Manchi Rojulochaie Movie Review:
రేటింగ్ : 2.25
నటీనటులు: సంతోష్ శోభన్, మెహ్రీన్ పిర్జాదా, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు
దర్శకుడు: మారుతి
రచన : మారుతి
సంగీతం: అనూప్ రూబెన్స్
నిర్మాతలు: ఎస్ కె ఎన్,
కెమెరా : సాయి శ్రీరామ్

మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మెహ్రీన్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా “మంచి రోజులొచ్చాయి”. ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి చూద్దాం.
కథ :
సంతోష్ (సంతోష్ శోభన్), పద్మిని (మెహరీన్) ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే అది పద్మిని తండ్రి గోపాలం తిరుమలశెట్టి (అజయ్ ఘోష్) కి ఇష్టం ఉండదు. దానికి తోడు గోపాలం తిరుమలశెట్టి మహా భయస్తుడు. ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా ఊహించుకుని ఎప్పుడు భయపడుతూ ఉంటాడు. దీనికితోడు పక్కన ఉన్న వాళ్ళ మాటలకు కూడా గోపాలం ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటాడు. తన కూతురు సంతోష్ ను పెళ్లి చేసుకుంటే.. ఆమె జీవితం నాశనం అవుతుందని గోపాలం ఊహించుకుని లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటాడు. మొత్తానికి భయంతో గందరగోళంలోకి వెళ్లిన గోపాలంను సంతోష్ ఎలా మార్చాడు ? చివరకు గోపాలం కథ ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
ఈ సినిమాకి రచయిత అయిన మారుతి ఎమోషనల్ స్టోరీ లైన్ రాసుకున్నాడు. ఇక హీరో హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ కూడా బాగున్నాయి. అయితే ఫాదర్ ఎమోషనల్ కథ చాలా బాగా ఆకట్టుకుంది. ఇక హీరోగా సంతోష్ శోభన్ ఈ కథకు మంచి ఛాయిస్ అనిపించుకున్నాడు. సెకెండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాల్లో అతని నటన చాలా బాగా ఆకట్టుకుంటుంది.
హీరోయిన్ మెహ్రీన్ కూడా బాగానే అలరించింది. ముఖ్యంగా హీరోతో మంచి రొమాంటిక్ సీన్స్ తో రెచ్చగొట్టింది. హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసిన వారు సైతం కథకు తగ్గట్టుగా సరిగ్గా సరిపోయారు. మారుతి మంచి కథాంశాన్ని ఎంచుకున్నా సెకండాఫ్ పై ఇంకా శ్రద్ధ పెట్టి ఉండి ఉండాల్సింది. సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు, కానీ సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకు ప్లస్ అయ్యేది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
మారుతి రైటింగ్,
నటీనటులు నటన,
రొమాంటిక్ సీన్స్
మైనస్ పాయింట్స్ :
లాజిక్ లేని సీన్స్,
బోరింగ్ ప్లే,
కథాకథనాలు ఆసక్తికరంగా సాగకపోవడం,
స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ బాగాలేకపోవడం,
Also Read: RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్ కు తప్పని లీకుల బెడద… నెట్టింట వైరల్
తీర్పు :
భిన్నమైన కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా కొంతవరకు ఆకట్టుకుంది. అయితే, నాసిరకమైన సీన్స్, బోరింగ్ ప్లే విసిగిస్తాయి. కానీ, కామెడీ సినిమాలు ఇష్టపడే వారికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.
Also Read: Khiladi Movie: మాస్ మహారాజ్ “ఖిలాడి” నుంచి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన మూవీ టీమ్…