
Inspirational Story : ఐపీఎల్ క్రికెట్ గురించి తెలియని క్రీడాభిమానులు లేరు. ఈ సీజన్ సమయంలో వారికి పండుగ వాతావరణంలా ఉంటుంది. డిజిటల్ విప్లవం మొదలయ్యాక ఐపీఎల్ ను టీవీల్లో కాకుండా అంతా మొబైల్ ద్వారానే వీక్షిస్తున్నారు. రకరకాల యాప్ లను డౌన్లో డ్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి అప్లపికేషన్లలో ‘డ్రీమ్ 11’ యాప్ ప్రత్యేకత సంతరించుకుంది. ఈ యాప్ ద్వారా క్రికెట్ మాత్రమే కాకుండా హాకీ, ఫుట్ బాల్, కబడ్డీ, బాస్కెట్ బాల్ వంటివి ఆడుతూ ఉంటారు. ఆయా విభాగాల క్రీడాకారులు దీనికి ఎక్కువగా ఆదరించడంలో 2019 ఏప్రిల్ లో యూనికార్న్ క్లబ్ లోకి చేరి మొదటి ఇండియన్ గేమింగ్ కంపెనీగా అవతరించింది.
డ్రీమ్ 11 ను సృష్టికర్త హర్ష జైన్. ఐపీఎల్ మొదటి సీజన్లోనే డ్రీమ్ 11 ను స్ట్రాట్ చేయానుకున్నాడు. కానీ నిధుల కోసం సంవత్సరాల తరబడి వెయిట్ చేశాడు. ఈ రెండు సంవత్సరాల్లో క్యాపిటల్ కోసం 150 మందని సంప్రదించినా ఎవరూ ఒప్పుకోలేదు. తన ఆలోచనలకు పెట్టుబడి పెట్టలేమని చెరప్పారు. అయితే అతని కాలేజీ ఫ్రెండ్ భవిత్ డ్రీమ్ 11 ప్రాజెక్టుకు తోడుగా ఉండడంతో అతనికి ధైర్యంగా ఉండేది. చివరికి కష్టపడ్డ వీరు ఈ ప్రాజెక్టును స్ట్రాట్ చేశారు.
నేడు డ్రీమ్ 11 కంపెనీ 8 బిలియన్ డాలర్ల (రూ.65000 కోట్లు) కంపెనీగా అవతరించింది. ఈ యాప్ ను సుమారు 150 మిలియన్స్ యాక్టివేట్ చేసుకున్నారు. భారతదేశంలోని యువ ధనవంతుల్లో హర్ష జైన్ ఒకరిగా నిలిచారు. వీరు 2010 జూలైలో ముంబైలోని రెడ్ డిజిటల్ అనే సోషల్ మీడియా ఏజెన్సీని స్థాపించారు. ఆ తరువాత హర్ష జైన్2017లో ఫెడరేషన్ ఆప్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ కు అధ్యక్షుడయ్యాడు.

1986లో ముంబైలో జన్మించిన హర్ష జైన్ ప్రాథమిక చదువునంతా గ్రీన్ లాస్ హైస్కూల్లో చేశాడు. ఆ తరువాత ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆప్ సైన్స్ చేశారు. 3013లో హర్ష డెంటిస్ట్ అయిన రచనాను వివాహం చేసుకున్నారు. వీరికి క్రిష్ అనే కుమారుడు ఉన్నారు. చదువుకునే రోజుల్లోనే హర్ష్ జైన్ కు ఓపెన్ క్రికెట్ క్లబ్, ఇంట్రామ్యూరల్ ఫుట్ బాల్ వంటి పోటీల్లో యాక్టివ్ గా ఉన్న ఆయన ఇప్పుడు భారతీయ ధనవంతుల్లో ఒకరుగా నిలవడంపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.