Emmanuel macron : భారత్ లో పర్యటనపై ఫ్రాన్స్ అధ్యక్షుడి రియాక్షన్ వైరల్

ఇప్పటికే మిలియన్ వ్యూస్ నమోదు చేసుకుంది. కాగా, ఈ వీడియో ను చూసిన వారు నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. నరేంద్ర మోడీ వల్ల భారత్ తిరుగులేని శక్తిగా ఎదిగిందని వారు అభివర్ణిస్తున్నారు.

Written By: NARESH, Updated On : February 7, 2024 11:04 pm
Follow us on

Emmanuel macron : మన దేశానికి 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి తర్వాత స్వాతంత్రం వచ్చింది. మూడు సంవత్సరాలపాటు బ్రిటీష్ రాజ్యాంగాన్ని పాటించాల్సి వచ్చింది. ఆ తర్వాత 1950 జనవరి 26న మనదైన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి గణతంత్ర దినోత్సవం నిర్వహించుకుంటూ వస్తున్నాం. 2024 నాటికి మన దేశం గణతంత్ర రాజ్యంగా అవతరించి 74 సంవత్సరాలు పూర్తి 75 వ వడి లో అడుగుపెడుతుంది. వందల సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనలో ఉండి.. గణతంత్ర రాజ్యంగా అవతరించిన రోజును పురస్కరించుకొని ప్రతి ఏడాది జనవరి 26న నిర్వహించే వేడుకలకు వివిధ దేశాలకు చెందిన అధినేతలను భారత ప్రభుత్వం పిలుస్తుంది. ఏడాది నిర్వహించిన వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను పిలిచారు. అయితే ఆయనకు అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్న నేపథ్యంలో చివరి నిమిషంలో పర్యటన రద్దయింది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ ను భారత ప్రభుత్వం వేడుకలకు పిలిచింది.

ఢిల్లీలోని ఎర్రకోట లో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో కలిసి ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ గుర్రపు బగ్గీ లో వచ్చారు. సైనిక దళాల కావాతును పరిశీలించారు. 1947 నుంచి 2024 వరకు భారత సాధించిన విజయాలను పరిశీలించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, లౌకిక రాజ్యంగా, సామ్యవాద స్ఫూర్తిని భారత్ ప్రదర్శిస్తున్న తీరును చూసి ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ సంబరపడ్డారు. కళా ప్రదర్శనలు చూసి అబ్బురపడ్డారు. గణతంత్ర దినోత్సవానికి మన దేశానికి వచ్చి 12 రోజులు పూర్తవుతున్నా ఆయన ఇంకా ఆ ఆనందం నుంచి బయటికి తీరుకోలేకపోతున్నారు. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ ఎక్స్ లో పేర్కొన్నారు. ఫ్రాన్స్ నుంచి భారత్ లో విమానం దగ్గర నుంచి మొదలు పెడితే తిరిగి ఫ్రాన్స్ వెళ్ళేంత వరకు పొందిన ప్రతీ అనుభూతిని ఓ వీడియో రూపంలో ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ ట్విట్టర్ ఎక్స్ లో పంచుకొన్నారు.

” భారత్ అందించిన ఆతిథ్యం గొప్పగా ఉంది. ఇక్కడి ప్రజాస్వామ్యస్ఫూర్తి నన్ను ఆకట్టుకుంది. ఈ ప్రాంత ప్రజల కళలు, సంస్కృతి నన్ను అబ్బురపరిచాయి. ఈ దేశంలో గడిపిన ప్రతిక్షణం నాకు గొప్పగా అనిపిస్తోంది . భారత్ ఫ్రాన్స్ దేశానికి వ్యాపార భాగస్వామి మాత్రమే కాదు.. అంతకుమించి..” అని ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ ట్విట్టర్ ఎక్స్ లో రాసికొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మిలియన్ వ్యూస్ నమోదు చేసుకుంది. కాగా, ఈ వీడియో ను చూసిన వారు నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. నరేంద్ర మోడీ వల్ల భారత్ తిరుగులేని శక్తిగా ఎదిగిందని వారు అభివర్ణిస్తున్నారు.