IPL 2022 Full Schedule: క్రికెట్ కుంభమేళకు రంగం సిద్ధమైంది. దేశ క్రికెట్ పండుగ మరోసారి వస్తోంది. స్డేడియాలు దద్దరిల్లేలా ఐపీఎల్ ధనాధన్ మొదలుకాబోతోంది. అసలు సిసలు టీ20 మజాను ఆస్వాదించేందుకు దేశ క్రికెట్ అభిమానులంతా రెడీ అయిపోయారు. ఎన్నో ఉత్కంఠ రేపే మ్యాచ్ లు.. ఉద్వేగాలు నింపే సీన్లు మైదానంలో , టీవీలో కనిపించబోతున్నారు. సగటు అభిమానికి ఫుల్ మీల్స్ లాంటి విందు అందించడానికి ఐపీఎల్ సిద్ధమైంది.

కరోనా కల్లోలంతో ఇంట్లోనే ఉండి మొహం వాచిన ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నారు. వేవ్ ల పేరిట విరుచుకుపడుతున్న ఐపీఎల్ ఈసారి దేశంలోనే జరుగబోతోంది. మార్చి 26న దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభం కాబోతోంది.
తమ ప్రాంత జట్టును ప్రోత్సహించడానికి.. అభిమాన ఆటగాళ్ల మెరుపులు చూడటానికి క్రికెట్ ఫ్యాన్స్ అంతా రెడీ అయ్యారు. తొలి మ్యాచ్ డిఫెడింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య సాయంత్రం 7.30 గంటలకు ఆరంభం కానుంది. ఫస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అభిమానులంతా టీవీలకు అతుక్కుపోవడానికి సిద్ధమయ్యారు.
కరోనా దృష్ట్యా ఈసారి ఆటగాళ్లను విమానాల్లో తరలించకూడదని బీసీసీఐ మ్యాచ్ లన్నీ ముంబై, ఫుణేలోనే పెట్టేసింది. రోడ్డు మార్గంలో బస్ లోనే వారిని తరలించనుంది.కరోనా నుంచి ఆటగాళ్లను రక్షించడానికి ఈ ప్రయత్నం చేసింది.
గతంలో 8 టీంలు ప్రతి టీం ప్రత్యర్థి టీంలతో ఇంటా బయటా రెండూ మ్యాచ్ లు చొప్పున ఆడేవి. ఈసారి 10 జట్లు కావడంతో అలా ఆడడానికి చాలా టైం పడుతుంది. అందుకే ఈసారి మార్పులు చేశారు. 10 టీంలను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపులోని జట్లు వాళ్ల టీంలోని నాలుగు జట్లతో రెండు మ్యాచ్ లు ఆడుతాయి. ఇక మరో గ్రూపులోని ఒక టీంతో రెండు మ్యాచ్ లు.. మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతాయి. మొత్తం 14 మ్యాచ్ లు ఒక టీం ఆడుతుంది.
-ఐపీఎల్ లో ఏ గ్రూపులో ఏ జట్టంటే?
గ్రూప్ ఏ:
ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్,రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్,
గ్రూప్ బి:
చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్.