Homeఎంటర్టైన్మెంట్SaReGaMaPa Singer Sai Sanvid: ఆడ గాత్రమే శాపమై.. అవమానాల పాలై.. నేడు టాలెంట్ తో...

SaReGaMaPa Singer Sai Sanvid: ఆడ గాత్రమే శాపమై.. అవమానాల పాలై.. నేడు టాలెంట్ తో ఎదిగిన కుర్రాడి కథ

SaReGaMaPa Singer Sai Sanvid: అదో పాటల పూదోట.. అందులో విరబూసేందుకు ఎక్కడికెక్కడి నుంచి గాయకులు తరలివస్తున్నారు. పూట గడవని పేద గాయకుల నుంచి.. ఆటోడ్రైవర్లు వరకూ.., అమ్మ వంటలు చేసి, తమ్ముడు హోటల్లో పనిచేసి పంపిస్తే వచ్చిన కర్ణాటక కుర్రాడు ఒకతను.. ఆడ గొంతుతో అవమానాలు పాలై కసితో వచ్చిన వైజాగ్ కుర్రాడు మరొకరు.. ఇలా పేద కుటుంబాలకు చెందిన వారికి వాళ్ళ టాలెంట్ చూపించుకోడానికి అవకాశం ఇస్తున్న ప్రోగ్రాం జీ తెలుగులో ప్రసారమయ్యే ‘సరిగమప షో’. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో టాలెంట్.. ఈ షో ఇప్పుడు తెలుగు జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇందులో పాడే వారు సినిమాల్లో పాడే గాయకులు కాదు.. మారు మూల పేద కళాకారులు. కష్టాలు కడగండ్లు ఎదుర్కొని తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి వచ్చినవారు. వారిలోని టాలెంట్ ను ఈ షో వెలికి తీస్తోంది.

SaReGaMaPa Singer Sai Sanvid
SaReGaMaPa Singer Sai Sanvid

‘సరిగమప షో’లో ఒక్కొక్కరిది ఒక్కో సామర్థ్యం.. అందరులోకి అతడు మాత్రం డిఫెరెంట్. అతడు మగ అయినా.. ఆడ గొంతుతో పాడి అందరినీ సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తాడు. అయితే అతడి టాలెంట్ ను కొందరు ప్రశంసలతో ముంచెత్తితే.. మరికొందరు ఆడ గొంతు అంటూ గేలి చేశారు. ఎన్నో అవమానాల పాలైన ఓ వ్యక్తి ఇప్పుడు ‘జీ’ సరిగమప షోలో మెరిసాడు. ఆయన ఎవరో తెలియాలంటే మీరు ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే..

సింగర్ సాయి సాన్విద్.. చూసేందుకు అబ్బాయి.. కానీ ఆయన వాయిస్ అమ్మాయిలా ఉంటుంది. అది వరమో.. శాపమో ఆయనకే తెలియదు.. కానీ దాన్నే తన ఉపాధికి మార్గంగా చేసుకున్నాడు. తనలోని ఈ టాలెంట్ కు మెరుగులు అద్దాడు. లేడి వాయిస్ అయినప్పటికీ ఆయన వాయిస్ ఎంతో మధురంగా ఉంటుంది. ఓపెన్ గా చెప్పాలంటే ‘సమంత’ వాయిస్ ను దించేశారని విన్నవారు కామెంట్ చేస్తుంటారు.

సాయి సాన్విద్ పుట్టుకతోనే అమ్మాయి వాయిస్ తో జన్మించాడు. ఇది అతడికి శాపమో..వరమో తెలియదు కానీ.. ఇప్పుడైతే అదే అతడికి ఒక వరంలా మారిందనే చెప్పుకోవాలి.

-సాయి సాన్విద్ బయోగ్రఫీ
సాయిసాన్విద్ విశాఖపట్నంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. నలుగురు సంతానంలో చివరి వాడు. టీనేజ్ లో ఉండగానే తల్లిదండ్రులను కోల్పోయాడు. అక్క అన్నల మధ్య ఆనందంగా పెరగాల్సిన సాయి సాన్విద్ కు ఊహించని స్వరం శాపంగా మారింది.. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. సొంత వారి నుంచి వెలివేతకు గురయ్యాడు. అందరిలా కాకుండా అమ్మాయి గొంతు రావడంతో తన ఆశలు, ఆకాంక్షలను సాయిసాన్విద్ చంపేసుకున్నాడు. కష్టాలను ఇష్టాలుగా మార్చుకొని ఎదిగాడు. ఆకతాయిలు ఆడగొంతు అని అవమానించినా.. కృంగదీసినా.. పరిస్థితులు తట్టుకొని ధైర్యంగా నిలబడ్డాడు. పాటల్లోనే తన ఆనందాన్ని వెతుకున్నాడు. ఆడగొంతుతో పాడే సాయి సాన్విద్ ను అందరూ అవమానించినా.. స్కూల్ టీచర్లు ప్రోత్సహించారు. ప్రోగ్రామ్ లకు వెళ్లేవాడు. వారించిన ఆత్మీయుల ఈసడింపులు తట్టుకోలేక.. లక్ష్యాన్ని సాధించలేక ఓ సారి ఆత్మహత్య ప్రయత్నాలు చేశాడు.

ఈ క్రమంలోనే పాటల లక్ష్యాన్ని చేరేందుకు హైదరాబాద్ కు వచ్చాడు. నిమ్స్ హాస్పిటల్ లో వెయిటింగ్ హాల్ లో ఉంటూ ఆస్పత్రిలో పెట్టే అన్నం తింటూ మూడు నెలలు కాలం వెళ్లదీశాడు. బేగంపేట్ లో హౌస్ కీపింగ్ పనికి కుదిరి హాస్టల్ ఫీజు కట్టేవాడు. ఈవెంట్ ఆర్గనైజర్లను ఒప్పించి పాటలు పాడేవాడు. షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించాడు. రెండు సినిమాలకు స్వరం ఇఇచ్చాడు. యువ సంగీత దర్శకుడు రఘుకుంచే సాయిని ప్రోత్సహించాడు. దీంతో సినిమాల్లో, సీరియల్స్ లో సాయికి అవకాశాలు వచ్చాయి.

Also Read: అఖండ, పుష్ప, ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లతో భీమ్లానాయక్ కు ఉన్న ప్లస్ లు, మైనస్ లేంటి?

ఇప్పుడు ఏకంగా జీ తెలుగు నిర్వహిస్తున్న ‘సరిగమప షో’లో తన టాలెంట్ చూపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. రీసెంట్ రిలీజ్ చేసిన ప్రోగ్రాంలో సాయి పాడిన అచ్చం అమ్మాయి గొంతుని తలపించింది. సాయి వాయిస్ విని ఎస్పీ శైలజ కూడా ఆశ్చర్యపోయారు. అచ్చం చిత్ర గారు పాడినట్టు ఉందని కితాబిచ్చారు. ఇంతలో తన గురించి..తన పడిన బాధలపై సాయి కన్నీరు పెట్టుకున్నాడు. దీనికి జడ్జీలతోపాటు తోటి సింగర్స్, తెలుగు ప్రేక్షకులు కూడా చలించిపోయారు.

కుటుంబానికి దూరమై తానేంటో నిరూపించుకోవాలనుకుంటున్న సాయి ‘జీ’ తెలుగు సరిగమప షోలో విజేతగా నిలవాలని మనసారా కోరుకుందాం.. ఈ కష్టాలన్నీ పోయి ఆయన ఉన్నత శిఖరాలకు చేరాలని ఆశిద్దాం..

Also Read: ‘విజయ్ దేవరకొండ’తో కేజీఎఫ్ హీరోయిన్ రొమాన్స్

Recommended Video:

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular