Homeఎంటర్టైన్మెంట్Bollywood Downfall: లాల్‌ సింగ్‌ చడ్డా, రక్షా బంధన్ ప్లాప్? ఆవిరైన బాలీవుడ్ ఆశలు.. అసలు...

Bollywood Downfall: లాల్‌ సింగ్‌ చడ్డా, రక్షా బంధన్ ప్లాప్? ఆవిరైన బాలీవుడ్ ఆశలు.. అసలు లోపం ఎక్కడ?

Bollywood downfall : బాలీవుడ్‌.. దేశంలో అత్యంత ఖరీదైన ఇండస్ట్రీ. ఒకప్పుడు సక్సెస్‌ రేటు ఉన్న సినీ ప్రపంచం ఇదీ.. రెండుమూడేళ్ల క్రితం వరకు బాలీవుడ్ కు ఎదురేలేదు. ప్రస్తుతం ఆ ఇండస్ట్రీ ప్లాప్‌ షోలతో చతికిలబడుతోంది. సక్సెస్‌ కోసం ఎదురు చూసి చూసీ నిర్మాతలు, హీరోల ముఖం వాచిపోతోంది. కానీ ప్రేక్షకులు మాత్రం హిందీ సినిమాలను ఆదరించడం లేదు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు బాలీవుడ్‌ ఇండస్ట్రీ ప్లాప్‌ షోకు అనేక కరణాలు ఉన్నాయంటున్నారు సినీ విమర్శకులు.

Bollywood Downfall
laal singh chaddha raksha bandhan

-బాలీవుడ్‌ మార్కెట్‌లో సౌత్‌ ఇండియా సినిమాల హవా..
బాలీవుడ్‌ సినిమాలు ప్లాప్‌ అవుతున్న వేళ.. హిందీ సినిమా ట్రెడిషనల్‌ మార్కెట్ లో సౌత్ ఇండియా సినిమాలు సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమాలు హిందీ ప్రేక్షకుల ఆదరణ చూరగొంటున్నాయి. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప సినిమాలే ఇందుకు ఉదాహరణ. ఒకానొక దశలో దేశ సినీ ఇండస్ట్రీని బాలీవుడ్ శాసించేది. దీంతో సౌత్‌ ఇండియా నటులు, హీరోలు బాలీవుడ్‌లో ఎంట్రీ కోసం ప్రయత్నించేవారు. కొంతమంది ఎంట్రీ ఇచ్చినా.. పెద్దగా సక్సెస్‌ కాలేదు. తెలుగు మెగాస్టార్‌ చిరంజీవికి కూడా ఈ పరిస్థితి తప్పలేదు. ఇక సౌత్‌ ఇండియా నిర్మాతలు బాలీవుడ్‌ హీరోయిన్స్‌ డేట్స్‌ కోసం ముంబయ్‌ చుట్టూ తిరిగేవారు. డేడ్స్‌ కోసం సినిమా షూటింగ్స్‌ వాయిదా వేసేవారు.

Also Read: Rajinikanth Governorship: రజనీకాంత్ కు గవర్నర్ గిరి… బీజేపీ స్కెచ్ వెనుక కథా అదా?

-బాలీవుడ్‌లో ఒకప్పుడు బ్రహ్మాండమైన సినిమాలు..
బాలీవుడ్‌లో ఒకప్పుడు మంచి సినిమాలు వచ్చాయి. హిదీ మార్కెట్‌తోపాటు సౌత్‌ ఇండియా మార్కెట్‌ను కూడా షేక్‌ చేశాయి. ఇందులో లగాన్, దంగల్‌ సినిమాలు అయితే ప్రపంచస్థాయి గుర్తింపు పొందాయి. లగాన్‌ అయితే ఆస్కార్‌కు కూడా నామినేట్‌ అయింది. ప్రధాని నరేంద్రమోదీని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కలిసినప్పుడు కూడా తాను లగాన్‌ చూసినట్లు చెప్పాడు చైనా అధ్యక్షుడు. దశాబ్దం క్రితం వరకు స్థాయిలో ఉన్న బాలీవుడ్‌ ఇప్పుడు సక్సెస్‌ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది.

-భారీ సినిమాలు అట్టర్‌ ప్లాప్‌..
ఇటీవల బాలీవుడ్‌లో రెండు భారీ బడ్జెట్‌ సినిమాలు విడుదలయ్యాయి. పెద్ద వీకెండ్‌ శనివారం, ఆదివారం, పంద్రాగస్టును దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాలను విడుదల చేశారు. ఇందులో ఒకటి అమీర్‌ఖాన్‌ నటించిన లాల్‌సింగ్‌ చద్దా, ఇంకోటి అక్షయ్‌కుమార్‌ నటించిన రక్షాబంధన్‌. లాల్‌సింగ్‌ చద్దాను రూ.200 కోట్లతో, రక్షాబంధన్‌ను రూ.130 కోట్లతో తీశారు. కానీ మార్కెట్‌ తీవ్ర నిరాశపరిచింది. సాధారణ రోజుల్లో వచ్చే ఆదాయం కన్నా 20 శాతం తక్కువ రావడం బాలీవుడ్‌ సినిమాల ప్లాప్‌షోను కొనసాగించాయి. భారీ బడ్జెట్‌ సినిమాలే అయినా.. స్టార్‌ హీరోలే నటించినా సక్సెస్‌ను అందుకోలేదు. సాధారణంగా సినిమాకు మొదటి ఐదు రోజుల్లోనే మంచి కలెక్షన్లు, మంచి టాక్‌ రావాలి. కానీ ఈ రెండు సినిమాలు ఈ రెండింటిలో విఫలమయ్యాయి. లాల్‌సింగ్‌ చద్దాకు 5 రోజుల్లో కేవలం రూ.40 కోట్లు, రక్షాబంధన్‌కు రూ.30 కోట్ల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. ఈ రెండు సినిమాల ప్లాప్‌తో బాలీవుడ్‌ సినిమాల అంచనాలు మరింత పడిపోయాయి.

-దుమ్మురేపుతున్న తెలుగు సినిమాలు..
భారత దేశం కథలకు పుట్టినిల్లు. మంచి కథలను ఎన్నుకొని ఆసక్తికరంగా తీస్తే సక్సెస్‌ వస్తుందని సినీ విమర్శకులు పేర్కొంటున్నారు. ఇందుకు తెలుగు సినిమాలను ఉదహరిస్తున్నారు. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప కథలు వాస్తవం కాదు. కల్పితాలే. అయినా ఈ కథలను తెరకెక్కించిన నిర్మాతలు సినిమా ఇండ్రస్టీలో భారీ సక్సెస్‌ సాధించాయి. ఇందుకు మంచి స్టోరీలైన్‌ను పట్టుకుని, తర్వాత నటులను ఎంపిక చేయడం కారణం. కానీ బాలీవుడ్‌లో అది జరుగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం స్టార్‌ పవర్‌పై ఆధారపడడం కారణంగా ప్లాప్‌షోలు ఎదుర్కొంటున్నాయన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా నిర్మాతలు వాస్తవాలను గుర్తించకపోతే.. ప్లాప్‌షో కంటిన్యూ కావడం తప్పదని హెచ్చరిస్తున్నారు.

Bollywood Downfall
laal singh chaddha raksha bandhan

-స్టార్‌ పవర్‌ కోసం పాకులాడడంతోనే..
సినిమా ఇండస్ట్రీ కూడా భారత ఎకానమీలో భాగమే. ఆర్థిక వేత్తలు అనేక అధ్యయనాల తర్వాత బాలీవుడ్‌ సినిమాల ఫెయిల్యూర్‌కు కొన్ని కారణాలు గుర్తించారు. ఇందులో ప్రధానం నిర్మాతలు స్టార్‌ పవర్‌ కోసం వెంపర్లాడడం ప్రధానమైంది. కేవలం స్టార్‌ హీరోలతో సినిమా తీస్తే సక్సెక్‌ ఎక్కువగా ఉంటుందని భావించడం. ఇందుకోసం సినిమా బడ్జెట్‌లో 50 శాతం హీరో, సినిమా టేకింగ్‌ కోసం ఖర్చు చేస్తున్నారు. 35 శాతం మార్కెటింగ్‌పై ఖర్చు చేస్తున్నారు. కేవలం 20 శాతం మాత్రమే మంచి కథ, దానిని ఆసక్తికరంగా ప్రజెంట్‌చేయడానికి వెచ్చిస్తున్నారు. ఈ విషయాలు బాలీవుడ్‌ సినిమాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నట్లు సినీ విమర్శకులు కూడా పేర్కొంటున్నారు.

Also Read:Sudheer Anasuya: ఈటీవీలోకి మళ్లీ సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, అనసూయ ఎంట్రీ! అసలేమైంది?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular