Divorce Bells In Three Popular Heroes’ Lives సినీ ఇండస్ట్రీ ఎంత రంగుల మయంగా ఉంటుందో వారి జీవితాలు అంత చీకట్లో మగ్గుతుంటాయని సినీ విశ్లేషకులు అభిప్రాయడుతుంటారు. ముఖ్యంగా సినీ ప్రముఖుల కాపురాలు ఈ మధ్య కూలిపోతున్నాయి. సమంత-నాగచైతన్య నుంచి మొదలుపెడితే అమీర్ ఖాన్, నటుడు నరేశ్ వరకూ అందరి సంసారాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. కొంతకాలంగా ప్రముఖ హీరోల కుటుంబాల్లోనూ తరచూ గొడవలు జరుగుతున్నట్టు తెలిసింది.

రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్న ఓ యువ హీరో తన భార్య నుంచి విడాకుల పిటీషన్ ను ఎదుర్కొవడానికి రెడీ అయినట్లు సమాచారం. ఆ అమ్మాయి ఎన్నో ఆశలతో హీరోను పెళ్లి చేసుకున్నా ఆశించిన స్థాయిలో జీవితం సాగలేదని అందుకే విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది.
ఆ హీరో భార్యతో ఎక్కువ సమయం గడపడం లేదట.. సాయంత్రం నుంచి తెల్లవారుజామున వరకూ పబ్ లలో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నాడని.. అందుకే అతడి భార్య విడాకులకు అప్లై చేసినట్టు మసాచారం. ఇక విడాకుల వరకూ వెళ్లకుండా పెద్దల సాయంతో సమస్యను పరిష్కరించుకోవాలని ఆ హీరో ఒత్తిడి తెస్తున్నాడట..
ఇక ఇటీవలే పెళ్లి చేసుకున్న మరో యువ హీరో కూడా తన భార్యతో విభేదాలు వచ్చినట్టు తెలిసింది. హీరో తన భార్యతో సమానంగా పెద్ద కుటుంబానికి చెందినవాడే. కానీ వీరిద్దరి మధ్య వ్యతిరేకత అభిప్రాయభేదాలు రావడానికి గల కారణాలు తెలియరాలేదు.
ఇక చాలా కాలం క్రితమే పెళ్లి చేసుకొని ఒక బిడ్డను కూడా కన్న మరో హీరో సంసారం కూడా పెటాకులు కావడానికి రెడీగా ఉందట.. భార్య తన భర్తపై మౌనంగానే నిఘా ఉంచినా కూడా అతడి తాత్కాలిక వ్యవహారాలకు అలువాటు పడి భార్యను పట్టించుకోవడం లేదట సదురు హీరో. కొంతకాలం క్రితమే వీరిద్దరూ దాదాపు విడాకులు తీసుకునే వరకూ వెళ్లారని.. కానీ పరస్పర అవగాహనతోనే సెటిల్ అయ్యారని సన్నిహితులు చెబుతున్నారు. ఇద్దరి మధ్య బంధం అంత దృఢంగా లేదని.. కొనసాగించడానికి ఇద్దరూ రాజీ పడవలసి వస్తోందని సమాచారం.