Homeఎంటర్టైన్మెంట్Rajaraja Chola Controversy: కొత్త వివాదం : చోళ రాజుల హిందువులు కాదా? వాళ్లు నిర్మించిన...

Rajaraja Chola Controversy: కొత్త వివాదం : చోళ రాజుల హిందువులు కాదా? వాళ్లు నిర్మించిన ఆలయాలు ఏవి? ఎలాంటివి..!?

Rajaraja Chola Controversy: ప్రముఖ దర్శకుడు మణిరత్నం చారిత్రాత్మక నేపథ్యంతో తెరకెక్కించిన ‘పొన్నియన్‌ సెల్వన్‌’ సినిమా విడుదలైంది. పొన్నియన్‌ గొప్ప హిందూ చక్రవర్తి అని కీర్తింపబడ్డాడు. అయితే ఇప్పుడు రాజు మతం గురించి చర్చ జరుగుతూనే ఉంది. రాజరాజ చోళుడు హిందూ చక్రవర్తి కాదని అంటున్నారు కొందరు.. ‘పొన్నియన్‌ సెల్వన్‌’ సినిమాపై రోజుకో వివాదం తెరపైకి వస్తూనే ఉంది. హిందుస్థాన్‌లోని గొప్ప చోళ సామ్రాజ్యం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. చోళ సామ్రాజ్య విస్తరణ, నావికాదళం బలాన్ని సినిమాలో చక్కగా చూపించారు. ఈ చిత్రం చోళ సామ్రాజ్యం రాజు పొన్నియన్‌ సెల్వన్‌ కథ. చోళ రాజవంశానికి చెందిన మరో గొప్ప పాలకుడు రాజరాజ చోళుడు గురించి కూడా ఈ సినిమాలో చూపించారు.

Rajaraja Chola Controversy
Rajaraja Chola

రాజరాజ చోళుడు గొప్ప రాజుల్లో ఒకడు..
పొన్నియన్‌ గొప్ప హిందూ చక్రవర్తి అని కీర్తింపబడ్డాడు. అయితే ఇప్పుడు రాజు మతం గురించి చర్చ జరుగుతూనే ఉంది. రాజరాజ చోళుడు హిందూ చక్రవర్తి కాదని జాతీయ అవార్డు గ్రహీత తమిళ దర్శకుడు వెట్రిమారన్‌ అన్నారు. ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ కూడా ఆయన అభిప్రాయాన్ని సమర్థించారు. రాజరాజ చోళుని మతం కోసం ప్రజలు వెతకడం ప్రారంభించిన అనంతరం ఇంత చర్చ జరుగుతోంది.

Also Read: KCR- Telangana Palapitta: తెలంగాణ పాలపిట్టతో పెద్ద చిక్కుల్లో పడ్డ కేసీఆర్‌!!

చోళ సామ్రాజ్య స్థాపన ఎప్పుడు, ఎలా జరిగిందంటే?
చోళ సామ్రాజ్యం చరిత్ర 1000 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైనది.. దక్షిణ భారతదేశంలోని కావేరీ నది ఒడ్డున ఈ సామ్రాజ్యానికి పునాది పడింది. తిరుచిరాపల్లి చోళ సామ్రాజ్యానికి రాజధాని. చోళ సామ్రాజ్యం చక్రవర్తులు దక్షిణ భారతదేశంలో అనేక అద్భుతమైన దేవాలయాలను నిర్మించారు. చరిత్ర పుస్తకాల ప్రకారం.. కావేరీ తీరాన్ని కాంచీపురం పల్లవ రాజుల కింద ముత్తియార్‌ అనే కుటుంబం పాలించింది. క్రీ.శ. 849లో చోళ రాజవంశ అధిపతి విజయాలయ ముత్తియార్లను ఓడించి ఈ డెల్టా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.

Rajaraja Chola Controversy
Rajaraja Chola

సామ్రాజ్యాన్ని విస్తరించిన రాజరాజ చోళుడు..
చోళ సామ్రాజ్య స్థాపన తర్వాత సర్దార్‌ విజయాలయ అక్కడ తంజావూరు నగరాన్ని స్థాపించాడు. నిశుంభసుదినీ దేవి ఆలయాన్ని కూడా నిర్మించాడు. అతని వారసులు పొరుగు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. తమ సామ్రాజ్యం సరిహద్దులను విస్తరించారు. ఆ సమయంలో పాండ్యన్, పల్లవులు అతని సామ్రాజ్యంలో భాగమయ్యారు. క్రీ.శ.985లో మొదటి రాజరాజ చోళుడు ఈ రాజ్యానికి పాలకుడయ్యాడు. రాజరాజ చోళుడు కూడా చోళ రాజవంశం సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాడు.. ప్రతిష్టను పెంచాడు.

చోళుల కాలంలో భారీ ఆలయాల నిర్మాణం..
రాజరాజ చోళుడు.. అతని కుమారుడు రాజేంద్ర ఐతంజాపూర్, గంగైకొండ చోళపురంలో భారీ దేవాలయాలను నిర్మించారు. తమిళ సంస్కృతిలో రాజరాజు గొప్పవాడు. 985–1014 నాటికి రాజరాజ చోళ సామ్రాజ్యం బాగా విస్తరించింది. అతని సామ్రాజ్యం ఒడిశా నుంచి ఉత్తరాన మాల్దీవులు.. దక్షిణాన ఆధునిక శ్రీలంక వరకు విస్తరించింది. చోళ సామ్రాజ్యం ఆధ్వర్యంలో నిర్మించిన విగ్రహాలు ప్రపంచంలోని అత్యుత్తమ కళాఖండాలలో ఒకటిగా పరిగణించబడతాయి. ఈ విగ్రహాలలో ఎక్కువ భాగం దేవతల విగ్రహాలు. చోళ రాజులు బృహదీశ్వరాలయం, రాజరాజేశ్వరాలయం కూడా నిర్మించారు. అతను దక్షిణ భారతదేశంలో సుమారు 500 సంవత్సరాలు పాలించాడు.

రాజరాజ చోళుని మతంపై చర్చ
రాజరాజ చోళుడు దేవాలయాల నిర్మాణం.. దేవుళ్లు, దేవతల విగ్రహాల ఆధారంగా హిందువుగా పరిగణించబడ్డాడు. అయితే కమల్‌ హాసన్‌ తాను చోళ రాజులను హిందువుగా పరిగణించడం లేదంటూ వాదించారు. రాజరాజ చోళుని కాలంలో హిందూమతం అనేదే లేదని అంటూ వ్యాఖ్యానించారు. అప్పట్లో వైష్ణవులు, శైవులు మాత్రమే ఉన్నారని, బ్రిటిష్‌ వారు సమష్టిగా వ్యక్తీకరించడానికి హిందూ అనే పదాన్ని ఉపయోగించారని తెలిపారు. తూత్తుకుడిని టూటికోరిన్‌గా మార్చినట్లే వైష్ణవులను, శైవులని కలిపి హిందువులుగా మార్చినట్లు తెలిపారు.

– ‘సినిమా అనేది సామాన్యుల కోసమేనని.. దీని వెనుక ఉన్న రాజకీయాలను అర్థం చేసుకోవాలని’ ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్‌ అన్నారు. మన చిహ్నాలు నిరంతరం మన నుంచి∙తీసివేయబడుతున్నాయి. తిరువళ్లువర్‌ను కాషాయీకరణ చేయడం.. రాజరాజ చోళుడిని హిందూ రాజుగా పిలవడం అలాంటి ఉదాహరణలని వ్యాఖ్యానించారు.

– వైష్ణవ, శైవ మతాల గురించి, కాశీకి చెందిన సీనియర్‌ పండిట్‌ దయానంద్‌ పాండే మాట్లాడుతూ.. హిందూ మతానికి బదులుగా, సనాతన ధర్మం అనే పదాన్ని కూడా ఉపయోగించారన్నారు. శైవ, వైష్ణవ విషయానికి వస్తే, దానిని మతం అని కాకుండా ఒక శాఖ అని పిలవడం మరింత సముచితంగా ఉంటుందని పేర్కొన్నారు. విష్ణువును విశ్వసించే వారిని వైష్ణవులని.. శివుడిని నమ్మే శైవులుగా పరిగణించబడ్డారని వెల్లడించారు.

Also Read:YCP- Non Political JAC: త్వరలో మూడు రాజధానులకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ.. వైసీపీ భారీ స్కెచ్

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular