Raghu Ramakrishnam Raju resignation : ఏపీలో ( Andhra Pradesh)రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా కొంతమంది నేతలు విషయంలో జరుగుతున్న పరిణామాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు రాజీనామా చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. దీనిపై ప్రభుత్వానికి కూడా ఫిర్యాదులు వచ్చాయి. బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలకు సంబంధించి రఘురామకృష్ణం రాజు వర్సెస్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ అన్నట్టు పరిస్థితి మారింది. రఘురామకృష్ణం రాజు డిప్యూటీ స్పీకర్గా కాకుండా టిడిపి నేతలా మాట్లాడడం పై కూడా అభ్యంతరాలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వానికి సైతం ఫిర్యాదులు వచ్చాయి. అయితే తన రాజీనామా పై రఘురామకృష్ణం రాజు క్లారిటీ ఇచ్చారు. టిడిపికి రాజీనామా చేయాలన్న డిమాండ్ పై కూడా స్పష్టత ఇచ్చారు.
* స్వతంత్రులుగా వ్యవహరించాల్సిందే..
సాధారణంగా స్పీకర్ తో పాటు డిప్యూటీ స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధమైనది. వారు ఒక పార్టీ ద్వారా ఎన్ని కవుతారు. కానీ స్పీకర్ తో పాటు డిప్యూటీ స్పీకర్ గా ఎంపికైన తర్వాత మాత్రం వారు రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటారు. స్వతంత్రంగా వ్యవహరించాలన్న నిబంధన ఉంది. అలాగని ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలోనే కొనసాగుతారు. కానీ రాజకీయ పార్టీ నేతల మాదిరిగా ప్రకటనలు, వివాదాస్పద అంశాల జోలికి పోకూడదు. కానీ రఘురామకృష్ణం రాజు( Raghu Ramakrishnam Raju ) మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తనపై జరిగిన దాడులు, కేసులకు సంబంధించి గట్టిగానే మాట్లాడుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై గెలిచిన 11మంది ఎమ్మెల్యేలు సభకు హాజరు కావాలని కోరుతున్నారు.
* స్పష్టతనిచ్చిన రఘురామకృష్ణంరాజు..
అయితే మొన్న ఆ మధ్యన బ్యాంకుకు రఘురామకృష్ణం రాజు కంపెనీలు చెల్లించాల్సిన రుణాలకు సంబంధించిన అంశాలపై ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ( IPS officer Sunil Kumar) మాట్లాడారు. రఘురామకృష్ణం రాజు పై కొన్ని రకాల విమర్శలు చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఆయన తెలుగుదేశం పార్టీ నేతలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. అందుకే ఆయనపై అవసరం అనుకుంటే న్యాయపోరాటం చేస్తానని కూడా చెప్పారు. అయితే దానిపై స్పష్టత ఇచ్చారు రఘురామకృష్ణం రాజు. తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనని తేల్చి చెప్పారు. నిబంధనలకు లోబడి పని చేస్తున్నానని చెప్పుకొచ్చారు. రాజ్యాంగంలో రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని ఎక్కడా లేదని.. అయినా సరే తాను టిడిపి కార్యక్రమాలకు హాజరు కావడం లేదని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి అయితే రఘురామకృష్ణం రాజు తన విషయంలో జరుగుతున్న ప్రచారానికి అలా తెరదించారన్నమాట.
