Tarakaratna Heart Attack: మొన్న కుప్పంలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా తారకరత్న గుండెకు సంబంధించిన నొప్పితో కుప్పకూలిపోయాడు కదా! వెంటనే బెంగళూరులోని నారాయణ హృదయాలయ కు తరలించారు కదా! ఆయన ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నాడు కదా! కానీ వైద్యులు విడుదల చేస్తున్న హెల్త్ లో బులిటెన్ లో మాత్రం అత్యంత విషమం అని పేర్కొంటున్నారు.. అసలు తారకరత్న చికిత్సలో ప్రాబ్లం ఏమిటి? అత్యంత విషమం అంటే ఏమిటి? గతంలో ఇదే ఎక్మో ద్వారా జయలలిత, ఎస్పీ బాలసుబ్రమణ్యానికి చికిత్స అందించారు.. కానీ దురదృష్టవశాత్తు వారు కన్నుమూశారు.. నిన్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తారకరత్నను పరామర్శించినప్పుడు… చికిత్సకు స్పందిస్తున్నారని చెప్పారు… కానీ ఈరోజు పలు ఛానళ్ళల్లో మాత్రం విషమం అని హెడ్ లైన్స్ వస్తున్నాయి.

తారకరత్నకు ఎలా ఉంది? ప్రశ్న చాలామందిని వేధిస్తోంది.. తను ఒకేసారి 9 సినిమాలను ప్రారంభోత్సవం చేసుకున్నవాడు… వివాద రహితుడు… ఇతర నటులకన్నా భిన్నమైన వాడు.. అనవసర విషయాల్లో వేలు పెట్టే రకం కాదు. మనిషి కూడా చాలా సౌమ్యుడు.. బ్లడ్ బ్రీడ్ తాలూకు ఫీలింగ్స్ కూడా ఉండవు ఆయన సన్నిహితులు అంటారు.. అందుకే ఆ శుభాన్ని ఎవరు కోరుకోవడం లేదు.. చివరకు ఆ నోటిపారుదల మాజీ మంత్రి అనిల్ యాదవ్ కూడా… కానీ అటు చంద్రబాబు, ఇటు బాలకృష్ణ తారకరత్న ఆరోగ్య పరిస్థితి పై బయటకు చెప్పడం లేదని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తారకరత్నకు చికిత్స అందిన తీరు మీదా చాలా ప్రశ్నలే ఉన్నాయి.. కుప్పం నుంచి బెంగళూరుకు సత్వరం ఎందుకు తరలించలేదు అనేది కీలక ప్రశ్న.. నారాయణ హృదయాలయ హెల్త్ బులిటన్ లో అత్యంత క్రిటికల్ అని చెబుతోంది.. తెలుగుదేశం పార్టీలో ఓ కీలక నాయకుడు ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్నాడని అంటారు.. మరి ఒకరేమో ఎక్మో చికిత్స అంటారు.. ఇంకొకరు అందరూ ప్రార్థించండి అనేస్తారు.. తారకరత్న దేహం చికిత్సకు స్పందిస్తోందని వేరొకరు చెబుతారు. ఇక ఆంధ్రజ్యోతిలో అయితే మెలేనా అనే అరుదైన వ్యాధితో తారకరత్న బాధపడుతున్నాడని చెబుతుంది.. మెలెనా అంటే జీర్ణాశయం లోపల భాగంలో రక్తస్రావం అయ్యే వ్యాధి.
గుండెపోటు తర్వాత రక్తనాళాల్లో జరిగే రక్తస్రావంతో గుండెకు వైద్యం కష్టమవుతుందని వైద్యులు చెబుతుంటారు. ఇలాంటి సమయంలో గుండెకు వైద్యం చేయడం కష్టమవుతుంది.. అందుకే గుండెను కృతిమంగా కదిలించేందుకు ఎక్మో మిషన్ వాడుతుంటారు. అప్పట్లో జయలలిత, బాలసుబ్రహ్మణ్యానికి ఇలానే చేశారు.. ఇక దీనినే ఆ ఎల్లో మీడియా ప్రచారం, ప్రసారం చేస్తోంది.. లోకేష్ పాదయాత్ర పై నెగిటివ్ ముద్ర పడకుండా ఉండేందుకు సెంటిమెంట్ గా తారకరత్న అసలు ఆరోగ్య స్థితిని బయటికి లేదని ప్రచారం కూడా జరుగుతున్నది.

క్రిటికల్ కేర్ ఫిజీషియన్ డాక్టర్ కేసగాని రాజశేఖర్ గౌడ్ అంచనా ప్రకారం…” 39 ఏళ్ల వయసు ఉన్న తారకరత్న కోలుకునే అవకాశాలు తక్కువే. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, గుండె స్పందించకపోవడం, ఇంటర్నల్ బ్లీడింగ్ లాంటి సమస్యలు అత్యంత ప్రాణాపాయ స్థితిని సూచిస్తాయి.. కొంతకాలంగా ఆయనకు ఆరోగ్యం బాగాలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.. కుప్పం పాదయాత్రలో కుప్పకూలిన తర్వాత దగ్గరలో కార్డియాలజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదీ లేకపోవడంతో గోల్డెన్ అవర్లో ఆయనకు సరైన చికిత్స అందలేదు.. ప్రస్తుతం ఎక్మో లైఫ్ సపోర్టింగ్ సిస్టం పైన ఉన్నారు. రక్త ప్రసరణ నిలిచి, మెదడు దెబ్బతిని ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు.. ప్రస్తుతం గుండె కొట్టుకునేలా చేయడం పైన వైద్యులు దృష్టిపెట్టారు.. బ్లడ్ థిన్నర్స్ వాడటం వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ జరగడం కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది.. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ యువకుడు షుగర్ అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయకపోవడం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే మాసివ్ హార్ట్ ఎటాక్ కు గురయ్యాడు. ఎక్మో పై గరిష్టంగా నెలరోజులు ఉండవచ్చు.. ఈలోగా రక్తం ఇన్ఫెక్షన్ కు గురికాకుండా చూడాలి.. ఊపిరితిత్తులు, గుండెను పని చేయించగలిగితే కోమా నుంచి బయటపడేలా చికిత్స మొదలవుతుంది. ఫెయిల్ అయిన గుండె, ఊపిరి తిత్తులను రిపేర్ చేయాలి.. చేయాలంటే టైం పడుతుంది.. అప్పటిదాకా మనిషిని బతికించాలంటే ఎక్మో ద్వారా శరీరంలోని కణాలకు రక్తాన్ని అందించడం.. ఒక మాటలో చెప్పాలంటే గుండె, పిరితిత్తులు చేసే పనిని తాత్కాలికంగా ఈ పరికరం చేస్తుంది.. ఇంకా తాత్కాలికంగా ఈ పరికరం ద్వారా వారాలకు మించి చికిత్స అందించే పరిస్థితి ఉండదు.. ఇక ఈ చికిత్స సరికి రెండు కోట్ల వరకు బిల్ అయ్యే అవకాశం ఉంది.. ఇక బతికే అవకాశాలు కూడా ఈ 50% మించవు.” అని రాజశేఖర్ గౌడ్ చెబుతున్నారు.
ఇక బతికితే ఆరోగ్యాన్ని తిరిగి పొందుతారా? మిషన్ పై ఉన్నప్పుడు రక్తం గడ్డ కట్టకుండా ఉండేందుకు అనే రక్తాన్ని పలుచబరచే రసాయనం ఇస్తారు.. దీనివల్ల ఎక్కడైనా బ్లీడింగ్ జరగచ్చు.. మెదడులో జరిగితే పక్షవాతం వస్తుంది. ఇక ఈ మిషన్ పై ఉన్నప్పుడు రోగికి పెద్ద ఎత్తున మత్తుమందు ఇస్తారు.. ఇది మనిషిని తాత్కాలికంగా పెరాలసిస్ కి గురి చేసినట్టే.. డిశ్చార్జ్ అయినవారు కోలుకునేందుకు మూడు సంవత్సరాలు పడుతుంది.. అనేక రకాల చికిత్సలు కూడా అవసరమవుతాయి. ఈ భూమి మీద అన్నిటికంటే మనిషి ఎక్కువ ఆశాజీవి కాబట్టి… తారకరత్న సజీవుడిగా బయటకు తిరిగి రావాలని… ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.