Pawan Kalyan – PM Modi : ఈరోజు పవన్ కళ్యాణ్ , మోడీ కీలక భేటి జరుగబోతోంది. ఏ విశాఖలో అయితే పవన్ కళ్యాణ్ పై నిర్బంధాలు పెట్టారో.. ఏ విశాఖలో అయితే ఆంక్షలు విధించారో.. ఏ విశాఖలో అయితే పవన్ కళ్యాణ్ కు అవమానం జరిగిందో.. అదే విశాఖలో మోడీతో భేటి జరగడం పవన్ కళ్యాణ్ కు ఘనసత్కారం జరిగినట్టే.. కేవలం ఒక నెలరోజుల లోపలే పవన్ కళ్యాణ్ కు ఈ గౌరవం దక్కడం విశేషం.
అక్టోబర్ 15న పవన్ కళ్యాణ్ కు విశాఖలో అవమానం జరిగితే.. నవంబర్ 11న మోడీతో పవన్ భేటి జరుగుతోంది. పవన్ ను నాడు పోలీసులతో అణిచివేసిన జగన్ సర్కార్.. ఇప్పుడు ఇదే పవన్ కు పోలీసులతో రక్షణ కల్పించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇదే ప్రజాస్వామ్యం అంటే..
విశాఖలో అక్టోబర్ 15న పవన్ ను ఎంతలా అణిచివేశారో తెలిసిందే.నవంబర్ 11న మోడీ రాకతో వైసీపీ సర్కార్ బాగా ఏర్పాట్లు చేస్తే.. ఇప్పుడు మోడీతో భేటితో క్రెడిట్ అంతా పవన్ కు పోతోంది. పవన్ ఎంట్రీ కావడంతోనే సీన్ మారిపోతోంది.
విశాఖలో పవన్ కళ్యాణ్ -మోడీ భేటిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.