
BCCI Chief Selector Chetan Sharma: భారత క్రికెటర్ల ఫిట్ నెస్ నిజం కాదా? వారు జట్టు లో స్థానం సంపాదించడానికి ఏమైనా చేస్తారా? దీని కోసం ఇంజక్షన్లు వాడతారా? ఈ ప్రశ్నలకు ఔను అనే సమాధానం చెబుతున్నారు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ. అంతే కాదు డోప్ టెస్ట్, ఫిట్ నెస్ టెస్ట్, సౌరవ్ గంగూలీ_ విరాట్ కోహ్లి వివాదం, జస్ ప్రీత్ బుమ్రా గాయం పై షాకింగ్ కామెంట్స్ చేశారు. మ్యాచ్ కు ముందు ఆటగాళ్ళు పూర్తి ఫిట్ నెస్ కోసం ఆటగాళ్ళు ఇంజెక్షన్లు తీసుకుంటున్నారని చేతన్ శర్మ వెల్లడించాడు.. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.
Also Read: Jagan vs Ramoji : వదిలేయడానికి జగన్ ఏమన్నా రాజశేఖర్ రెడ్డి అనుకున్నావా రామోజీ!
ఇంజక్షన్ల సాయంతో అన్ ఫిట్ ప్లేయర్లు కూడా ఫిట్ గా మారుతున్నారు అనేది చేతన్ ప్రధాన ఆరోపణ. ఓ మీడియా ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో చేతన్ ఈ సంచలన ఆరోపణలు చేశారు. ” భారత క్రికెటర్లు పూర్తి స్థాయిలో ఫిట్ గా లేకపోతే మ్యాచ్ కు ముందు ఇంజక్షన్ తీసుకుంటున్నారు. ఇంజక్షన ల సహాయంతో అన్ ఫిట్ ఆటగాళ్ళు ఫిట్ గా మారుతున్నారు. సరయిన ఫిట్ నెస్ లేని ఆటగాళ్ళు కూడా ఇంజక్షన్ లు తీసుకుని 100 శాతం ఫిట్ నెస్ నిరూపించుకుని జట్టులో కొనసాగుతున్నారు. ఏ ఇంజక్షన్ తీసుకుంటే డోపింగ్ టెస్ట్ లో దొరికిపోదో, ఏ ఇంజక్షన్ దొరకదో టీం ఇండియా ఆటగాళ్లకు బాగా ట్ తెలుసు. అందుకే వారు ఈ ఇంజక్షన్ లు తీసుకోవడంలో ఆరి తేరారు” అని కామెంట్స్ చేశాడు. అంతే కాదు ఫేక్ ఫిట్ నెస్ గేమ్ లో పెద్ద క్రికెట్ సూపర్ స్టార్ లు కూడా ఉన్నారని చేతన్ శర్మ వెల్లడించాడు. ఓ ఇద్దరు క్రికెటర్లు కిందకి వంగలేని పరిస్థితుల్లో ఉన్నారట! మరో ఇద్దరు క్రికెటర్లు కూడా ప్రైవేట్ గా ఇంజక్షన్లు తీసుకుని ఫిట్ నెస్ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని చేతన్ అంటున్నాడు.

ఇంజక్షన్ లు తీసుకుని ఫిట్ నెస్ సాధించేందుకు ప్రయత్నిస్తున్న ఆటగాళ్ళు… డోప్ టెస్ట్ లో దొరక కుండా జాగ్రత్త పడుతున్నారు. ఫిట్ నెస్ కోసం డోప్ టెస్ట్ లో కూడా చిక్కుకోని
ఇంజక్షన్ లను భారత ఆటగాళ్ళు ఉపయోగిస్తున్నారు.సైలెంట్ గా రెండో కంటికి తెలియకుండా వెళ్ళి ఇంజక్షన్లు తీసుకుని వచ్చాకా.. మేం పెట్టే పరీక్షలో వారు పాస్ అవుతున్నారు..మేం వెంటనే ఫిట్ గా ఉన్నాడని సర్టిఫికెట్ ఇస్తున్నాం. ప్లేయింగ్ ఎలెవన్ లో ఆడేందుకు ప్లేయర్లు నిబంధనలు అతిక్రమిస్తున్నారు..ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం” అని చేతన్ వ్యాఖ్యానించారు.
Also Read: Samantha: భయంకరమైన వ్యాధి నుంచి కోలుకోవాలని సమంత ఏం చేసిందో తెలుసా?