రూ.2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్థిక శాఖ..!

ఈ మధ్య కాలంలో 2,000 రూపాయల నోట్లు బ్యాంకులలో, ఏటీఎంలలో ఎక్కువగా కనిపించడం లేదనే సంగతి తెలిసిందే. ఏటీఎంలలో విత్ డ్రా చేయడానికి ప్రయత్నిస్తే 500 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లు మాత్రమే వస్తున్నాయి. అయితే 2,000 రూపాయల నోటు ఎక్కువగా కనిపించకపోవడానికి అసలు కారణం వెల్లడైంది. ఆర్థిక శాఖ 2,000 రూపాయల నోటుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. Also Read: క్రిప్టో కరెన్సీపై కేంద్రం నిషేధం విధించనుందా..? ఆర్థిక శాఖ సహాయ మంత్రి […]

Written By: Kusuma Aggunna, Updated On : March 16, 2021 3:24 pm
Follow us on

ఈ మధ్య కాలంలో 2,000 రూపాయల నోట్లు బ్యాంకులలో, ఏటీఎంలలో ఎక్కువగా కనిపించడం లేదనే సంగతి తెలిసిందే. ఏటీఎంలలో విత్ డ్రా చేయడానికి ప్రయత్నిస్తే 500 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లు మాత్రమే వస్తున్నాయి. అయితే 2,000 రూపాయల నోటు ఎక్కువగా కనిపించకపోవడానికి అసలు కారణం వెల్లడైంది. ఆర్థిక శాఖ 2,000 రూపాయల నోటుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.

Also Read: క్రిప్టో కరెన్సీపై కేంద్రం నిషేధం విధించనుందా..?

ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లోక్ సభలో మాట్లాడుతూ 2,000 రూపాయల నోట్లకు సంబంధించి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. గడిచిన 2 సంవత్సరాలుగా 2,000 రూపాయల నోట్లను ముద్రించడం లేదని తెలిపారు. 2018 సంవత్సరం మార్చి నెల నాటికి 3362 మిలియన్ల 2,000 రూపాయల నోట్లు చలామణిలో ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి 26 నాటికి కేవలం 2,499 మిలియన్ల నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయి.

Also Read: తప్పుగా బదిలీ చేసిన నగదును రివర్స్ లో ఎలా పొందాలంటే..?

గతంతో పోలిస్తే 2,000 రూపాయల నోట్ల చలామణి భారీగా తగ్గిపోయిందని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సంప్రదింపుల తర్వాత మాత్రమే నోట్ల చలామణికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటుంది. డిమాండ్ కు అనుగుణంగా వ్యవస్థలో నోట్లను ముద్రించడం జరుగుతుంది. 2016 సంవత్సరంలో నోట్ల రద్దు తరువాత 2,000 నోట్లు చలామణిలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

కేంద్రం పాత 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి 2,000 రూపాయల నోట్లను చలామణిలోకి తీసుకురాగా 2,000 రూపాయల నోట్లను కేంద్రం తీసుకురావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కేంద్రం 2,000 రూపాయల నోట్ల చలామణి తగ్గించడానికి కారణాలు తెలియాల్సి ఉంది.