Telangana Congress : ప్రభుత్వ వ్యతిరేకత నిజం, అది కాంగ్రెస్ ఓటుగా మారుతుందా?

తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత నిజం, అది కాంగ్రెస్ ఓటుగా మారుతుందా? లేదా అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : November 1, 2023 4:39 pm

Telangana Congress : తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ గెలుపుగా మారుతుందా? లేదా? అన్నది ప్రధాన చర్చగా ఉంది. సోషల్ మీడియా, రకరకాల సర్వేలు.. కొన్ని యూట్యూబ్ చానెల్స్ పూర్తిగా కాంగ్రెస్ గాలి ఉన్నట్టు.. కాంగ్రెస్ గెలుపు ఖాయమని చూపిస్తున్నాయి. విన్న వాళ్లకు, చూసిన వాళ్లకు కాంగ్రెస్ గెలుస్తుందా? అనిపిస్తోంది.

అయితే ఇది నల్లేరు మీద నడక కాదన్నది విశ్లేషకుల మాట.. ఫాస్ట్ ట్రాక్ రికార్డు చూస్తే ఎప్పుడూ కూడా ఇటువంటి హైప్ నే వచ్చింది. 2014లో కాంగ్రెస్ గెలుస్తుందనుకున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. 2018లో సర్వేలు కూడా కాంగ్రెస్ అధికారం ఖాయమని చెప్పటం జరిగాయి. అయినా అప్పుడూ ఫెయిల్ అయిపోయారు.

ఈ హైప్ కాంగ్రెస్ వైపు వస్తూ ఓట్లుగా ఎందుకు కన్వర్ట్ కావడం లేదు. ఎందుకు గత ఫలితాలను అంచనా వేయడం లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ చతికిలిపడింది. బీజేపీ భారీ సీట్లు గెలిచింది. కాంగ్రెస్ కు కేవలం 2 సీట్లు వచ్చాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ తప్ప బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి పోటీ చేసి గెలిచి ఇప్పుడు పాలిస్తున్నాయి..

తెలంగాణ ఉప ఎన్నికల్లో దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ, నాగార్జున సాగర్ సీట్లలోనూ కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది.

తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత నిజం, అది కాంగ్రెస్ ఓటుగా మారుతుందా? లేదా అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.