృగాలు సింహాలపై ప్రతి జాతి చేస్తాయి. తమ ఖడ్గంతో సింహాలను చంపేస్తాయి.

ఆఫ్రికన్ వైల్డ్ డాగ్స్

ఇది చూసేందుకు ఒక రకమైన తోడేళ్ల లాగా కనిపిస్తాయి. కుక్క జాతికే సంబంధించినప్పటికీ.. ఇవి చాలా క్రూరంగా ఉంటాయి. విచిత్రమైన శబ్దాలు చేసుకుంటూ వేటాడుతాయి. అయితే ఇవి ఎప్పుడూ ఒకే సమూహంగా ఉంటాయి. సింహాలు లేదా పులులు వేటాడిన జంతువుల మాంసాన్ని ఇవి తింటాయి. అయితే ఇవి సమూహంగా ఉన్నప్పుడు సింహం పై దాడి చేసేందుకు వెనకాడవు. సింహాన్ని చంపిన తర్వాత తమ పదునైన దంతాలతో చీల్చి చీల్చి మాంసాన్ని తినేస్తాయి.

పాములు

సరిసృ ల్పాల జాతికి చెందిన పాములు కూడా సింహాలను చంపేస్తాయి.. సాధారణంగా సింహాలు పాముల జోలికి పోవు. కానీ అనకొండ లాంటి పాములను చూస్తే సింహాలు ఊరుకోవు. వెంటనే వేటాడేందుకు ముందుకు వస్తాయి. కానీ సింహం కంటే తెలివైన అనకొండ దానిని అమాంతం చుట్టేస్తుంది. చివరికి చంపి మింగేస్తుంది. అనకొండలు మాత్రమే కాకుండా, ఆఫ్రికన్ కోబ్రా, రాచనాగు వంటివి కూడా సింహాలను చంపేస్తాయి.