https://oktelugu.com/

Sridevi Birth Anniversary : ఆ టాలీవుడ్ స్టార్ హీరోని పెళ్లాడాల్సిన శ్రీదేవి… అన్నీ కుదిరాక!

ఆ తర్వాత శ్రీదేవి బాలీవుడ్ లో స్థిరపడి బోనీ కపూర్ ను వివాహం చేసుకొని ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అయితే 2018 లో అనుకోని విధంగా దుబాయ్ లో ఈ దేవకన్య చనిపోవటం బాధాకరం.

Written By:
  • NARESH
  • , Updated On : August 13, 2023 / 11:05 AM IST
    Follow us on

    Sridevi Birth Anniversary : బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత హీరోయిన్ గా మరి భారతీయ సినీ ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయిన దేవకన్య శ్రీదేవి పుట్టినరోజు ఈ రోజు (ఆగస్టు 13) 1978లో తెలుగు ప్రముఖ సీనియర్ దర్శకుడు “కె.రాఘవేంద్రరావు” దర్శకత్వం వహించిన “పదహారేళ్ళ వయసు” అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన శ్రీదేవి అతి తక్కువ కాలంలోనే అప్పటి తరం అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. ఆ తర్వాతి తరమైన చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలతో కూడా ఆడిపాడింది.

    ఆమె మెల్లగా టాలీవుడ్ కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వైపు అడుగులు వేసి, 1996 లో ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత దాదాపుగా సినిమాలకు దూరంగా ఉంది. అప్పుడప్పుడు ఒకటి అరా సినిమాలు చేయడం తప్ప దాదాపు దూరంగా ఉండిపోయింది. ఆమె బోనీ కపూర్ ని పెళ్లి చేసుకోక ముందు తెలుగు హీరో ని పెళ్లి చేసుకోవాలనుందని.. కానీ ఆ హీరో పెళ్లికి నిరాకరించడంతో నటి శ్రీదేవి బోనికపూర్ పెళ్లి చేసుకుందని అప్పట్లో పలు వార్తలు బలంగా వినిపించాయి.

    ఆ హీరో ఎవరో కాదు రాజశేఖర్. అప్పట్లో రాజశేఖర్ ఫ్యామిలీ కి, శ్రీదేవి ఫ్యామిలీకి మంచి సంబంధాలు ఉండేవి. అప్పటికే రాజశేఖర్ MBBS చదువుతున్నాడు. పైగా మంచి అందగాడు. దీంతో శ్రీదేవిని రాజశేఖర్ కి ఇచ్చి పెళ్లి చేయాలనీ శ్రీదేవి అమ్మగారికి బలమైన కోరిక ఉండేది. కాకపోతే రాజశేఖర్ చదువులో ఉండటం, మరోపక్క శ్రీదేవి కెరీర్ మంచి ఫామ్ లో ఉండటంతో ఇప్పుడే పెళ్లి చేసుకుంటే కెరీర్ కి ఇబ్బందని భావించి ఈ పెళ్ళికి నిరాకరించాడు రాజశేఖర్.

    ఈ విషయాన్ని స్వయంగా రాజశేఖర్ గతంలో వెల్లడించాడు. ఆ తర్వాత శ్రీదేవి బాలీవుడ్ లో స్థిరపడి బోనీ కపూర్ ను వివాహం చేసుకొని ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అయితే 2018 లో అనుకోని విధంగా దుబాయ్ లో ఈ దేవకన్య చనిపోవటం బాధాకరం. ఇప్పటికి ఆమె మృతిపై అనేక అనుమానాలు ఉన్న మాట వాస్తవం.