Hyderabad Nizam Net Worth: రాజుల సొమ్ము రాళ్ళ పాలని అని ఒక సామెత. దానిని పెద్ద వాళ్ళు ఎందుకు సామెత రూపంలోకి తెచ్చారో నిజాం చరిత్ర చదివితే అవగతం అవుతుంది. మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1911 లో హైదరాబాద్ స్టేట్ ను అధిరోహించారు. 1948 సెప్టెంబర్ 17 వరకు పాలించాడు. ఆయనకు వారసత్వంగా వజ్రాల శుద్ది, ముత్యాల తయారీ పరిశ్రమలు వచ్చాయి. వాటి ద్వారా ఆయనకు ఆ రోజుల్లోనే కోట్లల్లో ఆదాయం వచ్చేది. ముత్యాలను, వజ్రాలను అరబ్ దేశాలకు ఎగుమతి చేసేవారు. అప్పట్లో హైదరాబాద్ విస్తీర్ణం 80 వేల చదరపు కిలోమీటర్లు. ఇది స్కాట్ లాండ్ దేశ వైశాల్యంతో సమానం. హైదరాబాద్ స్టేట్ విలీనం నాటికి ప్రపంచ ధనవంతుల్లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ నంబర్ వన్. 1937 ఫిబ్రవరిలో టైమ్ మ్యాగ్జిన్ అలీ ఖాన్ కవర్ పేజీతో ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది అప్పట్లోనే నిజాం సంపద విలువ 600 కోట్లకు పైగా ఉంది. బంగారం, వజ్రాలు ఇందుకు అదనం. గోల్కొండ వజ్రాల గనులు, ముత్యాల తయారీ పరిశ్రమ, వివిధ సంస్థానాల నుంచి వచ్చే ఆదాయంతో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రపంచ కుబేరుడు అయ్యాడు. ఉస్మాన్ అలీ ఖాన్ వజ్రాలు పొదిగిన కత్తిని ధరించేవారు. దాని విలువ రెండు లక్షల డాలర్లుగా ఉండేది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు 23 వేల ఎకరాల సర్ఫే కాస్ భూములు ఉండేవి. వీటితోపాటు దేశంలోనే వివిధ ప్రాంతాల్లో 600కు పైగా విల్లాలు, విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. ఒక్క హైదరాబాదులోనే చౌమహల్లా, చిరాన్ పోర్ట్, నజ్రీ బాగ్, పరేడ్ విల్లా, పెర్న్ విల్లా, హిల్ పోర్ట్, మౌంట్ ప్లజెంట్ విల్లాలు ఉస్మాన్ అలీ ఖాన్ సొంతం. ఇవే గాక 173 రకాల బంగారు, వజ్రాభారణాలు ఉండేవి. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బ్రిటిష్ ప్రభుత్వానికి వీర విధేయుడుగా ఉండటంతో ఈజ్ ఎక్సార్టెడ్ హైనస్ అనే బిరుదు ప్రకటించింది.

లొంగి పోయాక
మీర్ ఉస్మాన్ అలీఖాన్ లొంగి పోయాక.. కొన్ని మినహా అన్ని ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని అంటుంటారు. నేటికీ ఆయన ఆస్తుల వివరాలు గోప్యంగానే ఉన్నాయి. అయితే ఆయన లొంగి పోయాక ప్రభుత్వం ఏడాదికి 50 లక్షల చొప్పున చెల్లించదనే వాదనలు ఉన్నాయి. అయితే వీలినానికి రెండు రోజుల ముందే నిజాం రాజ్యం నుంచి ఒక మిలియన్ ఫౌండ్ల నిధులను ఇంగ్లాండ్ లోని వెబ్ మినిస్టర్ బ్యాంక్ కు తరలించారు.
ఈ నిధులను ఇంగ్లాండ్లోని పాకిస్తాన్ హై కమిషనర్ హబీబ్ ఇబ్రహీం రహమతుల్లా పేరిట ఉన్న ఖాతాలో జమ చేశారు. నిజం ఆర్థిక శాఖ మంత్రి మోయిన్ నవాజ్ జంగ్ ఈ నిధులను ఇంగ్లాండ్ కు తరలించడంలో కీలకపాత్ర పోషించారు. నిజాం కు తెలియకుండానే ఆయన ఈ పని చేశాడనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్ లో విలీనం అయిన తర్వాత ఈ నిధులను తిరిగి ఇవ్వాలని పాకిస్తాన్ హై కమిషనర్ హాబీబ్ ను నిజం సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది. 1956 వరకు ఈ నిధుల కోసం నిజాం ప్రయత్నించాడు. కానీ నేటికీ నిధులు విడుదల కాలేదు.

1967 లో నిజాం కన్ను మూసిన అనంతరం నిధులపై ఆయన వారసులు కూడా స్పందించలేదు. ప్రస్తుతం ఇవి ఇంగ్లాండ్లోని రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్ లాండ్ లో ఉన్నాయి. ప్రస్తుతం వీటి విలువ 310 కోట్లు. ఇక ఈ నిధులపై గత 67 ఏళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. అయితే 1948లో ఇంగ్లాండ్ నుంచి ఈ నిధులన్నీ పాకిస్తాన్ హై కమిషనర్ హబీబ్ ఇబ్రహీం రహీమతుల్లా కు బదిలీ అయ్యాయని ఆరోపణలు వచ్చాయి. కానీ బదిలీ అయినట్టు ఎక్కడా ఆధారాలు లేవు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వివాదాలు పెరిగిపోతూ వచ్చాయి. కోర్టులతో ఎటువంటి సంబంధం లేకుండా భారత్, పాకిస్తాన్ చర్చించుకోవాలని భారత కేంద్ర క్యాబినెట్ 2008లో నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ నిధులకు సంబంధించి 1948 సెప్టెంబర్ 20న డిపాజిట్ వివరాలు అందించాలంటూ సమాచార హక్కు చట్టం కింద అక్బర్ అలీ ఖాన్ అనే వ్యక్తి న్యాయ మంత్రిత్వ శాఖ కు దరఖాస్తు చేశాడు. ఇతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కావడంతో నిజాం ఆస్తులపై మారాఠా ప్రజలకు హక్కు ఉందని, అందులో తన వాటా ఎంతో తేల్చాలని కోరాడు. నీతో కేంద్ర సమాచార కమిషన్ భారత్, పాకిస్తాన్ మధ్య వివాదాన్ని వెంటనే తేల్చాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించింది.
నిధులతో పాకిస్తాన్ కు సంబంధం ఉందా
ఏడవ నిజం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కు పాకిస్తాన్ కు చెందిన హబీన్ ఇబ్రహీం రహమతుల్లా సన్నిహితంగా ఉండేవాడు. 1948లో ఇబ్రహీం బ్రిటన్ లో పాకిస్తాన్ హై కమిషనర్ గా నియమితుడయ్యాడు. అయితే నిజాం కు చెందిన ఒక మిలియన్ అవునుల నిధులను ఇబ్రహీం పేరట బ్రిటన్ లోని వెస్ట్ మినిస్టర్ బ్యాంకులో డిపాజిట్ చేశాడు. ఈ నిధులు అన్ని నిజాం వద్ద ఆర్థిక మంత్రిగా పనిచేసిన నవాజ్ జంగ్ స్వయంగా బ్రిటన్ కు పంపించాడు. భారత్లో నిజాం రాజ్యం విలీనమైన తర్వాత ఈ నిధులను తిరిగి ఇవ్వాలని ఇబ్రహీంను నిజాం ఎన్నిసార్లు అభ్యర్థించినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఇబ్రహీం అనే వ్యక్తి తమ దేశస్తుడు కావడంతో తమకు అధికారాలు ఉంటాయని పాకిస్తాన్ వాదించింది. అయితే ఈ నిధులను మాకే చెందుతాయని నిజాం వారసుడు నవాబ్ నజాఫ్ అలీఖాన్ 2016 జూన్ 23న ప్రకటించారు. ఇవి నిజాం వ్యక్తిగత నిధులని, వీటిపై ఇరుదేశాలకు హక్కు లేదని ప్రకటించారు.

నిజాం కు 16 మంది కుమారులు, 18 మంది కుమార్తెలు ఉండేవారు. వీరిలో ఒక కొడుకు ఇద్దరు కూతుర్లు మిగిలారు. కానీ వారి వారసులు 120 మంది ఉన్నారు. వీరందరి తరపున నిజాం ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా నజాఫ్ అలీఖాన్ వ్యవహరిస్తున్నారు. కాగా నిజాం ఆభరణాలపై 1995లో సుప్రీంకోర్టులో కేసు నమోదు అయింది.. నిజాం రాజ్య ఆస్తులు, వ్యక్తిగత ఆస్తులను వేరుగా చూడాలని, ఈ ఆభరణాలు నిజం వారసులకు చెందుతాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాగా నిధులను ఇచ్చేందుకు ఇంగ్లాండ్ బ్యాంకు సుముఖంగానే ఉన్నా భారత్ పాకిస్తాన్ మాత్రం వివాదానికి ముగింపు పలకడం లేదు. ఇది ఇలా ఉండగానే హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఉన్నందున తెలంగాణకూ ఈ నిధులపై హక్కు ఉందని విదేశాంగ అధికారులు ప్రకటించారు. నిధులకు సంబంధించిన ఆధారాల కోసం హైదరాబాదును ఇటీవల మూడుసార్లు సందర్శించారు. తార్నాక లోని ఆర్క్ లైవ్ లో వీటికి సంబంధించిన ఆధారాల కోసం శోధించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఈ వాదనలు ఇలా జరుగుతుండగానే నిజాం ఆస్తులను తాము అధికారం లోకి రాగానే స్వాధీనం చేసుకుంటామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటిస్తుండటం గమనార్హం.