https://oktelugu.com/

Nepal Protest : నేపాల్ లో రాజే కావాలి.. హిందూ దేశం కావాలని వేలాది మంది నిరసన

నేపాల్ లో రాజే కావాలి.. హిందూ దేశo కావాలని వేలాది మంది నిరసనకు కారణం ఏంటన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : November 25, 2023 / 01:45 PM IST
    Follow us on

    Nepal Protest : మన పొరుగుదేశం నేపాల్ లో పరిణామాలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. మొన్న 23వ తేదీ ఖట్మాండులో వీధుల నిండా వేలాది మంది దేశం మొత్తం మీద నుంచి వచ్చి నినాదాలు చేశారు. ‘ప్రజాతంత్రం వద్దు.. రాజ తంత్రం ముద్దు’ అంటూ నినదించారు. మాకు ‘రాజు’ కావాలి..రాచరికం కావాలని.. ఈ బూటకపు ప్రజాస్వామ్యం వద్దు అంటూ ఆందోళన చేశారు.

    ఎక్కడైనా ప్రజాస్వామ్య పాలన కావాలని ఆందోళన చేస్తారు. కానీ నేపాల్ లో రాజ పాలన కావాలని.. రాచరికం కావాలని పోరాడారు. 2015లో ప్రస్తుత రాజ్యాంగం అమలైంది. ఆ రాజ్యాంగం మాకు వద్దని 1990లో రాజు బీరేంద్ర పెట్టిన రాజ్యాంగం కావాలని కోరుతున్నారు. దాంట్లో పార్లమెంట్ కు పవర్స్ ఉండవు. రాజే పాలకుడు. పంచాయితీ వ్యవస్థ ఉంటుంది. సలహా మండలి ఉంటుంది. హిందూ దేశంగా ఉంటుంది.

    2015 రాజ్యాంగంలో సెక్యూలర్ రాజ్యాంగం.. రిపబ్లిక్ ఉంటుంది. రాజు ఉండడు. ఓటువేసి నాయకులను ఎన్నుకోవాలి. ప్రజాస్వామ్యం వద్దు అనేదాకా అక్కడ పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది ఇక్కడ ప్రశ్న. దేశాన్ని ప్రజాస్వామ్యయుతంగా పాలించలేరని ప్రజలంతా డిసైడ్ అయ్యారు. రాజకీయ నాయకులు, అవినీతి పాలనే కారణం అని ప్రజలంతా డిసైడ్ అయ్యారు.

    నేపాల్ లో రాజే కావాలి.. హిందూ దేశo కావాలని వేలాది మంది నిరసనకు కారణం ఏంటన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.