Pushpa : పుష్ప మూవీతో దేశవ్యాప్తంగా షేక్ చేసిన దర్శకుడు సుకుమార్. అల్లు అర్జున్ తో విలయతాండవమే చేయించి సినిమాను మాస్టర్ పీస్ గా మలిచాడు. పుష్ప క్యారెక్టర్ హిందీ జనాలకు విపరీతంగా నచ్చేసింది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ పుష్పకు ఫ్యాన్ అయిపోయారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పుష్ప’ మేనియానే.. పాటలు, ఫైట్లు, క్యారెక్టర్లు హిందీ జనాలకు ముద్రపడిపోయాయి. సినీ విశ్లేషకులను మెప్పించిన ఈ సినిమాపై ఇప్పటికీ ప్రశంసలు కురుస్తున్నాయి.

తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ కూడా పుష్ప చూసి స్పందించారు. ఎన్నడూ లేనిది ఈ సినిమా గురించి తన సన్నిహితుల సమక్షంలో చాలా సేపు మాట్లాడారట.. సుకుమార్ ను మెచ్చుకుంటూ ఫోన్ చేద్దామంటే ఆయన నంబర్ హిరానీకి దొరకలేదట.. ఈ మధ్య ఓ ఫ్రెండ్ ద్వారా సుకుమార్ నంబర్ సంపాదించిన హిరానీ ఓ పెద్ద మెసేజ్ ను పంపించాడు. అది చూసి ఉబ్బితబ్బిబైన సుకుమార్ దాన్ని తన సన్నిహితులకు పంపించి సంతోషం వ్యక్తం చేశారు. హిరానీ లాంటి గొప్ప దర్శకుడి నుంచి ప్రశంసలు మరిచిపోలేనిదన్నారు. హిరానీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రాజ్ కుమార్ హిరానీ సందేశంలో ‘డియర్ సుకుమార్ ఈ మేసేజ్ మీకు ఎప్పుడో పంపించాల్సి ఉందని.. పుష్ప సినిమా చూసినప్పటి నుంచి మీతో మాట్లాడాలని అనుకుంటున్నానని.. నా దగ్గర మీ నెంబర్ లేకపోవడంతో ఒక మిత్రుడి ద్వారా తీసుకున్నానని’ హిరానీ మెసేజ్ లో ప్రస్తావించాడు. ‘పుష్ప సినిమా గురించి నా మిత్రులతో చాలాసార్లు మాట్లాడాను. ఒక సినిమా గురించి నేను అంతలా మాట్లాడడం వారిని ఆశ్చర్యపరిచి ఉంటుందని.. మీ రచన, ప్రతి సన్నివేశాన్ని మలిచిన తీరు, నటీనటుల పర్ఫామెన్స్, సంగీతం ఇలా అన్నీ గొప్పగా ఉన్నాయన్నారు. అద్భుతమైన సినిమాను తెరకెక్కించారని.. సినిమాను ఆద్యంతం ఆస్వాదించానని.. మీరు ముంబై వస్తే ఫోన్ చేయండి.. కలుద్దాం’ అని ఒక వాట్సాప్ మెసేజ్ పంపాడు.
దేశంలోనే గొప్ప దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ సందేశానికి ఎంతో సంతోషంగా ఉందని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు దర్శకుడు సుకుమార్. ‘ఫిల్మ్ మేకింగ్ లో మాస్టర్ లాంటి మీ దగ్గర నుంచి ప్రశంసలు రావడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చిందని.. రైటింగ్ లో, సినిమా రూపకల్పనలో మీరే నాకు స్ఫూర్తి అని మీ మెసేజ్ ను నా స్నేహితులందరికీ పంపిస్తున్నానని’ సుకుమార్ ఆనందం వ్యక్తం చేశాడు.
‘మున్నాభాయ్’, త్రీ ఇడియట్స్, పీకే సినిమాలతో బాలీవుడ్ లోనే సెన్షేషన్ సృష్టించాడు రాజ్ కుమార్ హిరానీ. మంచి కథ ఉంటేనే సినిమాలు తీసే ఈ గొప్ప దర్శకుడి నుంచి సుకుమార్ కు ప్రశంసలు దక్కడం విశేషం.
[…] Also Read: Pushpa : సుకుమార్ కు పర్సనల్ మెసేజ్.. పుష్ప … […]