UK PM: మనల్ని పాలించిన బ్రిటన్ సామ్రాజ్యాన్ని మనమే పాలించే అరుదైన సందర్భం వచ్చింది. మొన్నీ మధ్యనే బ్రిటన్ ప్రధాని పదవిని తృటిలో చేజార్చుకున్న మన భారతీయుడు, మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషిసునక్.. తాజాగా బ్రిటన్ లో ఏర్పడిన సంక్షోభంతో మరోసారి రేసులోకి వచ్చారు. ప్రస్తుత ప్రధాని లిజ్ ట్రస్ సంక్షోభంతో ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ఆమె చేతిలో ఓడిపోయిన రిషి సునక్ తాజాగా మళ్లీ రేసులోకి వచ్చాడు.

బ్రిటన్ ప్రధాని కావడానికి రిషి సునక్ కు మరో అవకాశం వచ్చింది. అక్కడ ఏర్పడిన సంక్షోభంతో మరోసారి ప్రధాని ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో తాను బరిలో ఉంటానని రిషి సునక్ ప్రకటించాడు. ప్రధాని పదవి రేసులో ఉండడానికి ఇప్పటికే కనీస నామినేషన్ పరిమితిని దాటాడు. 140 మంది ఎంపీల మద్దతు తనకు ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రిషి సునక్ కు పోటీగా బోరిస్ జాన్సన్ ఉండే అవకాశం ఉందని వార్తలు ప్రస్తుతం ఆయన కరేబియన్లో రిలాక్స్ అవుతున్నారు. చట్ట సభ సభ్యుల మద్దతు పొందేందుకు అక్కడి నుంచి హూటాహుటిన బయలు దేరాడు.
బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కు పోటీగా రంగంలోకి దిగిన మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రిషి సునక్ కంటే వెనుకబడి ఉన్నానని.. ఇలాంటి సమయంలో పోటీ నుంచి వైదొలగడమే మేలని బోరిస్ వెల్లడించాడు. కీలక పోటీదారు బోరిస్ పోటీ నుంచి వైదొలగడం.. రిషిసునక్ ప్రధాన పోటీదారు పెన్నీ మోర్డాంట్ కు మెజారిటీ అంతంత మాత్రంగానే కనిపిస్తుండడంతో బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ విజయానికి మార్గం సుగమమైనట్టే కనిపిస్తోంది. దీనిపై ఈ మధ్యాహ్నమే ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
బోరిస్ జాన్సన్ పోటీ నుంచి తప్పుకోవడంతో రిషి సునక్ కు మరింత మద్దతు పెరిగింది. 156 మంది పార్టీ ఎంపీలు మద్దతిస్తే రుషి డైరెక్ట్ గా ప్రధాని అవుతాడు. ఇంతకు ముందులా పార్టీ సభ్యులంతా ఓట్ చేయనక్కర్లేదు.. ఇప్పటికే 142 మంది మద్దతు రిషికి వచ్చింది. బోరిస్ తప్పుకోవడంతో మిగిలిన మద్దతు కూడా ఇవ్వాళే రావొచ్చని సమాచారం. దీంతో దాదాపు మన రుషి బ్రిటన్ ప్రధాని కావడం ఖాయం. బ్రిటన్ లో ఉండే భారతీయులకు దీపావళి మరింత తీపిగా ఉండబోతుందని చెప్పకతప్పదు.
బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ ప్రభుత్వం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీంతో ఆమె రాజీనామా చేశారు. ఆమె రాజీనామా తరువాత వెంటనే ఈ పదవిని క్లెయిమ్ చేసుకునేందుకు రిషి సునక్ సిద్ధమయ్యాడు. అయితే ప్రధాని పదవికి అవసరమైన 100 మంది ఎంపీల మద్దతును ఇప్పటికే సాధించినట్లు తెలుపుతున్నారు. ప్రస్తుతం సునక్ కు 140 ఎంపీలు మద్దతు ఇస్తున్నట్టు తెలిసింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. కానీ దీనిపై సునక్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కానీ చివరి వరకు ఆయనకు మద్దతు కచ్చితంగా ఉంటుందని విశ్వసిస్తున్నారు.
కొన్ని విమర్శల నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి తప్పుకున్న బోరిస్ జాన్సన్ ఇప్పుడు సునక్ కు పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన తనకు 46 మంది సభ్యుల మద్దతు ఉందని ప్రచారం చేస్తున్నారు. సోమవారానికి ఈ సంఖ్య 100కు చేరే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో బోరిస్, సునక్ లమధ్యే పోటీ ఉంటుందని తెలుస్తోంది. అయితే త్వరలో ఇద్దరు నేతల పోటీపై ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ అన్ని లనుకూలిస్తే దీపావళి రోజునే భారత సంతతి వ్యక్తి బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది.
ఇక బ్రిటన్ ప్రధాని రేసు నుంచి తప్పుకుంటున్నట్టు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక ప్రకటన చేశారు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల మద్దతు పొందేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ పార్టీలో ఐకమత్యం, సమర్థపాలన ఇలా పోటీతో చేయలేం. సునాక్, మోర్డాంట్ ను సంప్రదించాక.. దేశ ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పనిచేయాలని ఆశిస్తున్నాం.. అందుకే నా నామినేషన్ వెనక్కి తీసుకుంటున్నట్టు’ బోరిస్ జాన్సన్ ప్రకటించారు. గెలిచినవారికి సహకరిస్తానని తెలిపారు. బోరిస్ జాన్సన్ కు కేవలం 59మంది ఎంపీల మద్దతే ఉంది. ప్రధాని రేసులో నిలవాలంటే 100 మంది ఎంపీ లమద్దతు అవసరం. అందుకే పోటీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు.
ఇక రిషిసునక్ కు మరో పోటీదారు పెన్నీ మోర్డాంట్ కు కేవలం 23 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉంది. ఈమెకు మద్దతు పెరిగితే 100 మంది ఎంపీల మద్దతు దాటితే మాత్రం మళ్లీ కన్జర్వేటివ్ పార్టీలోని 1.7 లక్షల టోరీ సభ్యుల మద్దతు కోసం ఆన్ లైన్ ఓటింగ్ నిర్వహిస్తారు. విజేతను శుక్రవారం ప్రకటిస్తారు.
గత రేసులో చివరి వరకు వచ్చిన సునక్ కు ఆ తరువాత మద్దతు తగ్గింది. ఈసారి మాత్రం కచ్చితంగా ప్రధాని అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. బోరిస్ పై గతంలో అనేక విమర్శలు వచ్చాయి. ఆర్థిక సంక్షోభానికి కారణం అతనే అని కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఇటు సునక్ అనుకున్నట్లు సభ్యుల మద్దతు వస్తే భారత సంతతికి చెందిన వ్యక్తి ప్రధాని అవుతారు.
మన రిషి సునక్ బ్రిటన్ ప్రధాని అయితే మాత్రం మనల్ని పాలించినవారిని మనమే పాలించే గొప్ప అవకాశం భారతీయులకు దక్కినట్టు అవుతుంది. ఇదో అద్భుత గొప్ప విజయమనే చెప్పాలి. ఇండియా ఇది ఒక సింబాలిక్ గుర్తింపు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే రిషి సునక్ బ్రిటన్ దేశ ప్రయోజనాలకు పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఏది ఏమైనా, మనల్ని పాలించిన వాళ్ళని మనవాడు పాలించబోవడం భారతీయ మూలాలకు, వారసత్వానికి ఒక విజయంగా భావించవచ్చు.