Mangalavaram Teaser Review: పాయల్ రాజ్ పుత్ బ్రేక్ కోసం ట్రై చేస్తుంది. తనకు భారీ హిట్ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతితో మరోసారి చేయి కలిపింది. వీరి కాంబినేషన్ లో మంగళవారం టైటిల్ తో మూవీ తెరకెక్కుతుంది. మంగళవారం ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆసక్తి రేపాయి. టాప్ లేని పాయల్ రాజ్ పుత్ రా అండ్ రస్టిక్ లుక్ భిన్నంగా ఉంది. అసలు ఈ మంగళవారం టైటిల్ వెనుక ఆంతర్యం ఏమిటనే ఉత్కంఠ రేపింది. పాయల్ రాజ్ పుత్ మరోసారి బోల్డ్ రోల్ చేస్తున్నారనేది సుస్పష్టం కాగా, హైప్ నెలకొంది.
నేడు మంగళవారం టీజర్ విడుదల చేశారు. నిమిషానికి పైగా నిడివి కలిగిన టీజర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఒక మారుమూల పల్లెలో సంభవించే వింత అనుభవాలు, భయానక పరిస్థితులను టీజర్లో చూపించారు. ఊరి చివర చెరువు, చెరువు పక్కన పాత పెంకుటిల్లు. రాత్రయ్యాక ఊహించని సంఘటనలు. వీటి వెనుక ఉంది ఎవరు? మనిషా? భూతమా? ప్రజల్ని భయపెడుతుంది ఎవరు? అన్నట్లు టీజర్ కట్ చేశారు.
క్యారెక్టర్స్ చాలా మాస్ గా ఉన్నాయి. ఇక పాయల్ రాజ్ పుత్ క్యారెక్టర్ ఏమిటనేది అర్థం కావడం లేదు. ఆమెకు బెడ్ రూమ్ సన్నివేశాలు ఉన్నాయి. ఆమెలో తెలియని భయం. అసలు పాయల్ భయపెడుతుందా? భయపెడుతుందా? అనేది మరో కోణం. మొత్తంగా అజయ్ భూపతి తన మార్క్ చూపించాడు. మంగళవారం మూవీ కొత్త అనుభూతిని పంచుతుందనే నమ్మకం కలిగించారు.
ముద్ర మీడియా వర్క్స్, ఏ క్రియేటివ్ వర్క్స్ కలిసి నిర్మిస్తున్నాయి. అజినీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందించారు. నందిత శ్వేత, అజయ్ ఘోష్ కీలక రోల్స్ చేశారు. 2018లో వీరి కాంబోలో తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 భారీ హిట్. ఆ చిత్రం తర్వాత పాయల్ కి ఆ రేంజ్ హిట్ పడలేదు. అజయ్ భూపతి సైతం మహాసముద్రం మూవీతో ప్లాప్ మూటగట్టుకున్నాడు. వీరిద్దరికీ ఈ చిత్ర విజయం చాలా అవసరం.