Chandrababu Jr NTR : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు సీనియర్ ఎన్టీఆర్. ఆయనను వెన్నుపోటు పొడిచి మరీ పార్టీని లాక్కున్నారు చంద్రబాబు. అయితే ఈ విషయంలో నందమూరి కుటుంబం సపోర్టు చంద్రబాబుకు నాడు దక్కింది. కానీ కాలక్రమేణ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ కనుమరుగైంది. నందమూరి వాసన లేకుండా పోయింది. ఇప్పుడు మొత్తం ‘చంద్రబాబు’ మయం అయిపోయింది.

2009లో జూ.ఎన్టీఆర్ ను ప్రచారానికి వాడుకొని వదిలేశాడు చంద్రబాబు. నాడు ఏపీలో టీడీపీ కోసం అహర్నిశలు పాటు పడి ప్రచారం చేసి జూ.ఎన్టీఆర్ భంగపడ్డారు. తన తనయుడు లోకేష్ కోసం నందమూరి వంశానికి చెందిన జూ.ఎన్టీఆర్ ను చంద్రబాబు కావాలనే పక్కకు పెట్టాడని మోసం చేశాడని ఓ టాక్ నడిచింది.
కట్ చేస్తే 2009 తర్వాత జూ.ఎన్టీఆర్ అసలు తెలుగు దేశం పార్టీ రాజకీయాల్లో తలదూర్చలేదు. చంద్రబాబుతో సాన్నిహిత్యంగా మెలగకుండా దూరంగా ఉన్నారు. చంద్రబాబు కూడా తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం ఎన్టీఆర్ ను దూరంగా ఉంచారు.
అయితే ఈ మధ్యకాలంలో జగన్ ధాటికి ఓడిపోయి మళ్లీ ఏపీలో సీఎం కావడానికి అందరినీ చేరదీస్తున్నాడు చంద్రబాబు. ఇప్పటికే జూ.ఎన్టీఆర్ ను కలిసి కేంద్రహోంమంత్రి అమిత్ షా ఎలాగైనా సరే బీజేపీలోకి లాగాలని చూశారు. కానీ అది సాధ్యం కాలేదు. దీంతో అలెర్ట్ అయిన చంద్రబాబు స్వయంగా భేషజాలు అన్నీ మరిచి జూ.ఎన్టీఆర్ సాయం కోరినట్టు తెలిసింది.
ప్రస్తుతం జూ.ఎన్టీఆర్ అమెరికాలో ఉన్నారు. ఆయన ఆర్ఆర్ఆర్ చిత్రం తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో బెస్ట్ పాట ‘నాటునాటు’ విభాగంలో ఎంపికై సత్తా చాటింది. ఈక్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాకు అవార్డు రావడంపై చంద్రబాబు స్పందించారు. అవార్డు వచ్చినందుకు కీరవాణి, రాజమౌళితోపాటు చిత్ర యూనిట్ కు కంట్రాట్స్ చెప్పారు. ‘ఇది గర్వించాల్సిన విషయం’ అంటూ చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు.
అయితే చంద్రబాబు చేసిన ట్వీట్ లో ఎంఎం కీరవాణి, రాజమౌళిని, ఆర్ఆర్ఆర్ మూవీని మాత్రమే ట్యాగ్ చేశాడు. జూ.ఎన్టీఆర్ ను ట్యాగ్ చేయలేదు. అభినందించలేదు. అయినా కూడా ఎన్టీఆర్ బాబు ట్వీట్ కు స్పందించాడు. ‘థాంక్యూ సో మచ్ మావయ్యా’ అని సమాధానం ఇచ్చాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ అయ్యింది.
చూస్తుంటే చంద్రబాబు నందమూరి ఫ్యామిలీని అందరినీ దగ్గరకు తీశాడని.. ఎన్టీఆర్ ను కూడా తనవైపు తిప్పుకున్నాడని ట్వీట్ ను బట్టి అర్థమవుతోంది.
Thank you so much mavayya.
— Jr NTR (@tarak9999) January 11, 2023