ABN RK Konda : అటు ఏపీలో చూసినా.. ఇటు తెలంగాణలో చూసినా చంద్రబాబును వదిలేసి మిగతా ప్రత్యర్థులను టార్గెట్ చేయడంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణది అందెవేసిన చేయి. ముఖ్యంగా అక్కడ జగన్ ను ఇటు కేసీఆర్ ను ఏకిపారేయడమే పనిగా పెట్టుకున్నారు. వీరి వ్యతిరేకులనే ఇంటర్వ్యూలకు పిలుస్తూ వారిపై వ్యతిరేకతను వెదజల్లుతున్నారు.

ఈ క్రమంలోనే కేసీఆర్ తొలి తెలంగాణ ప్రభుత్వంలో ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వరరెడ్డి 2019 సార్వత్రిక ఎన్నికల వేళ టీఆర్ఎస్ విధానాలు. కేసీఆర్ తీరు నచ్చక కాంగ్రెస్ లో చేరారు. అనంతరం ఇప్పుడు బీజేపీలో కొనసాగుతున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కేసీఆర్ సీక్రెట్స్ అన్నీ బయటపెట్టి కడిగేశారు.
రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదని.. టీఆర్ఎస్ ఒత్తిడి మేరకే వచ్చానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇక తనకు పదేళ్ల క్రితం కేంద్ర రైల్వే శాఖ మంత్రి పేరు కూడా తెలియదని.. అలాంటిది రాజకీయాల్లో ఇంత యాక్టివ్ గా ఉంటానని అనుకోలేదని వివరించారు. టీఆర్ఎస్ వాళ్లు పార్టీలోకి రావాలని రెండు మూడేళ్లు వెంబడి పడ్డారని.. నాకు తెలుగు రాదని అంటే మీ తెలుగే బాగుంటుందని ఒత్తిడి తెచ్చి మరీ చేర్చుకున్నారని తెలిపారు.
ఉద్యమ పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ అని చేరానని.. కానీ చేరాక అర్థమైందని.. అది ప్రాంతీయ పార్టీ కాదని.. కుటుంబ పార్టీ అని కొండా సంచలన ఆరోపణలు చేశారు. నన్ను ముందుపెట్టుకొని కేసీఆర్ తెలంగాణకు ద్రోహం చేసుడు మొదలుపెట్టిండు అని సంచలన ఆరోపణలు చేశాడు. నేను పార్టీ మారలేదని.. తెలంగాణ పార్టీ పోయి తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందని కొండా ఆరోపించారు.
తెలంగాణ కోసం కొట్లాడిన వారంతా బయటకు వచ్చారని.. తెలంగాణ ద్రోహులైన మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, తలసాని , ఎర్రబెల్లి లాంటి వారికి మంత్రి పదవులు ఇచ్చారని కొండా సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పని తెలంగాణలో చచ్చిపోయినట్టేనని అభిప్రాయపడ్డారు. వాళ్లే ఒకరిపై ఒకరు తిట్టుకుంటూ దిగజార్చుకుంటున్నారన్నారు.
మామూలు కేసీఆర్ కాదని.. ఆరోజు ఏదో జరిగింది? బీజేపీపై కేసీఆర్ కోపానికి అదే కారణం అంటూ సంచలన సీక్రెట్స్ ను కొండా బయటపెట్టారు. అయితే దాన్ని కట్ చేసి ఎడిట్ చేయడంతో కేసీఆర్ ఇలా బీజేపీపై ఒంటికాలిపై లేవడానికి అసలు కారణం ఏంటన్నది తెలియకుండా పోయింది. ఈ ఆదివారం ఎపిసోడ్ లో ఆ నిజాలు బయటపడనున్నాయి. అప్పటివరకూ కేసీఆర్ సీక్రెట్స్ కు సంబంధించిన ఈ ప్రోమో తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

[…] […]