Homeజాతీయ వార్తలుIND vs AUS - Narendra Modi : జాతీయగీతం వినిపిస్తుంటే మోడీ హావభావాలు చూశారా?...

IND vs AUS – Narendra Modi : జాతీయగీతం వినిపిస్తుంటే మోడీ హావభావాలు చూశారా? వైరల్ వీడియో

IND vs AUS – Narendra Modi : చాలామంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శిస్తారు. అదే స్థాయిలో ప్రశంసిస్తారు. అంతేకానీ ఆయన ప్రస్తావన తీసుకురాకుండా ఉండలేరు. అది అసాధ్యం కూడా. అంతలా చెరగని ముద్ర వేశాడు నరేంద్ర మోడీ.. మిగతా విషయాలు పక్కన పెడితే సమకాలీన భారత రాజకీయాల్లో దౌత్య విధానాన్ని పరిపుష్టం చేయడంలో మోడీ తర్వాతే ఎవరైనా. అందుకే రష్యా నుంచి అమెరికా దాకా అన్ని దేశాలకు ఇప్పుడు భారత్ కావాలి. భారతదేశంలో చెలిమి కావాలి. అలాంటి అవకాశాన్ని నరేంద్ర మోడీ సృష్టించాడు.. ఇప్పుడు రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న మోడీ చమరుకు సంబంధించి చెల్లింపులన్నీ రూపాయలోనే జరుగుతున్నాయి అంటే దానికి కారణం మోడీ అనుసరిస్తున్న దౌత్య విధానమే.

ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు భారత్ లో పర్యటిస్తోంది.. ఇప్పటికే మూడు టెస్ట్ మ్యాచ్లు ఆడింది. భారత్ రెండు, ఆస్ట్రేలియా మ్యాచ్ గెలిచింది.. కీలకమైన నాలుగో టెస్ట్ గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమైంది.. ఈ మ్యాచ్ కు ప్రధాని మోడీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్ ముఖ్య అతిథులుగా వచ్చారు. జట్ల ఆటగాళ్ళను పరిచయం చేసుకున్నారు. నరేంద్ర మోడీకి కెప్టెన్ రోహిత్ శర్మ ఇండియన్ ఆటగాళ్ళను పరిచయం చేయగా, ఆస్ట్రేలియా ప్రధానికి స్మిత్ తమ దేశ ఆటగాళ్ళను పరిచయం చేశాడు. ఆ తర్వాత ఈ దేశాలకు చెందిన జాతీయ గీతాలను ఆలపించారు. మొదట ఆస్ట్రేలియా జాతీయ గీతం ఆలపించగా.. దానికి ఆ దేశ క్రీడాకారులు, ప్రధాన మంత్రి నోరు కదిపారు. ఆస్ట్రేలియా జాతీయ గీతం వినిపిస్తున్న సమయంలో ఆ దేశ ప్రధాని, క్రీడాకారులు ఒకరిపై ఒకరు చేయి వేసుకొని సంఘటితంగా నిలబడ్డారు. కానీ భారత జాతీయ గీతం ఆలపించే సమయంలో నరేంద్ర మోడీ, క్రీడాకారులు ఎవరికి వారుగా నిలబడ్డారు.. అయితే ఆ గీతం వినిపిస్తున్న సమయంలో నరేంద్ర మోడీ చాలా దృఢంగా నిలబడ్డారు.. తన ముఖంలో ధీరోధాత్తమైన హవా భావాలను ఒలికించారు. జాతీయగీతం వినిపిస్తున్నంత సేపూ ఆయన జాతీయ జెండాను సూటిగా చూస్తూ కనిపించారు.

ఇదంతా ముగిసిన తర్వాత నరేంద్ర మోడీ టాస్ వేశారు. ఇక మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మొదట్లో తడబడినప్పటికీ… ఖవాజా,గ్రీన్ వల్ల కోలుకుంది. గత మూడు టెస్టు మ్యాచ్ ల కంటే భిన్నంగా ఈ టెస్ట్ మ్యాచ్లో ఆడింది.. ముఖ్యంగా ఇండియన్ బౌలర్లను ఈ జోడి కాచుకుంది. ఆస్ట్రేలియా, భారత్ మధ్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఆ దేశ ప్రధానిని నరేంద్ర మోడీ ఇండియాకు ఆహ్వానించారు.. అహ్మదాబాద్ టెస్ట్ మ్యాచ్ కు దగ్గరికి తీసుకెళ్లారు. ఇద్దరు కలిసి చాలాసేపు మాట్లాడుకున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షించారు.. అయితే కామన్వెల్త్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆస్ట్రేలియా ప్రధాని, జి20 అధ్యక్షుడిగా కొనసాగుతున్న నరేంద్ర మోడీ ఓకే వేదికను పంచుకోవడంతో ప్రపంచ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.. మరోవైపు భారత్ తో స్వేచ్ఛా వాణిజ్యాన్ని ఆస్ట్రేలియా ఈ మధ్య మరింత పెంచింది.. అయితే ఆస్ట్రేలియా ప్రధాని తాజా పర్యటన ఇది దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

PM Modi & PM Albanese during National Anthems at Narendra Modi Stadium | Ind vs Aus| 4th Test Match

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version