Homeజాతీయ వార్తలుHindu Festivals : హిందూ పండుగలపై ఎందుకీ కక్ష.. వాళ్లేం పాపం చేశారు?

Hindu Festivals : హిందూ పండుగలపై ఎందుకీ కక్ష.. వాళ్లేం పాపం చేశారు?

Hindu Festivals : మాట్లాడితే ‘నేనే పెద్ద హిందువు’ను అంటాడు రాష్ట్ర  పెద్ద ఆసామి. ఇక దేశాన్ని పరిపాలించే వారంతా హిందువులకు బ్రాండ్ అంబాసిడర్లు. వాళ్లకు వాళ్లు హిందువులను ఉద్దరించడానికి పుట్టుకొచ్చిన దైవాంస సంభూతులుగా ఫీలవుతుంటారు. అయితే అందరూ హిందువులే.. చివరకు దోపిడీకి గురయ్యేది కూడా హిందువులే. పండుగలు వస్తే చాలు ధరాఘాతంతో హిందువులు అసలు పండుగలు చేసుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొనేందుకు డబ్బు పెట్టడానికే భయపడే పరిస్థితికి హిందూభక్తులను తీసుకొచ్చారు. ధరల ఘాతంతో కనీసం పండుగలను కూడా వేడుకకు జరుపుకోలేని రోజులు దాపురించాయి.

భారతదేశం గొప్ప లౌకిక రాజ్యాం.. ఇది మనం గొప్పగా చెప్పుకునే మాట. నిజమే.. మన దేశంలో అన్నిమతాల వారూ ఉన్నారు. పరమత సహనాన్ని పాటిస్తున్నాం. అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. ఎవరి సంప్రదాయం ప్రకారం వారి పండుగలు జరుపుకుంటున్నాం. కొన్ని పండుగలను అన్నిమతాలవారు జరుపుకునే సంస్కృతి కూడా మన దేశంలో ఉంది. ఇంత గొప్ప సంప్రదాయం ఉన్న భారత దేశంలో ధరలకు మాత్రం.. హిందూ పండుగల వేళనే రెక్కలు వస్తాయి. చిన్న పత్రి నుంచి విలువైన బంగారం వరకు అన్నీ పెరుగుతాయి. ఇక్కడ విచిత్రమేమిటంటే ఇతర మతాల పండుగల వేళ.. అవే ధరలు అగ్గువ అవుతాయి. హిందూ పండుగల వేళ దోచుకుంటున్న తీరుపై స్పెషల్ ఫోకస్..

-పండుగల మాటున దోపిడీ..
హిందూ సంస్కృతిలో పండుగలకు ప్రాముఖ్యం ఉంటుంది. ముక్కోటి దేవుళ్లను పూజించే సంప్రదాయం ప్రతీ హిందూ పండుగలో ఉంటుంది. ప్రకృతిని పూజించే పండగులూ ఉన్నాయి. మన ప్రతీ పండుగ ప్రకృతితో, పంచభూతాలతో ముడిపడి ఉంటుంది. మన పూజా విధానాలు ప్రత్యేకంగా ఉంటాయి. పండుగ ఏదైనా దేవుళ్లను ప్రత్యేకంగా పూజిస్తాం. దీనినే వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఏ పండుగలకు లేనివిధంగా హిందూ పండుగల వేళనే ధరలు పెంచి దోపిడీకి పాల్పడుతున్నారు.

-రెట్టింపు నుంచి మూడు నాలుగు రెట్లు…
హిందూ పండుగల వేళ ధరల పెంపు మామూలుగా ఉండదు. వస్తువు, దాని ప్రాధాన్యతను బట్టి ధరలు రెట్టింపు నుంచి మూడు నాలుగు రెట్ల వరకూ పెరుగుతాయి. సాధారణంగా హిందువులు ప్రతీ పండుగకు పూలు, పత్రి, మామిడాకులు, కొబ్బరికాయ, పండ్లు తప్పనిసరి కొంటారు. సాధారణ రోజల్లో పూజలు, పత్రి ధరలు రూ.10, రూ.20 మాత్రమే ఉంటాయి. పండుగలు వచ్చేసరికి ఈ ధరలు మూడు రెట్లు అవుతాయి. అంటే మూరెడు పూలు రూ.30 నుంచి రూ.50 వరకు అమ్ముతారు. పత్రులను రూ.10 నుంచి రూ.30 వరకు పెంచేస్తారు. ఇక టెంకాయ ధర అయితే వ్యాపారుల ఇష్టమే. సాధారణ దుకాణాల్లోనే రూ.10 ఉన్న టెంకాయ పండుగ వేళ రూ.30 అవుతుంది. ఇక ఆలయాల వద్ద రూ.50 కి పెరుగుతుంది. ఇదేంటంటే.. రెండు అగర్‌బత్తులు, ఒక పసుపు, ఒక కుంకుమ ప్యాకెట్‌ ఇచ్చామని చెబుతారు.

-పాలు, పండ్లు,స్వీట్లు అంతే..
హిందు పండుగల్లో పాలు, పండ్లకు కూడా ప్రాముఖ్యత ఉంటుంది. పండుగ ఏదైనా పాలు, పండ్లు, స్వీట్లుల ఉండాల్సిందే. ఇదే అదనుగా వ్యాపారులు వీటి ధరలను కూడా భారీగా పెంచేస్తారు. సీజనల్‌ ఫ్రూట్స్‌ రేట్లు కూడా రెట్టింపు అవతాయి. ఇక అన్‌సీజన్‌ ఫ్రూట్‌ ధరలు అయితే మూడునాలుగు రెట్లు ఖాయం. శివరాత్రి వేళ, జామ, యాపిల్, ద్రాక్ష, బత్తాయి, అరటి పండ్ల సీజన్‌. ఈ సీజన్‌లో వీటి ధరలు తగుతాయి. అయితే పండుగ రోజు వచ్చేసరికి రెట్టింపవుతాయి. ఇక అ¯Œ సీజన్‌ ఫ్రూట్స్‌ ధరలు రెండు మూడు రెట్లు పెంచేస్తారు. ఇక పాల ధర కూడా అంతే.. పండుగల పేరు చెప్పి వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తారు. దీపావళి, శివరాత్రి, ఉగాది, ఏకాదశి లాంటి పండుగ వేళల్లో పాల వినియోగం పెరుగుతుంది. ఇదే సమయంలో పాలను ఎక్కువగా దిగుమతి చేసుకునే వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరకు విక్రయించే ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. మిఠాయిల ధరలు కూడా ఇంతే. పాలు, నెయ్యి, చెక్కర ధరలు పెరిగాయని స్వీట్ల ధరలూ పెంచేస్తారు.

-వస్త్రాలు, బంగారం కూడా అంతే..
ఇక హిందూ పండుగల్లో కొత్త బట్టులు, ఆభరణాలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. దేవుళ్ల అలంకరణతోపాటు హిందువుల కూడా పంగల వేళ నూతన వస్త్రాలు ధరిస్తాను. ముఖ్యంగా దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలకు కొత్త బట్టలు ఎక్కువగా కొంటారు. దీంతో వ్యాపారులు ఇదే సమయంలో వాటి ధరలు పెంచేస్తారు. ఆఫర్ల పేరుతో మాయ చేస్తారు. బై వన్‌ గెట్‌ వన్‌ అంటూ ధరలు పెంచి విక్రయిస్తారు. ఆఫర్‌ ఉంది కదా అని మనం కొనేస్తుంటాం. ఇక బంగారం కొనుగోలుకు అయితే వ్యాపారులు ఏకంగా ఓ పండుగనే సృష్టించారు. అక్షయ తృతీయ పేరుతో వ్యాపారులు బంగారం అమ్మకాలు ఏటేటా పెంచుకుంటున్నారు. ఈ పండుగ సమయంలో ధర ఏమైనా తగ్గిస్తారా అంటే అదేమీ ఉండదు. బులియన్‌ మార్కెట్‌లో పెరిగింది అంటూ ధర పెంచేస్తారు. అయితే ఊరడింపు అన్నట్లు ఉచిత గిఫ్ట్‌లు ఇస్తామని ఆఫర్‌ చేస్తారు.

-దళారులకే లాభం..
పెరిగిన ధరలతో పూలు, పండ్లు సాగుచేసే రైతులకు గానీ, గ్రామాల నుంచి పట్టణాలకు తీసుకు వచ్చే కూలీలకు కానీ లబ్ధి కలుగుతుందా అంటే అదీ లేదు. పండుగల పేరుతో పెరుగుతున్న ధరలతో చివరకు లాభం పొందేది మధ్య దాళారే. నష్టపోయేది మాత్రం రైతు, కొనుగోలుదారే. ఈ రైతు కాకపోతే ఇంకో రైతు అన్నట్లు పూలు, పండ్లు, దుంపలు, పత్రులు వీలైనంత తక్కువ ధరకు బేరమాడి కొనుగోలు చేస్తారు దళారులు. వాటిని మార్కెట్‌కు తీసుకువచ్చి.. డిమాండ్‌ను బట్టి ధరలు పెంచేస్తారు. ఈ విధానంతో అటు రైతులు, ఇటు కొనుగోలు దారులకే నష్టం జరుగుతోంది. దళాలు మాత్రం భారీగా దండుకుంటున్నారు.

-ఇతర పండుగల వేళ తగ్గింపు..
హిందూ పండుగల వేళ ధరలు పెంచుతున్న వ్యాపారులు ఇతర మతాల పండుగల వేళ మాత్రం ఉన్న ధరను తగ్గిస్తారు. ముస్లింల అతిపెద్ద పండుగ అయిన రంజాన్‌ వేళ పండ్ల ధరలు గణనీయంగా తగ్గుతాయి. నెల రోజులపాటు రంజాన్‌ మాసంలో ముస్లింలు ఉపవాసం ఉంటారు. ఈ సమయంలో పండ్లు ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఈ పండుగ వేళ అన్‌సీజన్‌ పండ్లు కూడా అగ్గువ ధరకే లభిస్తాయి. ఇదేంటంటే సమాధానం ఉండదు, క్రిస్మస్‌ వేళ వస్త్రాలకు తప్ప ఇతర సామగ్రికి పెద్దగా డిమాండ్‌ ఉండదు.

మొత్తంగా హిందూ పండుగలనే వ్యాపారులు తమ ఆదాయ వనరుగా మార్కుకుంటున్నారు. భక్తుల వీక్‌నెస్‌ను క్యాష్‌ చేసుకుంటున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version