Mahesh Vs Vijay: తమిళంలో అగ్ర హీరో విజయ్. అతడికున్న అశేష అభిమానం అంతా ఇంతా కాదు.. ఇళయ దళపతి అని ముద్దుగా పిలుస్తుంటారు. ఇక తెలుగులో మన మహేష్ బాబుకు అంతకు మించిన అభిమానులున్నారు. మహేష్ అంటే ప్రాణమిస్తారు. అయితే ఇద్దరు హీరోలకు ఒకపోలిక ఉంది.

ఈ ఇద్దరు ఒకే స్కూల్లో చదివారు ఎదిగారు. కృష్ణ నాడు మద్రాసులో సినిమాలు చేసే సమయంలో విజయ్, మహేష్ బాబు క్లాస్ మేట్స్. ఇక మహేష్ బాబు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన పోకిరీ, అతడు సహా ఎన్ని చిత్రాలను తమిళంలో ‘విజయ్’ చేసి స్టార్ హీరోగా ఎదిగాడు. మహేష్ సినిమాలతోనే విజయ్ అక్కడ స్టార్ డం సంపాదించారు.
అయితే మహేష్ బాబు సినిమాలు తెలుగులో అంతగా ఈ మధ్యకాలంలో ఆడడం లేదు. కానీ విజయ్ సినిమాలు ఒకటి రెండు బ్లాక్ బస్టర్ అయ్యాయి. మహేష్-మురగదాస్ తీసిన ‘స్పైడర్’ మూవీ తమిళంలోనూ విడుదలై అక్కడ ఫ్లాప్ అయ్యింది. అప్పటి నుంచి మహేష్ నటనపై తమిళ స్టాండప్ కమెడియన్లు ఓ వర్గం విమర్శలు చేస్తూనే ఉంది.
తాజాగా విజయ్ తమిళంలో నటిస్తున్న ఓ చిత్రంలో మహేష్ బాబు ఒక అతిథి పాత్ర పోషిస్తున్నాడని.. ఈమేరకు సంప్రదింపులు జరుపుతున్నట్టు ఓ వార్త వైరల్ అయ్యింది. అయితే దీనిపై మహేష్ బాబు పీఆర్వోలు ఖండించారు. విజయ్ సినిమాలో మహేష్ బాబు నటించడం లేదని స్పష్టం చేశారు.
దీంతో హర్ట్ అయిన విజయ్ అభిమానులు ట్విట్టర్ లో మహేష్ బాబుపై తమ ప్రతీకారం షురూ చేశారు. మహేష్ బాబుకు నటన రాదని.. అస్సలు నటించడం చేతకాదని.. ఒక గే అంటూ ‘#BoycottGayMaheshbabu’ అని అవమానించేలా ట్వీట్లు హోరెత్తిస్తున్నారు. మా స్టార్ హీరో విజయ్ సినిమాలో నటించను అంటాడా? అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మహేష్ ను ట్యాగ్ చేస్తూ ఈ ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి.
అయితే విజయ్ కంటే కూడా బలంగా ట్విట్టర్ లో ఉన్న మహేష్ బాబు ఫ్యాన్స్ ఊరుకుంటారా? దీనికి పోటీగా.. విజయ్ ను ఏకిపారేస్తూ.. ‘మా మహేష్ సినిమాలను తీసి హిట్ కొట్టిన విజయ్ రిమేక్ స్టార్ అంటూ.. దేశవ్యాప్తంగా ట్రోల్ మెటీరియల్ విజయ్ అని.. మహేష్ చేతిలో దెబ్బలు తింటున్న విజయ్ ఫొటోలు, వీడియోలు రూపొందించి ట్రోల్స్ చేస్తున్నారు. ట్విట్టర్ లో ‘#NationalTrollMaterialVijay’, #BoycottLesbianVijay అంటూ విజయ్ ను ట్యాగ్ చేస్తూ ఎండగడుతున్నారు.
https://twitter.com/Im__Kash/status/1566746076014489600?s=20&t=EjltIuOCg3xbvMNoztHwIg
ఇలా ఇద్దరు హీరోలు అనోన్యంగానే ఉంటూ సామరస్యంగా తమ పనులు, సినిమాలు చేసుకుంటుంటే వారి అభిమానులు మాత్రం లేని వార్తలు సృష్టించి హీరోల మధ్య ఆగాథం పెరిగేలా అనవసర ట్రోలింగ్ తో హీరోల పరువు తీస్తున్నారు. ఈ వివాదంపై అటు మహేష్ బాబు కానీ.. ఇటు విజయ్ కానీ స్పందించడం లేదు.
#MyDearThalapathyVijay#BoycottGayMaheshbabu#BoycottLesbianVijay#NationalTrollMaterialVijay
MAHESH LIKE VIJAY RT pic.twitter.com/9wsbzTasA8— 1959 (@TheOfficial1959) September 5, 2022