Brahmastra prerelease event : కేసీఆర్ ను భోళా శంకరుడితో పోలుస్తారు.. ఎంత తప్పు చేసినా.. రాక్షసుడైనా కూడా శరణు వేడితే వారికి ఏదైనా చేయడానికి వెనుకాడరు. అందుకే కదా.. తెలంగాణ ఉద్యమకారులను పక్కనపెట్టి మరీ ఉద్యమంలో కేసీఆర్ ను బండబూతులు తిట్టినవారికి కూడా మంత్రి పదవులు ఇచ్చారు. తలసాని, ఎర్రబెల్లి, మల్లారెడ్డి వీరంతా అసలు ఉద్యమకారులే కాదు. కానీ కేసీఆర్ ను వేడుకుంటే వాళ్లంతా మంచోళ్లు అయిపోతారు. రాజకీయం అంటే అంతే బై. అని సర్ధుకుపోవాల్సిందే..

ఇక మీడియా విషయంలోనూ కేసీఆర్ తీరు అంతే.. తెలంగాణ వచ్చిన కొత్తలో తెలంగాణ ఎమ్మెల్యేలను అవమానించేలా కథనాలు ప్రసారం చేసిన ఏబీఎన్, టీవీ9లను అథ: పాతాళానికి తొక్కేసి మొత్తం మీడియాను కంట్రోల్ చేశారు. దీంతో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు లాంటి వారు కూడా సైలెంట్ అయ్యారు. ఏబీఎన్ రాధాకృష్ణ కూడా తన డోసు తగ్గించారు. అయితే ఎన్నికలు వచ్చేసారికి ఈ వానపాములన్నీ తాచుపాములై కాటేస్తాయని కేసీఆర్ కు బాగా తెలుసు. కానీ అవసరార్థం రాజకీయాలు చేయడం మీడియాకు అలవాటు.
కేసీఆర్ కంటే మించి ఇప్పుడు కేంద్రంలో బీజేపీ భీకరంగా ఉంది. తెలంగాణను హస్తగతం చేయడానికి రెడీ అయ్యింది. మోడీతో పోల్చుకుంటే కేసీఆర్ బలం తక్కువ. అందుకే సహజంగానే రామోజీరావు లాంటి మీడియా మొఘల్ కూడా బీజేపీకి ఫేవర్ గా రాజకీయం చేయడం మొదలుపెట్టాడు. మొన్నీ మధ్య కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కోట రామోజీ ఫిల్మ్ సిటీకి వస్తే తెలంగాణలో ఎలా గెలువాలో రాజగురువు వివరంగా చెప్పి కేసీఆర్ ను ఓడించే ప్లాన్నీ పూసగుచ్చినట్టు తెలుస్తోంది.
ఇక జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీ పాలిటిక్స్ లోకి లాగి ఆయనను బీజేపీ వాదిగా చేసింది. అందుకే వీరిద్దరికీ కేసీఆర్ షాకిచ్చారు. ఇదివరకే తనను పిలవకుండా మోడీని పిలిచిన చినజీయర్ కు ఎలాగైతే చుక్కలు చూపించాడో.. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో ‘జూనియర్ ఎన్టీఆర్’ చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్న హిందీ ప్యాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మస్త్ర’ ప్రీరిలీజ్ కు అనుమతి రద్దు చేశారు.
బ్రహ్మస్త్ర మూవీ ప్రీరిలీజ్ ను హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ ను చీఫ్ గెస్ట్ గా ప్రకటించారు. రామోజీరావు అన్ని ఏర్పాట్లు చేశారు. రాజమౌళి దీనికి ప్రమోట్ చేస్తున్నారు. కానీ మొన్నీ మధ్యనే రామోజీ, జూ.ఎన్టీఆర్ లు బీజేపీతో కలిసి వ్యతిరేకంగా సాగడంతో టీఆర్ఎస్ సర్కార్ అదును చూసి దెబ్బకొట్టింది. బ్రహ్మస్త్ర ప్రీరిలీజ్ కు అనుమతిని రద్దు చేసింది. పోలీసులు చివరి నిమిషంలో అనుమతి క్యాన్సిల్ చేయడంతో చిత్రం యూనిట్ తలపట్టుకుంటోంది.
అనవసరంగా ఈ రాజకీయాల్లో తాము బలిపశువులు అయ్యామా? అని చిత్రం యూనిట్ కంగారుపడుతోందట.. ఈ ఫంక్షన్ ను రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించడం.. జూనియర్ ఎన్టీఆర్ రావడంతోనే కేసీఆర్ సర్కార్ పర్మిషన్ ఇవ్వడం లేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కేసీఆర్ పంతం పడితే ఇలాగే ఉంటుందని వైరివర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
[…] […]