Revanth Reddy : ముస్లిం మత ప్రచార సంస్థ తాబ్లిగి జమాత్ కు తెలంగాణ ప్రభుత్వ నిధులు

మిగతా ముస్లిం సంస్థలకు ఇచ్చినా ఎవ్వరూ అభ్యంతరం తెలుపరు. కానీ తాబ్లిగి సంస్థకు ఇవ్వడమే ఇప్పుడు వివాదమైంది. 1926లో మహ్మద్ ఇలియాస్ అనే వ్యక్తి ఈ సంస్థను స్ట్రాట్ చేశాడు. ఆర్య సమజ్ కు భిన్నంగా దీన్ని స్తాపించారు.

Written By: NARESH, Updated On : December 20, 2023 1:29 pm

Revanth Reddy : రేవంత్ రెడ్డి వచ్చీ రాగానే మత వివాదంలో ఇరుక్కున్నారు. ఒక మత సంస్థ సదస్సు జరుపుకుంటే.. దానికి 2.45 కోట్ల రూపాయల విరాళాన్ని తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. పరిగి మండలంలో జరిగే ఈ సమావేశానికి ఈ నిధులు ఇచ్చారు. ‘తాబ్లిగి జమాత్’ అనే మత ప్రచార సంస్థకు ఈ నిధులు వెచ్చించారు.

కరోనా సమయంలో ఢిల్లీలో తాబ్లిగి సంస్థ నిర్వహించిన సమవేశం వల్లనే దేశంలో కరోనా వ్యాపించింది. మసీదులో ప్రార్థనకో.. పరేల్వీ లాంటి సంస్థలకు నిధులు ఇవ్వడం అంటే వేరు.. తాబ్లిగి జమాత్ అనే సంస్థ ఇప్పటికే దేశంలో చాలా వివాదంలో ఇరుక్కుంది. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ స్వయంగా సీఎం వద్దకు తాబ్లిగి జమాత్ సంస్థ ప్రతినిధులను తీసుకెళ్లాడు. ఆయనకు ఇది వివాదాస్పద సంస్థ అని తెలుసు. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ కు ఈ సంస్థ వివాదాల్లో ఉన్నదని తెలుసు. ఒకటికి రెండు సార్లు పరిశీలించి వివాదం లేదనుకుంటే ఇస్తే బాగుండేది.

మిగతా ముస్లిం సంస్థలకు ఇచ్చినా ఎవ్వరూ అభ్యంతరం తెలుపరు. కానీ తాబ్లిగి సంస్థకు ఇవ్వడమే ఇప్పుడు వివాదమైంది. 1926లో మహ్మద్ ఇలియాస్ అనే వ్యక్తి ఈ సంస్థను స్ట్రాట్ చేశాడు. ఆర్య సమజ్ కు భిన్నంగా దీన్ని స్తాపించారు.

ముస్లిం మత ప్రచార సంస్థ తాబ్లిగి జమాత్ కు తెలంగాణ ప్రభుత్వ నిధులు ఇచ్చిన వివాదంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.