Samajavaragamana Review: నటీనటులు : శ్రీ విష్ణు. రెబ్బ మౌనిక జాన్, వెన్నెల కిషోర్, నరేష్ , రఘు బాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్ తదితరులు
సంగీతం : గోపి సుందర్
దర్శకత్వం : రామ్ అబ్బరాజు .
క్యారక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకున్న నటుడు శ్రీ విష్ణు. ఇతని సినిమాలు చాలా కొత్తరకంగా ఉంటాయి. కానీ కమర్షియల్ గా సక్సెస్ సాధించినవి చాలా తక్కువ. మంచి టాలెంటెడ్ కుర్రాడు, దక్కాల్సిన రేంజ్ దక్కలేదు అని ప్రేక్షకులు శ్రీ విష్ణు విషయం లో బాధపడుతూ ఉంటారు. అలాంటి సమయం లోనే ఆయనకీ ‘రాజ రాజ చోర’ , ‘బ్రోచేవారెవరురా’ వంటి సూపర్ హిట్ సినిమాలు పడ్డాయి. ఆ తర్వాత ఆయన చేసిన చిత్రాలన్నీ బోల్తా కొట్టాయి, ఇప్పుడు ఆయన ‘సామజవరగమనా’ చిత్రం తో క్వాలిటీ కంటెంట్ తో మన ముందుకి వచ్చాడు. ప్రీమియర్ షో నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ ని దక్కించుకున్న ఈ సినిమా సినిమా ప్రేక్షకులను కూడా ఆకట్టుకుండా లేదా అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము.
కథ :
బాలు (శ్రీ విష్ణు ) ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక సాదాసీదా అబ్బాయి, ఒక మల్టిప్లెక్స్ లో పని చేస్తూ ఉంటాడు. అయితే తన తాతయ్య తన తండ్రి ( నరేష్) కి డిగ్రీ పట్టా పొందితేనే తన ఆస్తి మొత్తం చెందుతుంది అని పట్టా రాయిస్తాడు. అప్పుడు బాలు ఆ ఆస్తి కోసం తన తండ్రిని డిగ్రీ పాస్ చేయించాలని చాలా కష్టపడతాడు. ఈ క్రమం లోనే ఆయన డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్న సరయు (రెబ్బ మౌనికా జాన్) సాయం కోసం ప్రయత్నిస్తాడు. ఆమె ని తన ఇంట్లో గెస్ట్ గా పెట్టుకొని, తన ఖర్చులన్నీ కూడా భరిస్తాడు. కానీ తండ్రి డిగ్రీ మరోసారి ఫెయిల్ అవుతాడు. బాలు ఖర్చు చేసింది మొత్తం వృధా అవుతుంది. ఈ క్రమం లోనే సరయు బాలు ని ప్రేమిస్తుంది. కానీ బాలు కి ప్రేమ అంటే అసలు నచ్చదు. తనకి ఐ లవ్ యూ చెప్పిన ప్రతీ అమ్మాయికి రాఖీ కట్టేస్తూ ఉంటాడు. అలాంటోడిని ఎలాగో అలా ఎన్నో ప్రయత్నాలు చేసి తన ప్రేమలోకి దింపేస్తుంది సరయు. అలా సాగిపోతుండగా ఒక రోజు సరయు గురించి బాలు కి ఒక చేదు నిజం తెలుస్తుంది. ఆ నిజం తెలిసాక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి?, బాలు సరయు ని పెళ్లి చేసుకుంటాడా?, తన తండ్రిని డిగ్రీ పాస్ చేయించి ఆస్తిని దక్కించుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
దర్శకుడి ప్రతిభ ఇలాంటి సింపుల్ కథలను డీల్ చేసే విషయం లోనే తెలుస్తుంది. ఎంటర్టైన్మెంట్ తో నవ్వులు పూయించడం చాలా కష్టం,సినిమా కథ ఏమిటో ఇంటర్వెల్ లోనే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అలాంటి సమయం లో సెకండ్ హాఫ్ ని నడిపించడం చాలా కష్టం, రెండు గంటల పాటు ఒక సింపుల్ స్టోరీ తో ఎంటర్టైన్మెంట్ ని నింపి ప్రేక్షకుడిని థియేటర్ లో కూర్చోపెట్టాలి అంటే కత్తిమీద సాము లాంటిది. కానీ ఈ సినిమా దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సవాళ్లు అన్నిటిని విజయవంతంగా దాటేశాడు. సినిమా లో నటించిన ప్రతీ నటుడి నుండి వినోదం ని రప్పించుకున్నాడు. ఇంటర్వెల్ కి సెకండ్ హాఫ్ మొత్తం ఏమి జరగబోతుంది అనేది తెలిసిపోతుంది, కానీ డైరెక్టర్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి, ఎలాంటి వల్గర్ డైలాగ్స్ లేకుండా, కుటుంబం మొత్తం తో కలిసి సినిమాని ఎంజాయ్ చేసేలా తీసాడు.
ఇక నటీనటుల విషయానికి ఇందులో శ్రీ విష్ణు ఎప్పటిలాగానే తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించాడు. అదే సమయం లో ఎమోషన్స్ ని కూడా చాలా చక్కగా పండించాడు. ఇక రెబ్బా మౌనిక కూడా సరదాగా ఉండే చాలాకి అమ్మాయి గా చాలా నీట్ గా చేసింది, ఆమె పాత్ర కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది.ఇక ఈ చిత్రానికి శ్రీ విష్ణు తర్వాత , హీరో లాంటి వాడు నరేష్. తన అనుభవం మొత్తం ఈ సినిమాలో చూపించాడు. శ్రీ విష్ణు మరియు నరేష్ కి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. సాధారణంగా ఎక్కడైనా కొడుకు బాగా చదువుకోవడానికి తండ్రి పడే తాపత్రయం ని ఇది వరకు మనం సినిమాల్లో చూసి ఉంటాము, కానీ ఇక్కడ మాత్రం రివర్స్, తండ్రిని డిగ్రీ పాస్ చేయించే కొడుకుగా, శ్రీ విష్ణు పడే తాపత్రయం, 60 ఏళ్ళ వయస్సులో డిగ్రీ పాస్ అవ్వాలనుకునే తండ్రి పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక ఈ సినిమా సెకండ్ హాఫ్ లో కుల శేఖర్ గా వెన్నెల కిషోర్ కామెడీ ని చూస్తే ప్రేక్షకులకు పొట్టచెక్కలు అవ్వడం ఖాయం.
చివరి మాట :
చాలా కాలం తర్వాత వచ్చిన ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సామజవరగమనా. ప్రేక్షకులు కుటుంబం తో కలిసి థియేటర్స్ కి వెళ్లి కడుపుబ్బా నవ్వుకోవచ్చు.
రేటింగ్ : 3 /5