Tarakaratna’s health : నందమూరి తారకరత్న విషమ స్థితిలో ఉన్నారు. బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతుంది. తారకరత్నను కాపాడేందుకు నిపుణులైన వైద్య బృందం శ్రమిస్తున్నారు. నేడు ఉదయం ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ బెంగుళూరు చేరుకున్నారు. నారాయణ హృదయాలయ ఆసుపత్రికి వెళ్లిన తారకరత్నను సందర్శించారు. ప్రస్తుతం పరిస్థితి ఏమిటని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడారు. తారకరత్న కోలుకుంటున్నట్లు ఎన్టీఆర్ చెప్పడం అభిమానుల్లో ధైర్యం నింపింది.

ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ… అన్నయ్య తారకరత్నను నేను చూశాను. ఆయనకు మెరుగైన వైద్యం అందుతుంది. ట్రీట్మెంట్ కి తారకరత్న స్పందిస్తున్నారు. పరిస్థితి క్రిటికల్ గానే ఉన్నప్పటికీ బెటర్ అవుతుందని డాక్టర్స్ వెల్లడించారు. తారకరత్న పోరాడుతున్నారు. అభిమానుల ఆశీస్సులతో ఆయన తిరిగి రావాలని కోరుకుందాం అన్నారు. డాక్టర్స్ మీతో ఏం చెప్పారని అడగ్గా.. ఆ మెడికల్ టర్మ్స్ నాకు తెలియదు. నేను వైద్యుడిని కాదు. అయితే డాక్టర్స్ నాకు ఒక ధైర్యం ఇచ్చారు. అదే నేను అభిమానులతో పంచుకుంటున్నాను… అని చెప్పారు.
ఎన్టీఆర్ కామెంట్స్ తారకరత్న తిరిగి కోలుకుంటారనే ఆశలు రేకెత్తించాయి. కాగా ఎన్టీఆర్ ని కర్ణాటక హెల్త్ మినిస్టర్ ఎయిర్ పోర్ట్ లో రిసీవ్ చేసుకున్నారు. తారకరత్నకు బెటర్ ట్రీట్మెంట్ అందించడంలో సహాయ సహకారాలు అందించిన హెల్త్ మినిస్టర్ డాక్టర్ సుధాకర్ కి ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు తారకరత్నకు స్టెంట్ వేసే అవకాశం లేదని బాలయ్య చెప్పారు. అది మరింత ప్రమాదం మరోసారి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కలదని బాలయ్యకు వైద్యులు చెప్పారట.
అత్యంత క్రిటికల్ కండీషన్ కావడంతో కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతిస్తున్నారు. తారకరత్న హెల్త్ పై నేడు సాయంత్రం మరో బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. డాక్టర్స్ అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. తారకరత్న నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న సంగతి తెలిసిందే. జనవరి 27 మధ్యాహ్నం ఆయన పాదయాత్ర జరుగుతున్న సమయంలో నేలపై పడి అపస్మారక స్థితికి చేరుకున్నారు. హార్ట్ అటాక్ కి తారకరత్న గురయ్యారని వైద్యులు వెల్లడించారు. ఆయన గుండెలో 90 శాతం బ్లాక్స్ ఏర్పడ్డాయని ఆ కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని వివరణ ఇచ్చారు.
తారకరత్న పరిస్థితి నిలకడగా ఉంది – @tarak9999#TarakaRatna pic.twitter.com/pMamttjHKY
— Ganeshkumar Reddy Y (@2024_YSRCParty) January 29, 2023