Saffron Decorations : కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం దేవాలయాల విషయంలో వివాదంలో చిక్కుకుంది. భద్రకాళి దేవాలయ ఉత్సవాల్లో కాషాయ రంగు వాడడంపై సీరియస్ అయ్యింది. శబరిమలై ఆలయం వివాదంలో సీపీఐపాత్ర అది విమర్శనాత్మకమైంది. ఎన్నికలకు ముందు దాన్ని సరిదిద్దుకొని ఇంకో రకంగా మాట్లాడారు.
ఆ వివాదం మరిచిపోకముందే వెల్లియన్ దేవి దేవాలయంలో (భద్రకాళి దేవాలయం) తిరువనంతపురం శివారులో దక్షిణాదిన ఉంటుంది. ప్రతీ మూడేళ్లకోసారి అక్కడ కాళికోత్సవం నిర్వహిస్తారు. 48 రోజుల పాటు ఈ ఉత్సవం చేస్తారు. విపరీతంగా జనం వస్తారు. దేవాలయాలంలో విశేషం ఏంటంటే పూజారి బ్రాహ్మణుడు కాదు.. విశ్వకర్మ లాంటి వృత్తి గల వ్యక్తి. ఓబీసీ కేటగిరి ఆయన పూజారిగా ఉంటారు.
సమస్య ఏంటంటే.. ఈసారి ఆరేళ్ల తర్వాత ఉత్సవాలు జరుగుతుంటే అందులో కాషాయ రంగు వాడడంపై కేరళప్రభుత్వం నిషేధించింది. పోలీసులు ప్లాస్టిక్ కట్టొద్దన్నారు. కాషాయ రంగువి ఉంచవద్దని హుకూం జారీ చేశారు. అన్ని రంగులు కలిపి కట్టాలని సూచించారు. ఇదే ఇప్పుడు వివాదమైంది.
భద్రకాళి దేవాలయ ఉత్సవాల్లో కాషాయ రంగుపై మొదలైన వివాదంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.
