Karnataka Elections 2023 : కర్ణాటక ఎన్నికలు వైవిధ్యభరితం.. ఎవ్వరికీ అర్థం కాని విషయం ఏంటంటే.. 38 ఏళ్లుగా ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. 2013లో మాత్రమే వచ్చింది. అసలు ఓట్లకు, సీట్లకు పొంతనే ఉండడం లేదు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 38.14 శాతం ఓట్లు వస్తే 80 సీట్లు వచ్చాయి. బీజేపీకి 36.35 శాతం ఓట్లు వస్తే 104 సీట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ కు 2 శాతం ఓట్లు ఎక్కువ వచ్చినా బీజేపీకి 24 సీట్లు రావడం అన్నది ఆశ్చర్యం. ఇందుకే కర్నాటక రాష్ట్రం వైవిధ్యభరితం అన్నది చెప్పొచ్చు.
కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 50 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను తెలుగు ప్రజలు నిర్దేశించగలరు. అంటే ఆ ప్రాంతాలు మొత్తం ఒకప్పుడు నిజాం ఏలుబడిలో ఉండేవి.. ఇక నామినేషన్లకు గడువు పూర్తి కావడం, వచ్చే నెలలో ఎన్నికలు జరగనుండడంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. ఈసారి భారతీయ జనతా పార్టీ చాలామంది సీనియర్లకు టికెట్లు ఇవ్వలేదు. కొత్త ముఖాలకు టికెట్లు ఇచ్చింది. ఈ ప్రయోగం విజయవంతం అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో అమలు చేయాలని భావిస్తోంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అసంతృప్త నేతలను చేర్చుకుంటున్నది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు జగదీష్ శెట్టార్ ను చేర్చుకుని కమల నాధులకు షాక్ ఇచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే ఎన్నికల ముందు ఇది భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ. ఇక కుమారస్వామి పార్టీ కూడా జోరుగానే ప్రచారం సాగిస్తున్నది. ఈ నేపథ్యంలో ఎవరు విజయం సాధిస్తారు అనే విషయం మీద ఆసక్తి నెలకొంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లకు, సీట్లకు ఎందుకంత తేడా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.