Congress vs BJP : తెలంగాణ ప్రస్తుతానికి కాంగ్రెస్ దే.. కానీ..

రెడ్డిలు తెలంగాణలో బలమైన అసంఖ్యాకంగా ఉన్న సామాజికవర్గం. వాళ్లు ఇన్ని రోజుల నుంచి అధికారానికి దూరంగా ఉన్నారు. ఇది కూడా కాంగ్రెస్ ప్రభావవంతంగా పెరగడానికి కారణం అవుతోంది. మూడోది కర్ణాటక ఎన్నికల విజయం తర్వాత తెలంగాణపై కాంగ్రెస్ లో భారీ ఆశలు పెరిగాయి.

Written By: NARESH, Updated On : July 7, 2023 6:20 pm
Follow us on

Congress vs BJP : తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా కనిపిస్తోంది. రెండో స్థానానికి బీఆర్ఎస్, బీజేపీ పోటీ పడే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇదీ పరిస్థితి. ఇంకో 5 నెలలు తెలంగాణ ఎన్నికలకు సమయం ఉంది. కనీసం 3 నెలల సమయం అయితే ఎన్నికలకు ఉంది.

కాంగ్రెస్ కు తెలంగాణలో ఉన్న బలం ఏంటయ్యా అని చూస్తే.. ఎప్పటి నుంచో నియోజకవర్గాల్లో ఉన్న బలమైన నాయకులే కాంగ్రెస్ కు కొండంత అండగా ఉన్నారు. వాళ్లకు కలిసి వచ్చే అంశమే ఇదీ. తెలంగాణలో అత్యంత ప్రభావం చూపే రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్ కు అత్యంత కీలకంగా ఉంది. రెడ్డి బలమైన నేతలందరూ కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇదంతా అంతర్లీనంగా జరుగుతోంది. నాయకులందరూ కూడా రెడ్డి కులాన్ని ఏకం చేయాలనే తలంపుతోనే కాంగ్రెస్ కింద ర్యాలీ అవుతున్నారు.

రెడ్డిలు తెలంగాణలో బలమైన అసంఖ్యాకంగా ఉన్న సామాజికవర్గం. వాళ్లు ఇన్ని రోజుల నుంచి అధికారానికి దూరంగా ఉన్నారు. ఇది కూడా కాంగ్రెస్ ప్రభావవంతంగా పెరగడానికి కారణం అవుతోంది. మూడోది కర్ణాటక ఎన్నికల విజయం తర్వాత తెలంగాణపై కాంగ్రెస్ లో భారీ ఆశలు పెరిగాయి.

తెలంగాణలో కేసీఆర్ కుటుంబంపై ఉన్న వ్యతిరేకత బాగా పెరిగిపోవడంతోనే కాంగ్రెస్ వైపు మొగ్గు కనిపిస్తోంది. బీజేపీ అధ్యక్షుడి మార్పు.. సైలెన్స్ తో ఆ పార్టీ ప్రభావం పడిపోయింది. ఇక కాంగ్రెస్ పరిస్థితి పీక్ స్టేజీకి చేరింది. ఐదు నెలలు ఈ కాంగ్రెస్ మేనియాను కాపాడుకోవాలి. అప్పుడే అధికారం సాధ్యం.

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..