https://oktelugu.com/

Karnataka Elections: కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది: భట్కల్ చౌక్ లో పాక్ జెండా ఎగిరింది

చివరికి ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తనకు రాజకీయంగా వాడుకుంది. ఇదే సమయంలో అల్లర్లను భారతీయ జనతా పార్టీ నియంత్రించే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది..

Written By:
  • Rocky
  • , Updated On : May 14, 2023 / 11:27 AM IST
    Follow us on

    Karnataka Elections: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. గత రికార్డులు తిరగరాస్తు ఊహించని సీట్లు గెలుపొందింది. రేపో మాపో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. సిద్ధరామయ్య లేదా శివకుమార్ ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావచ్చు.. ఇది ఇప్పటివరకు సాగిన చర్చ. నిన్న కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగానే సోషల్ మీడియా హోరెత్తిపోయింది.. ఇన్నాళ్లు నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. విజయం ఎప్పుడైనా ఒక భరోసా ఇస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రెండు ఎంపీ స్థానాలతో మొదలుపెట్టి ఈరోజు రెండవసారి దేశాన్ని పాలిస్తున్న బిజెపి కావచ్చు. కానీ ఇక్కడ గర్వం తలకు ఎక్కితేనే అసలు ప్రమాదం.. నిన్న కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఉత్తర కన్నడ జిల్లా తీర ప్రాంత పట్టణం భట్కల్ చౌక్ ప్రాంతంలో పాకిస్తాన్ జెండా ఎగిరింది.. వాస్తవానికి అక్కడ గెలిచింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైద్య. వైద్య గెలిచాడు కాబట్టి అక్కడ ఎగరాల్సింది కాంగ్రెస్ జెండా. యాదృచ్ఛికంగా కాంగ్రెస్ జెండాకు బదులు పాకిస్తాన్ జెండా ఎగిరింది. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదం కూడా హోరెత్తింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో కాంగ్రెస్ నేతలపై నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ” కాంగ్రెస్ పార్టీ జెండాకు బదులు పాకిస్తాన్ జెండాను ఎగరవేసేందుకైనా మీకు అధికారం ఇచ్చింది”  అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. వచ్చే ఐదు సంవత్సరాలలో కర్ణాటక రాష్ట్రంలో కేరళ ఫైల్స్ వరుస వెంట జరుగుతాయని జోస్యం చెబుతున్నారు.

    ఉద్దేశం ఏమిటి
    పాకిస్తాన్ జెండా ఎగరవేసింది అల్లరి మూకలు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టి పారేయవచ్చు గాక.. కానీ దానిని అంత సులభంగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన వెంటనే కోస్తా కన్నడ జిల్లాలో ఇలాంటి ఘటనలు వెలుగు చూడడం ఒకింత ఆందోళన కలిగించే పరిణామం. వాస్తవానికి హిజాబ్ గొడవలు కర్ణాటక రాష్ట్రంలో జరిగినప్పుడు పాకిస్తాన్ అనుకూల నినాదాలు తెరపైకి వచ్చాయి.. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇంటలిజెన్స్ వర్గాలు కూపి లాగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మూలాలు బయటపడ్డాయి. అలా ఇప్పటికీ ఆ కేసును కేంద్రం తవ్వుతూనే ఉంది.. అయితే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవగానే మళ్లీ అరాచక శక్తులు  వేళ్ళూనుకుంటున్నట్టు ప్రస్తుత సంకేతాలు కనిపిస్తున్నాయి.
    విజయానికి వారే కారణమా?
    ఇక ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిచేందుకు మైనార్టీ వర్గం ఓట్లు కీలకపాత్ర పోషించాయని తెలుస్తోంది. ముఖ్యంగా హలాల్, హిజాబ్, రిజర్వేషన్ల రద్దు వంటివి తీవ్ర ప్రభావం చూపాయి.. ఈ గొడవలు జరుగుతున్నప్పుడు ఉగ్రవాద సంస్థలు భారతదేశానికి వ్యతిరేకంగా హెచ్చరికలు చేయడం విశేషం. వారి దేశంలో కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా ఉండదు, కానీ భారత్ వైపు వేళ్ళు ఎత్తి చూపించడం మొదలుపెట్టాయి.. అయితే ఈ గొడవల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు చలిమంటలు కాచుకున్నారు. అంతేకాదు ఆ వర్గాలు తమవైపు ఉండేలాగా ఎన్నికల మేనిఫెస్టోలో తాయిళాలు ప్రకటించారు. గంపగుత్తగా ఓట్లు తమకు పడేలా చూసుకున్నారు..
    కేరళ స్టోరీ తప్పదా
    కర్ణాటక రాష్ట్రంలో కోస్తా ప్రాంతంలో ముస్లింల ప్రాబల్యం ఎక్కువ. గతంలో హిజాబ్ గొడవలు జరిగినప్పుడు ఈ ప్రాంతంలో కూడా అల్లర్లు చెలరేగాయి. బజరంగ్ దళ్ కార్యకర్తను హత్య చేశారు. ఆయనప్పటికీ దేశంలోని ఒక సెక్షన్ మీడియా వారికి వంత పడింది. చివరికి ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తనకు రాజకీయంగా వాడుకుంది. ఇదే సమయంలో అల్లర్లను భారతీయ జనతా పార్టీ నియంత్రించే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ జెండాకు బదులు పాకిస్తాన్ జెండా ఎగరడంతో వచ్చే ఐదు సంవత్సరాలు కర్ణాటక రాష్ట్రంలో కేరళ స్టోరీ లాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.