RGV New Film Vyuham: నిన్న ఏపీ సీఎం జగన్ ను కలిసి అరగంటకు పైగా చర్చలు జరిపిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈరోజు అందరూ అనుమానించినట్టే కొత్త చిత్రాన్ని ప్రకటించారు. దాని పేరు ‘వ్యూహం’.. ఇది అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించిన కథ అంటూ ‘వ్యూహం’ చిత్రాన్ని ప్రకటించారు. రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుందని.. రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే వ్యూహం అని ట్విట్టర్ లో ప్రకటించారు. ఈ చిత్రం కథాంశం, థీమ్ ను బట్టి ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబులను టార్గెట్ చేసిందనని అర్థమవుతోంది.

2014 ఎన్నికల వేళ చంద్రబాబు సీఎంగా ఉన్న రోజుల్లో వైఎస్ జగన్ పై కోడికత్తి కేసు సహా.. వైఎస్ వివేకా హత్య కేసు ఆరోపణలను చేశారు. అలాగే చంద్రబాబు, మంత్రులు మాటల దాడులు చేశారు. నాడు పవన్ కళ్యాణ్ సైతం జగన్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లారు. సో చంద్రబాబు అహంకారానికి, జగన్ ఆశయానికి మధ్య జరిగిన పోరాటం అనేలా వర్మ ఈ కథాంశాన్ని సోషల్ మీడియాలో లీక్ చేశారు.
ఇక ఈ చిత్రం 2 పార్ట్స్ గా రాబోతుందని వర్మ సోషల్ మీడియాలో తెలిపారు. మొదటి పార్ట్ “వ్యూహం” ,2వ పార్ట్ “శపథం” .. రెండింటిలోనూ రాజకీయ ఆరాచకీయాలు పుష్కలంగా వుంటాయి. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం “ షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 “శపథం “లో తగులుతుంది ’’ అని తెలిపారు. దీన్ని బట్టి జగన్ సీఎం కావడానికి చేసిన శపథం ను రెండో సినిమాగా తీస్తారని తెలుస్తోంది..

నిజానికి నిన్న జగన్ ను కలిశాక పవన్ పై మూడు సినిమాలకు ప్లాన్ చేశారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు వర్మ ఏకంగా ‘వ్యూహం’ అనే రాజకీయ సినిమా ప్రకటించారు. ఇది బయోపిక్ కాదని.. రియల్ పిక్ అంటూ ప్రకటించారు. దీంతో ఇది పవన్ కళ్యాణ్, చంద్రబాబుల దోస్తానా?పై తీయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
ఎందుకంటే ఇటీవల పవన్ ను చంద్రబాబు కలిసి మద్దతు తెలిపారు. విశాఖలో నిర్బంధంతో కలిసి పనిచేద్దామని అనుకున్నారు. ఈక్రమంలోనే వర్మ ఈ సినిమాను ప్రకటించడంతో జగన్ రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసి ఈ సినిమా తీస్తున్నట్టు అర్థమవుతోంది. మరి ఇందులో విలన్ పవన్ కళ్యాణ్ నా? లేక చంద్రబాబా? అన్నది తెలియాల్సి ఉంది.
వ్యూహం “ చిత్ర నిర్మాత నాతో అంతకు ముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్ .
ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక ,ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనక చెప్పట్లేదు.
— Ram Gopal Varma (@RGVzoomin) October 27, 2022