Homeఅంతర్జాతీయంFacebook: ఫేస్ బుక్ నుంచి 11వేల మంది అవుట్.. ఇన్ స్టంట్ ఆర్టికల్ కట్.. రోడ్డునపడ్డ...

Facebook: ఫేస్ బుక్ నుంచి 11వేల మంది అవుట్.. ఇన్ స్టంట్ ఆర్టికల్ కట్.. రోడ్డునపడ్డ వేల మంది

Facebook: ఫేస్ బుక్.. ప్రపంచ ప్రఖ్యాత సోషల్ మీడియా దిగ్గజానికి కూడా నష్టాలు తప్పలేదు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 11 వేల మందిని ఇంటికి పంపారు. అంతేకాదు.. ఫేస్ బుక్ లో తమ క్రియేటివిటీని జోడించి ఆర్టికల్స్ రాస్తున్న వేలమందిని కూడా మెటా సీఈవో జుకర్ బర్గ్ రోడ్డున పడేశారు. ఫేస్ బుక్ ఇన్ స్టంట్ ఆర్టికల్ ద్వారా నెల నెల 2 లక్షల వరకూ సంపాదించే వారు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం, ప్రపంచమంతా ఉన్నారు. వారి వైరల్ కంటెంట్ ను ప్రమోషన్ చేసుకొని ఈ మొత్తం సంపాదించేవారు. ఇప్పుడు ఇన్ స్టంట్ ఆర్టికల్ ను కూడా ఫేస్ బుక్ నష్టాలతో రద్దు చేయడంతో వేల మంది క్రియేటర్లకు ఉపాధి కరువైంది. అటు ఉద్యోగులు.. ఇటు కంటెంట్ క్రియేటర్లు అంతా రోడ్డున పడ్డ పరిస్థితి నెలకొంది.

Facebook
Mark Zuckerberg

ప్రపంచం మాంద్యం ముంగిట నిలిచింది. దీనికి తోడు యూరో మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, ఉక్రెయిన్, రష్యా యుద్ధం.. తదితర కారణాల వల్ల ప్రపంచంలో పరిస్థితులు అనూహ్యంగా మారిపోతున్నాయి. దీనికి పెద్ద పెద్ద కంపెనీలు కూడా మినహాయింపు కాదు. ఇప్పుడు ఆ జాబితాలోనే ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా చేరింది. ప్రకటనల ఆదాయం పడిపోవడం, ఆర్థిక మాంద్యం తాలూకు భయాల వల్ల 11 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. 2004 లో ఫేస్బుక్ ప్రారంభమైన తర్వాత ఈ స్థాయిలో ఉద్యోగులకు ఉద్వాసన పలకడం బహుశా కంపెనీ చరిత్రలో ఇదే మొదటిసారి.

-క్షమాపణలు చెప్పిన జూకర్ బర్గ్

2004లో ఫేస్ బుక్ ను మార్క్ జుకర్ బర్గ్ ప్రారంభించారు. అప్పటినుంచి ఇప్పటిదాకా వెను తిరిగి చూసుకోలేదు. ఈ సంస్థలో ప్రపంచ వ్యాప్తంగా 87 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పైగా జూకర్ బర్గ్ ఈ సంస్థ ద్వారా వచ్చిన ఆదాయాన్ని సుమారు 90% వరకు వితరణ కార్యక్రమాలకు అందజేస్తానని అప్పట్లోనే మాట ఇచ్చాడు. దానిని నిలబెట్టుకున్నాడు కూడా. అయితే ఫేస్బుక్ ప్రారంభం నాటి నుంచి డిజిటల్ రూపంలో ప్రకటనలు ఎక్కువగా వచ్చేవి. ఫలితంగా సోషల్ మీడియా ప్లాట్ఫారం లో ఫేస్బుక్ తిరుగులేని రారాజుగా వెలుగొందింది. మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ ను వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. దీనికి తోడు ఇంస్టాగ్రామ్ ను కూడా కొనుగోలు చేసి మార్కెట్లో ఆధిపత్యం చెలాయించడం మొదలుపెట్టింది. ఇక అప్పట్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు ఫేస్బుక్ తాను విధించుకున్న నిబంధనలకు విరుద్ధంగా పని చేసిందనే ఆరోపణలు వచ్చాయి.. కొన్ని దేశాల చట్టాలను అతిక్రమించిన నేపథ్యంలో జరిమానాలు చెల్లించింది..

-11 వేల మందికి ఉద్వాసన

ముందుగానే చెప్పినట్టు ప్రపంచం ఆర్థిక మాంద్యం ముంగిట నిలవడంతో ఖర్చులు తగ్గించుకునేందుకు మార్క్ జూకర్ బర్గ్ మరో మాటకు తావు లేకుండా 11 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్టు తన బ్లాగులో రాసుకొచ్చారు. ఇది మెటా కంపెనీకి సంబంధించి అత్యంత కఠినమైన రోజుగా అభివర్ణించారు. ఉద్యోగులను తొలగించడం తనకు ఇబ్బంది కలిగించినా తప్పడం లేదని ఆయన వివరించారు. ప్రస్తుతం కంపెనీలో 87 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో సుమారు 11% వరకు ఉద్యోగులను తొలగించారు. వచ్చే ఏడాది ఆర్థిక త్రైమాసికం నాటికి కొత్త ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదని ఆయన తేల్చి చెప్పేశారు. ఇప్పటివరకు ప్రపంచ మార్కెట్లు బాగుంటే నియామకాలకు పచ్చ జెండా ఊపుతామని ఆయన స్పష్టం చేశారు.

ఇన్ స్టంట్ ఆర్టికల్ ఎత్తేసి కంటెంట్ క్రియేటర్లను రోడ్డుపడేశారు
ఫేస్ బుక్ ద్వారా ఇన్నాళ్లు కంటెంట్ క్రియేటర్లు నెలకు రూ.2 లక్షల వరకూ సంపాదించేవారు. ఈ మొత్తం అంతకంటే ఎక్కువే ఉండేది. మంచి మంచి స్టోరీలు రాస్తూ వెబ్ సైట్ లో పెట్టుకొని వాటిని ఫేస్ బుక్ లో షేర్ చేసేవారు. బూస్ట్ పేరిట ఫేస్ బుక్ కు డబ్బులు కట్టి మరీ ప్రమోట్ చేసుకునేవారు. వాటికి వచ్చిన వ్యూయర్ షిప్ ను బట్టి డాలర్ల వర్షం కురిసేది. మంచి మంచి కంటెంట్ కు యాడ్స్ ద్వారా వచ్చిన ఆదాయంలోంచి ఫేస్ బుక్ కూడా భారీగా డాలర్లు చెల్లించేది. ఇండియాలో మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది దీన్నొక బిజినెస్ గా చేసుకొని ‘ఫ్యాన్స్, కామెడీ’ పేరిట వివిధ గ్రూపులు క్రియేట్ చేసుకొని వాటిల్లో లక్షల మందిని సభ్యులుగా చేర్చుకొని తమ కంటెంట్ ను అందులో వేసుకొని వ్యూయర్ షిప్ సంపాదించేవారు. ఒక్కొక్కరూ నెల నెలా లక్షలు సంపాదించారు. దీన్నే ‘ఇన్ స్టంట్ ఆర్టికల్’ మనీ అంటారు. ఇప్పుడు నష్టాల పేరుతో మెటా సీఈవో జుకర్ బర్గ్ ఫేస్ బుక్ లోని ‘ఇన్ స్టంట్’ ఆర్టికల్ ఎత్తేశాడు. దీంతో లక్షలమంది కంటెంట్ క్రియేటర్లు రోడ్డునపడ్డారు. ఇప్పుడు ఫేస్ బుక్ లో ఏది పోస్ట్ చేసినా డబ్బులు ఊరికే రావు. దీంతో అటు వినియోగదారులకు నష్టం. ఇటు కంటెంట్ క్రియేటర్లు రోడ్డున పడడం ఖాయం. ఈ నిర్ణయం లక్షలమందిని ప్రభావం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Facebook
Facebook

ఇక జూకర్ బర్గ్ దారిలోనే టెస్లా అధినేత ఎలన్ మస్క్ ముందుగానే సర్దుకున్నారు. ఆయన ఇటీవల ట్విట్టర్ ను కొనుగోలు చేశారు. ఇప్పటికే ఆ సంస్థలో పనిచేస్తున్న సీఈఓ పరాగ్ అగర్వాల్, గద్దె విజయను ఇంటికి సాగనంపారు. వీరికి పరిహారంగా వంద మిలియన్ డాలర్లు ఇచ్చారు. అయితే ట్విట్టర్ కొనుగోలుకు తన మాతృ కంపెనీ అయిన టెస్లా నుంచి భారీగా నిధులను ట్విట్టర్లోకి మళ్ళించారు. అయితే ఇదే ఆయననే ఇప్పుడు ఇబ్బంది పెడుతోంది. టెస్లా షేర్ ధర తగ్గడంతో ఆయన ఆస్తులు కరిగిపోతున్నాయి.. సమయంలో ట్విట్టర్ నుంచి చాలామంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు.

ట్విట్టర్, ఫేస్ బుక్ నిర్ణయాలతో మున్ముందు రోజుల్లో ఎలాంటి పరిస్థితులు దాపురిస్తాయోనన్న భయాలు టెక్ ప్రపంచంలో నెలకొన్నాయి. ఈ పరిణామాలపై ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular