https://oktelugu.com/

MAD Movie Review : మాడ్ సినిమా ఫుల్ రివ్యూ

ఫైనల్ గా చెప్పాలంటే యూత్ సినిమాల్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు, అలాగే అడల్ట్ డైలాగ్స్ ని కూడా స్వీకరించేవాళ్లు ఉంటే ఈ సినిమాని ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు...

Written By:
  • Gopi
  • , Updated On : October 6, 2023 / 09:25 AM IST

    mad review

    Follow us on

    MAD Movie Review : తెలుగులో కాలేజీ బ్యాక్ డ్రాప్ లో స్టోరీ అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చే సినిమా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన హ్యాపీడేస్ సినిమా అనే చెప్పాలి. ఈ సినిమా ఇంజినీరింగ్ కాలేజీ లైఫ్ ఎలా ఉంటుంది అనే దానిమీద చాలా చక్కని ఎమోషన్స్ ని జోడిస్తూ ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించే విధంగా శేఖర్ కమ్ముల తీసి ఒక అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు… ఇక ఆ సినిమా స్ఫూర్తితోనే అప్పటినుంచి చాలా కాలేజీ లైఫ్ స్టోరీ తో సినిమాలు వచ్చాయి. అయినప్పటికీ వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే సక్సెస్ ను సాధించాయి. చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇక అదే తరహాలో ఇవాళ్ల రిలీజ్ అయిన మ్యాడ్ సినిమా పరిస్థితి ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…

    ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ అయినా కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్ లో ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేయాలి అనుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు అలా ఉన్న మనోజ్ (రామ్ నితిన్), అశోక్ (నార్నే నితిన్), దామోదర్ (సంగీత్ శోభన్) వీళ్ళ ముగ్గురు కాలేజీలో ఎదురవుతున్న ప్రతి సిచువేషన్ ని వాళ్ళకి అనుగుణంగా మార్చుకుంటూ కాలేజీ లైఫ్ ని పూర్తిగా ఎంజాయ్ చేస్తూ గడుపుతూ ఉంటారు. అలాంటి వీళ్ళ లైఫ్ లోకి వీళ్ళ క్లాస్మేట్స్ అయినా కొంతమంది అమ్మాయిలు రావడం వాళ్ళ ద్వారా వీళ్ళు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు.అసలు వాళ్లకు వీళ్ళకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే విషయాలని ఈ సినిమాలో చాలా వరకు వినోదాన్ని పంచుతూ కామెడీగా చాలా బాగా చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్…

    ఇక ఈ సినిమా గురించి బ్రీఫ్ గా అనాలసిస్ చేసే ప్రయత్నం చేద్దాం…ఈ సినిమాలో నటించిన నటి నటులు అందరూ కూడా కొత్తవాళ్లు అయినప్పటికీ ప్రతి ఒక్కరూ చాలా బాగా నటిస్తూ నటులుగా వాళ్ళు ఇండస్ట్రీకి చాలా గ్రాండ్ ఎంట్రీని ఇచ్చారనే చెప్పాలి . ఇక ఈ సినిమా డైరెక్టర్ అయిన కళ్యాణ్ శంకర్ ప్రతి సీన్ లో కూడా ఏదో ఒక పాయింట్ ని టచ్ చేస్తూ ప్రేక్షకుడి తాలుకు ఎమోషన్ ని బాగా హ్యాండిల్ చేస్తూ సినిమాని ముందుకు తీసుకెళ్లాడు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే ఎలా ఉంటారో కళ్ళకు కట్టినట్టుగా ఆయన మనకు చూపించడం లో ఆయన చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఇక ఆర్టిస్టులలో సంగీత్ శోభన్ గానీ, కమెడియన్ గా చేసిన విష్ణు గానీ ఇంక కొంత మంది ఆర్టిస్టులు కూడా చాలావరకు ఈ సినిమాని ఎక్కడ బోరింగ్ లేకుండా ముందుకు తీసుకెళ్లారు…

    అయితే ఈ సినిమాలో కొన్ని అడల్ట్ డైలాగులు కూడా ఉన్నాయి అవి మనకు ట్రైలర్ లోనే చూపించారు కాబట్టి ఈ సినిమా అడల్ట్ డైలాగులతో ఉండబోతుంది అన్నట్టుగా మనకు ముందే చెప్పేశారు. కాబట్టి సినిమా చూడబోయే ప్రేక్షకుడికి అది ముందుగానే అర్థం అయిపోయి సినిమా చూడడానికి రెడీ అవుతాడు.కాబట్టి ఆడియెన్స్ కి ముందు గానే సినిమా ఇలా ఉండబోతుంది అంటూ వాళ్ళని ప్రిపేర్ చేసి డైరెక్టర్ వాళ్ళని థియేటర్ లో కూర్చో బెడతాడు… ఇక ఇలాంటి టైంలో సినిమా చూడటానికి వచ్చిన నార్మల్ ఆడియన్స్ ని ఈ సినిమా ఎంతవరకు ఎంగేజ్ చేసింది అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది.

    అయితే డైరెక్టర్ సినిమా మీద తీసుకున్న స్పెషల్ కేర్ ఏంటంటే యూత్ ని టార్గెట్ చేస్తూ డైలాగులు రాశారు,కానీ ఈ సినిమా స్టూడెంట్స్ అనే కాకుండా అన్ని ఏజ్ గ్రూపుల వారికి కూడా బాగా నచ్చుతుంది అనే చెప్పాలి…ముఖ్యంగా స్టూడెంట్స్ అయితే ఇంకా బాగా కనెక్ట్ అయిపోతారు.ఇక డైరెక్టర్ స్టూడెంట్స్ బ్యాచ్ ని చూపించిన విధానం కూడా బాగుంది. ఇక ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేసిన రామ్ నితిన్, నార్నే నితిన్ ఇద్దరు కూడా యాక్టింగ్ పరంగా చాలా మంచి పర్ఫామెన్స్ ఇచ్చారనే చెప్పాలి.ఇద్దరికీ ఇది డెబ్యూ సినిమా అయినప్పటికీ ఎక్కడ తడపడకుండా వాళ్ల స్థాయి యాక్టింగ్ ని చూపిస్తూ ఆకట్టుకున్నారు. సరిగ్గా స్టూడెంట్స్ అంటే ఇలాగే ఉంటారు అని అందరూ అనుకునేలా ఆ క్యారెక్టర్లలోకి పరకాయ ప్రవేశం చేసి నటించినట్టుగా తెలుస్తుంది… ఇక ఈ సినిమాలో స్టూడెంట్స్ గొప్పతనం గురించి చెప్పే ఒక సీన్ లో గానీ,అలాగే హీరోయిన్ కి హీరో ప్రపోజ్ చేసే ఒక సీన్ లో గానీ ప్రతి ఒక్కరు కూడా బాగా కనెక్ట్ అయిపోయి విజిల్స్, క్లాప్స్ కొడుతు ఉంటారు…

    ఇక ఈ సినిమా లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ అనే చెప్పాలి. ఈయన తీసిన సీన్ ఎంతవరకు ఉండాలి దాన్ని ప్రేక్షకులకు ఎలా కన్వర్ట్ చేయాలి అనే విషయం లో ఆయన చాలా క్లారిటీగా ఉన్నారు. ఇక తర్వాత చెప్పుకోవాలంటే భీమ్స్ మ్యూజిక్ అనే చెప్పాలి.సాంగ్స్ పరంగా పెద్దగా ఆకట్టుకోకపోయినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు. అలాగే సినిమాటోగ్రఫీ కూడా ఎక్కడా తగ్గకుండా చాలా అద్భుతంగా ఉంది ప్రతి షాట్ ని కెమెరా లో చూపించిన విధానం అద్భుతమనే చెప్పాలి.
    ఇక ఈ సినిమాకి దినేష్ కృష్ణన్ , శ్యామ్ దత్ అనే ఇద్దరు సినిమాటోగ్రాఫర్లు పనిచేశారు…

    ఇక ఎడిటర్ నవీన్ నూలి కూడా తన వర్క్ ని చాలా అద్భుతంగా చేసి సినిమాకి ఒక బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడంలో తన వంతు ప్రయత్నం తాను చేశాడు…అలాగే ఈ సినిమా కి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అద్బుతం గా ఉన్నాయి…ఇక ఈ సినిమా లో మైనస్ పాయింట్స్ అంటే స్టోరీ రొటీన్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లాగానే ఉంది…

    ఫైనల్ గా చెప్పాలంటే యూత్ సినిమాల్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు, అలాగే అడల్ట్ డైలాగ్స్ ని కూడా స్వీకరించేవాళ్లు ఉంటే ఈ సినిమాని ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు…

    ఇక ఈ సినిమాకు మేము ఇచ్చే రేటింగ్ 2.5