Pawan Kalyan : ప్రజల కోసం.. వారి బాగు కోసం ఏదైనా నిస్వార్థంగా చేస్తే అది ఖచ్చితంగా ఫలితం ఇస్తుందని జనసేనాని పవన్ కళ్యాణ్ చూస్తే తెలుస్తోంది. ఒక ప్రభుత్వం చేయాల్సిన పనిని.. తను సినిమాల్లో కష్టపడి సంపాదించిన సొమ్మును చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఇస్తున్న తీరు చూసి అందరూ అభినందిస్తున్నారు. ఈరోజుల్లో ఇలా 5 కోట్లు, 10 కోట్లు రైతులకు సొంత డబ్బులు ఇచ్చేవారు ఎవరుంటారని అందరూ ప్రశంసిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కౌలురైతు భరోసా యాత్ర, జనవాణి పేరిట ప్రజల కష్టాలు తీరుస్తున్నారు. వారి బాగు కోసం స్వయంగా కదిలి సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు.జనవాణిలో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నారు. ఇలాంటి నేత అందరికీ అవసరం అంటూ ప్రజలు కొనియాడుతున్నారు.
అయితే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఢిల్లీలోనూ పవన్ సేవానిరతికి ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా జాతీయ మీడియాలో పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర గురించి.. ఆయన చనిపోయిన కుటుంబానికి లక్ష చొప్పున సాయం గురించి గొప్పగా పొగిడారు. జనవాణి పేరిట ప్రజల సమస్యలు తీరుస్తున్నాడని ప్రశంసించాడు.
ఇప్పటికే ఉత్తరాంధ్ర, విజయవాడ సహా పలు జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టిన పవన్ కళ్యాణ్.. తాజాగా కరువు సీమ రాయలసీమ రైతులకు సాయం చేయాలని నిర్ణయించారు. గత ఎన్నికల్లో వైసీపీకి అంతులేని విజయాన్ని అందించిన రాయలసీమను జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. అక్కడ ప్రజల కష్టాలు తీర్చేందుకు రెడీ అయ్యారు.
ప్పటికే అనంతపురం కౌలురైతు భరోసా యాత్ర చేపట్టిన పవన్ అక్కడ ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయమందించారు. కడపలో మలి విడత యాత్ర చేపట్టడానికి సన్నద్ధమవుతున్నారు. ఇంతలో రాయలసీమ ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు ఆదివారం తిరుపతిలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ రాయలసీమలో చేపట్టిన కౌలు రైతు భరోసాయాత్ర, జనవాణిపై ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ సాగుతోంది. అన్ని జాతీయ చానెళ్లు పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతో చేస్తున్న ఈ ప్రజాసేవను వేయినోళ్ల పొగిడేశారు. పవన్ కళ్యాణ్ ది గొప్పసేవ అంటూ జాతీయ మీడియా కొనియాడింది. ఇలాంటి నేతల అవసరం ప్రజలకు ఉందంటూ డిబేట్స్ లో నేతలు ప్రశంసించడం విశేషం.