Site icon OkTelugu

Ramarao On Duty 1st Day Collections: ‘రామారావు ఆన్ డ్యూటీ’ 1st డే కలెక్షన్స్.. లెక్కలు చూస్తే ఆశ్చర్యపోతారు !

Ramarao On Duty 1st Day Collections: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వం వహించిన సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. నేడు ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి ?, అసలు ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చాయా ? లేదా ?, సినిమాకి అయితే బాగా నెగిటివ్ టాక్ వచ్చింది. మరి ఈ సినిమా నిర్మాతకు లాభాలు వస్తాయా ? లేక, నష్టాలే మిగిలే ఛాన్స్ ఉందా ? చూద్దాం రండి.

Ramarao On Duty

ముందుగా ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

నైజాం 0.83 కోట్లు

సీడెడ్ 0.39 కోట్లు

ఉత్తరాంధ్ర 0.34 కోట్లు

ఈస్ట్ 0.13 కోట్లు

వెస్ట్ 0.12 కోట్లు

గుంటూరు 0.13 కోట్లు

కృష్ణా 0.15 కోట్లు

నెల్లూరు 0.08 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొదటి రోజు కలెక్షన్స్ గానూ 2.17 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 4.34 కోట్లు వచ్చాయి.

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.26 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు కలెక్షన్స్ గానూ 2.46 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా మొదటి రోజు కలెక్షన్స్ గానూ ‘రామారావు ఆన్ డ్యూటీ’ రూ. 4.91 కోట్లను కొల్లగొట్టింది

‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల 20 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ, మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం సేఫ్ అయ్యే అవకాశం తక్కువే. సహజంగా రవితేజ సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వస్తాయి. కానీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ కలెక్షన్స్ పరంగా బాగా డిజప్పాయింట్ చేశాడు. ఇప్పుడున్న అంచనాలను బట్టి ఈ సినిమాకి 15 కోట్లు నష్టాలు రానున్నాయి.

Exit mobile version