Vizag Tension Pawan: ఒకేరోజు మూడు కార్యక్రమాలు..దానికి ప్రశాంత సాగరతీరం విశాఖపట్నమే వేదిక.. అందుకే మూడు పార్టీల నేతల ఎంట్రీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పవన్ కళ్యాణ్ జనవాణి, వైసీపీ మూడు రాజధానులపై సభ, వైసీపీ నిరంకుశంపై టీడీపీ సమావేశం.. ఈ మూడు ఒకేరోజు పెట్టుకోవడంతో విశాఖ అట్టుడుకిపోయింది.

ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఎంట్రీతో విశాఖ విమానాశ్రయం పులకించిపోయింది. ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలతో ఫుల్ ఆఫ్ జోష్ నిండింది. డప్పు చప్పుళ్లు, విద్యార్థుల నృత్యాలు, గిరిజనుల సంప్రదాయ నృత్యాలతో పవన్ కు ఘనంగా స్వాగతం పలికారు.
పవన్ కళ్యాణ్ కోసం విమానాశ్రయంలో అశేష అభిమానగణం వేచి ఉండి ఆయనకు స్వాగతం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ ‘విశాఖ రాజధాని’ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రులు రోజా, జోగిరమేశ్ లపై జనసేన నేతల దాడి కలకలం రేపింది. కార్యక్రమం అనంతరం రోజా, జోగిరమేశ్, వైవీ సుబ్బారెడ్డిలు తిరుగు పయనమయ్యారు. ఈ సందర్భంగా వారు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అదే సమయానికి పవన్ కళ్యాణ్ ఎయిర్ పోర్టుకు వస్తుండడంతో భారీగా జనం గుమిగూడారు.
ఎయిర్ పోర్టుకు వచ్చిన రోజా, జోగిరమేశ్, వైవీ సుబ్బారెడ్డి కార్లపై జనసైనికులు రాళ్లు , కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వారి కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు చెదరగొట్టి మంత్రులను ఎయిర్ పోర్టు లోపలికి పంపారు.
కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ ఇదే రోజా, జోగిరమేశ్ లు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ కించపరుస్తున్నారు. అందుకే వారికి కరెక్ట్ టైంలో దొరకడంతో జనసేన సెగలు బాగా తగలాయి. ఇప్పటికైనా వారి నోళ్లకు మూతలు పడుతాయా? జనసైనికుల ఈ సన్మానంతోనైనా వారు ఒళ్లు దగ్గరపెట్టుకొని పవన్ మాట్లాడుతారో..? ఇలానే నోరుపారేసుకుంటారో చూడాలి మరీ.. జనసైనికుల ఆగ్రహం. అభిమానం ఎలా ఉంటుందో వైసీపీ మంత్రులకు ఈరోజు తెలిసి వచ్చింది.