https://oktelugu.com/

Maharashtra – NIA : 15 మంది ఐసిస్ ఉగ్రవాదుల అరెస్టుతో బయటపడ్డ కుట్ర

ఢిల్లీ పోలీసులు నవంబర్ 6వ తేదీన ఎన్ఐఏ తీసుకొని దర్యాప్తు చేసింది. తాజాగా 15 మందిని అరెస్ట్ చేసింది.. 15 మంది ఐసిస్ ఉగ్రవాదుల అరెస్టుతో బయటపడ్డ కుట్రపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : December 12, 2023 7:15 pm
    Follow us on

    Maharashtra – NIA : 15 మంది ఐసిస్ ఉగ్రవాదులు ఎన్ఐఏ దాడుల్లో పట్టుబడ్డారు. 44 లోకేషన్లలో సోదాలు జరిపారు. ఐసిస్ అంటేనే ప్రమాదకర ఉగ్రవాదులు. ప్రపంచమంతా ఈ ఉగ్రవాద సంస్థ కోసం భయపడుతోంది.

    ఉత్తరప్రదేశ్ సహా కేరళలో కొంతమంది బయటపడ్డారు. ఆల్ షామ్ అని ప్రకటించుకొని ముంబై సరిహద్దుల్లో బోరివిల్లి దగ్గర థానే జిల్లాలో ‘పాగ్రా’ అనే గ్రామాన్ని ఇస్లాం ఐసిస్ ఆల్ షామ్ గ్రామంగా ప్రకటించుకున్నారు. మహారాష్ట్ర ఐసిస్ మహ్మాద్ సాకిత్ నాచానీ (63).. ఇతను కొత్తగా వచ్చిన వ్యక్తి కాదు.. 2002లో ముంబై సెంట్రల్ లో బాంబు పేలుళ్లు, 2003 విలేపార్లీ ములుంగు బాంబు ట్రైన్ పేలుళ్లకు సూత్రధారి ఈ నాచానీ.. అది తెలిసిన దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేయడానికి ఈ పాగ్రా గ్రామానికి వెళితే రాళ్లు వేసి తరిమికొట్టారు. ఇదే గ్రామం ఒకనాడు ‘సిమి’ ఉగ్రవాద సంస్థకు అత్యంత స్ట్రాంగ్ జోన్ గా ఉండేది.

    థానే జిల్లాలో ఇదంతా జరుగుతోంది. ఇటువంటి వ్యక్తి ఎలా తిరిగి వచ్చాడన్నది చూస్తే.. నాచానీకి ఇల్లీగల్ ఆయుధాలు కలిగి ఉన్నాడని మాత్రమే 10 ఏళ్లు జైల్లో వేశారు. ఉగ్రవాద కార్యకలాపాల చేసినందుకు ఆధారాలు లేక విడిచిపెట్టారు.

    ఈ సంవత్సరం ఆగస్టులో నాచానీ అబ్బాయి షామీమ్ పట్టుబడ్డాడు. ఐఈడీ తయారీ, శిక్షణ కోసం మిగతా వారికి ట్రైనింగ్ ఇస్తున్నాడని తెలిసి ఢిల్లీ పోలీసులు కనుగొని అరెస్ట్ చేశారు.

    ఢిల్లీ పోలీసులు నవంబర్ 6వ తేదీన ఎన్ఐఏ తీసుకొని దర్యాప్తు చేసింది. తాజాగా 15 మందిని అరెస్ట్ చేసింది.. 15 మంది ఐసిస్ ఉగ్రవాదుల అరెస్టుతో బయటపడ్డ కుట్రపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

    15 మంది ఐసిస్ ఉగ్రవాదుల అరెస్టుతో బయటపడ్డ కుట్ర || Maharashtra || NIA || Ram Talk