Varun Tej Marriage: మెగా బ్రదర్ నాగబాబు సతీమణి పద్మజ గారు మీడియా ముందుకు రావడానికి పెద్దగా ఇష్టపడరు. తమ కుమార్తె నిహారికకు చైతన్యతో పెళ్లి జరిగిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. అప్పటి నుంచి వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడు అంటూ ఆమె ఎక్కడ కనిపించినా మీడియా ఆమెను ప్రశ్నిస్తూనే ఉంది. నాగబాబు దంపతులు కూడా వరుణ్ కి త్వరలోనే పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ పుకార్లు వినిపించాయి. లావణ్యతో వరుణ్ గత కొన్ని ఏళ్లుగా ఘాటు ప్రేమలో ఉన్నాడని, అందుకే, ఆమె వరుణ్ తో ఏడడుగులు వేయబోతుంది అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంకా జరుగుతూనే ఉంది.

పైగా వరుణ్ తో పెళ్లి కారణంగానే లావణ్య త్రిపాఠి కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ ఒప్పుకోవడం లేదని, తెలుగు, తమిళ భాషల్లో కొత్త చిత్రాల ఆఫర్లు వస్తున్నా ఆమె అంగీకరించడం లేదు అని టాక్ నడుస్తోంది. మొత్తానికి సొట్ట బుగ్గల సుందరితో వరుణ్ తేజ్ ప్రేమాయణం పై చాలా రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ సీక్రెట్ గా ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారని కూడా గుసగుసలు ఉన్నాయి. ,మరోపక్క తమ ప్రేమ గురించి ఇటు వరుణ్ గానీ, అటు లావణ్య గాని ఎప్పుడు పబ్లిక్ గా స్పందించలేదు.
కానీ.. లావణ్య మాత్రం ఇప్పటికే నాగబాబు ఫ్యామిలీకి దగ్గరయింది. వరుణ్ సోదరి నిహారిక పెళ్లి రాజస్థాన్లో జైపూర్ ప్యాలెస్‌లో అట్టహాసంగా జరిగింది. అతి కొద్ది మంది సన్నిహితులకు మాత్రమే అక్కడ పెళ్ళికి ఆహ్వానం అందింది. లావణ్య మాత్రం ఈ పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమైనప్పటి నుంచి నాగబాబు ఫ్యామిలీతోనే ఉంది. నిహారికను పెళ్లి కుమార్తెను చేయడం దగ్గర నుంచి ప్రతి పని దగ్గరుండి మరి చూసుకుంది. ఈ క్రమంలోనే నాగబాబు భార్య పద్మజకు లావణ్య బాగా నచ్చేసిందట. అందుకే, తన కొడుకు ప్రేమకు ఆమె ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని త్వరలోనే వీరి పెళ్లి పై అప్ డేట్ రాబోతుందని తెలుస్తోంది.

అన్నిటికి మించి లావణ్యను కోడలిగా చేసుకోవడానికి పద్మజ గారు బాగా ఆసక్తిగా ఉన్నారట. దానికి కారణం ఉంది. లావణ్య హీరోయిన్ అయినప్పటికీ.. ఎంతో పద్ధతిగా ఉంటుంది. పైగా అనవసరంగా ఎక్స్ పోజింగ్ గట్రా ఎన్నడూ చేయలేదు. ఇక ఎంతో సింపుల్ గా కనిపించే లావణ్య త్రిపాఠి తన సహజసిద్ధమైన నటన, అధ్బుతమైన డాన్స్ స్టెప్పులతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందుకే.. మెగా ఫ్యామిలీ కూడా ఆమెను దగ్గరకు తీసుకున్నారు.
మొత్తానికి హీరోయిన్ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ తో ఏడడుగులు వేయబోతుంది. వరుణ్ తేజ్, లావణ్య ఇద్దరూ ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ వంటి సినిమాల్లో కలిసి నటించారు. ఆ సినిమాల సమయంలోనే వీరిద్దరూ లవ్‌లో పడ్డారట. అప్పటి నుంచి లావణ్య ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఆమె వరుణ్ తేజ్ గెస్ట్ హౌస్ లోనే స్టే చేస్తోందట. మరి ఈ జోడీ త్వరలోనే ఒక్కటి అవ్వాలని ఆశిద్దాం.