Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వైపు ఆ వర్గం ఎందుకు ఆకర్షితులవుతోంది?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వైపు ఆ వర్గం ఎందుకు ఆకర్షితులవుతోంది?

Pawan Kalyan: ‘రెడ్డి’లకు జగన్ ఉన్నారు. బలమైన ‘కమ్మ’లకు చంద్రబాబు ఉన్నారు. ‘వెలమ’ దొరలకు కేసీఆర్ ఇంకా బలంగా నిలబడ్డారు. తెలుగు రాష్ట్రాల్లోనే బలమైన ఈ వర్గాలకు బలమైన నేతలున్నారు. మరి బడుగు, బలహీన వర్గాలకు ఎవరున్నారు? అంటే అందరికి కనిపించే ఒకే ఒక్కడు మన ‘పవన్ కళ్యాణ్’.అవును.. ఇప్పుడు బీసీల చూపు ‘పవన్’ వైపు మళ్లింది. ఇప్పటికే కాపులు పవన్ కళ్యాణ్ ను ఓన్ చేసుకోగా.. ఇప్పుడు ఇతర బీసీ వర్గాల్లోనూ పవన్ పై ప్రేమ పుడుతోంది. వారిని ఆకర్షించడంలో.. వారి సమస్యలు తీర్చడంలో పవన్ చూపుతున్న చొరవకు ఈ వర్గం వారంతా ఇప్పుడు జనసేనకు వెన్నుదన్నుగా మారుతున్నారు. ఏపీలో బీసీలు జనసేన వైపు మరలుతుండడం వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బీసీల పార్టీగా జనసేన నిలబడితే ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు ఖాయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. పవన్ చేస్తున్న చర్యలే ఆయనను ఆ వర్గానికి దగ్గర చేస్తున్నాయి.

తాజాగా మత్స్యకారులు జనసేనకు టర్న్ అయ్యారా? దశాబ్దాల పాటు తమను ఓటు బ్యాంకుగా మార్చుకున్న రాజకీయ పక్షాలపై విరక్తితో ఉన్నారా? తమ భవిష్యత్, మనుగడ పవన్ తోనే సాధ్యమనుకుంటున్నారా? ఆయనతోనే తమకు రాజ్యాధికారం దక్కుతుందని భావిస్తున్నారా? ఉద్యోగ, ఉపాధి మార్గాలు పెరుగుతున్నాయనుకుంటున్నారా? చట్టసభల్లో తమ ప్రాతినిధ్యం పెరగాలంటే పవన్ వెంట నడవడమే శ్రేయస్కరమనుకుంటున్నారా? అంటే మత్స్యకార వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది.

విభజిత ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రానికి ఏమైనా కలిసి వచ్చిందంటే అది తీర ప్రాంతమే. కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా పీఠమెక్కిన చంద్రబాబు సర్కారు సైతం తీర ప్రాంత పరిరక్షణకు తీసుకున్న చర్యలేమీ లేవు. మత్స్యకారుల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు చేపట్టనూ లేదు. అటు తరువాత వచ్చిన వైసీపీ సర్కారు సైతం సంక్షేమ పథకాల తాయిలాలుగా చూపి మత్స్యకార వర్గాల నుంచి ఎన్నికల్లో లబ్ధి పొందిందే తప్ప వారికి శాశ్వత ప్రయోజనం కలిగించే ఏ ఒక్క ప్రాజెక్టును నిర్మించలేదు. పైగా తీర ప్రాంతంలో భూములను బడా సంస్థలకు కేటాయింపులు చేస్తోంది. అదే సమయంలో ఫిషింగ్ హార్బర్లు, జెట్టీల నిర్మాణానికి మాత్రం భూములను సేకరించలేకపోతోంది. పైగా మత్స్యకారుల ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా 270 జీవోను తెరపైకి తెచ్చింది. సముద్రంతో పాటు నదులు, కాలువలు, చెరువుల్లో చేపల వేటకు వేలం పాట నిర్వహించేందుకు నిర్ణయించింది. 60 లక్షల మంది ఉన్న మత్స్యకారుల సంఖ్యను తక్కువగా చూపి… మత్స్యకార సహకార సంఘాల్లో సభ్యత్వం ఉంటేనే ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తోంది. ఏటా వేసవిలో వేట నిషేధ సమయంలో అందించే వేసవి భ్రుతిలో సైతం భారీగా కోత విధిస్తోంది.

-మత్స్యకారుల అభ్యున్నతి సభతో ఊపు
మత్స్యకారులు మర్రోమంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ద్రుష్టిసారించిన పాపాన పోలేదు. ఇటువంటి సమయంలో జనసేనాని పవన్ మత్స్యకారుల సమస్యలపై గొంతెత్తారు. మత్స్యకార అభ్యున్నతి సభ ఏర్పాటుచేసి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకార సంఘ నాయకులు కార్యక్రమానికి హాజరై తమ సమస్యలను విన్నవించారు. దశాబ్దాలుగా తాము ఎదుర్కొంటున్న అపరిష్క్రుత సమస్యలను వినిపించారు. దీనిపై పవన్ కళ్యాణ్ గళమెత్తారు. దీంతో ప్రభుత్వం 270 జీవో విషయంలో వెనక్కి తగ్గింది. ఫిషింగ్ హార్బర్లు, జెట్టీల నిర్మాణంపై స్పీడ్ పెంచింది. టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి భూ సేకరణ చేపడుతోంది. మత్స్యకారుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతోంది. ఇవన్నీ పవన్ కళ్యాణ్ కార్చాచరణ ప్రారంభించిన తరువాతే ప్రభుత్వంలో కదలిక రావడాన్ని మత్స్యకారులు గుర్తించారు. జనసేనతోనే మత్స్యకారుల ఉనికి సాధ్యమని నమ్ముతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు. దాని ఫలితంగానే తీర గ్రామాల్లో మత్స్యకారులు జనసేనలో చేరుతున్నారు.

-ఓటు బ్యాంక్ రాజకీయాలకు చెక్
సువిశాల తీర ప్రాంతం ఏపీ సొంతం నెల్లూరు జిల్లా తడ నుంచి శ్రీకాకుళం జిల్లా డొంకూరు వరకూ దాదాపు 1000 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. వేలాది తీర గ్రామాలున్నాయి. దాదాపు 60 లక్షల మంది మత్స్యకార జనాభా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా మత్స్యకారుల బతుకులు మాత్రం మారడం లేదు. మత్స్యకారులను ఓటు బ్యాంకు చూస్తున్నారే తప్ప వారి జీవన ప్రయోజనం మెరుగుపరిచే చర్యలు ఈ రాష్ట్రంలో శూన్యం. ఫిషింగ్ హార్బర్లు లేవు. జెట్టీల నిర్మాణమూ లేదు. మత్స్య సంపదను విక్రయించేందుకు సరైన మార్కెట్, రవాణా సదుపాయాలూ లేవు. స్థానికంగా వేట గిట్టుబాటుకాక మత్స్యకారులు సుదూర ప్రాంతాలకు వలసపోతున్నారు. గుజరాత్, కాండ్ల వంటి ప్రాంతాల్లో ప్రైవేటు కాంట్రాక్టర్ల వద్ద పనికి కుదురుతున్నారు. వేటకు వెళ్లి సరిహద్దు దాటి విదేశీ జల విభాగంలోకి అడుగుపెడుతున్నారు. అక్కడి కోస్టుగార్డులకు చిక్కుతున్నారు. సంవత్సరాల తరబడి అక్కడి జైలులో మగ్గుతున్నారు. దశాబ్దాలుగా వారి వ్యథ అంతా ఇంతా కాదు. నేతల హామీలు వినివిని వేసారిన గంగపుత్రులకు జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక ఆశాదీపంలా కనిపిస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో టీడీపీ ఆవిర్భావం తరువాత మత్స్యకారులు ఆ పార్టీ వెంట నడిచారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రతో కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారు. విభజిత ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు వైపు, గత ఎన్నికల్లో సంక్షేమ హామీలతో జగన్ కు అండగా నిలిచారు. మత్స్యకారులు అండగా నిలిచిన పార్టీలే రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నాయి. ఈసారి పవన్ కళ్యాణ్ వైపు మరలుతుండడంతో జనసేన అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

2 COMMENTS

  1. […] Nagarjuna Hello Brother Movie: దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ అప్పుడప్పుడే వరుస విజయాలు అందుకుంటున్న రోజులు అవి. ఆయనకు ఆ సమయంలో ఓ కోరిక కలిగింది. ఓ స్టార్ హీరోతో ఓ ద్విపాత్రాభినయం సినిమా చేయాలని. అప్పటికే ఆయన అక్కినేని నాగార్జునతో ‘వారసుడు’ అనే చిత్రాన్ని తీశారు. పైగా నాగ్ తో మంచి పరిచయం ఉంది, అలాగే సాన్నిహిత్యం కూడా ఉంది. అందుకే నాగార్జున ద్విపాత్రాభినయంగా ‘హలో బ్రదర్‌’ సినిమాని ప్లాన్ చేశారు ఈవీవీ. […]

  2. […] Byreddy Siddharth Reddy: రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రభుత్వ హనీమూన్ పిరియడ్ ముగిసింది. మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంది. మహా అయితే ఒక ఏడాది పాలన సాగుతుంది. ఉన్న ఏడాది ఎన్నికల వ్యూహాలకే గడిచిపోతుంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉండగానే అన్ని పార్టీలు వ్యాహప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలో అసమ్మతిని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. అధికార పక్షం నుంచి టీడీపీ, జనసేనలోకి భారీ వలసలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడేళ్లుగా సైలెంట్ గా ఉన్న గంటా శ్రీనివాసరావు ఇటీవల మంత్రివర్గ విస్తరణ పరిణామాలు చూసి టీడీపీ కండువాతో ప్రెస్ మీట్ సైతం పెట్టేశారు. టీడీపీలోకి త్వరలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు వస్తారని తేల్చిచెప్పారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular